Bigg Boss Non Stop: హమీదా బండారం బయటపెట్టిన సరయు.. ఫోన్ కాల్స్ అంటూ సీక్రెట్స్ లీక్ చేయడంతో!
బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రియులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని షో ఇది. అంతలా ఈ రియాలిటీ షో దాదాపు ఐదారేళ్లుగా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందనను అందుకుని సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. తద్వారా టెలివిజన్ హిస్టరీలో ఉన్న ఎన్నో రికార్డులను సైతం క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌తో వచ్చేసింది. 'బిగ్ బాస్ నాన్ స్టాప్' పేరిట మొదలైన దీనికి కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బోల్డు బ్యూటీ సరయు రాయ్.. హమీదా ఖతూన్, శ్రీరామ చంద్ర లవ్ ట్రాక్ గురించి షాకింగ్ విషయాలు రివీల్ చేసింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రారంభం
'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్ గత వారమే వైభంగా ప్రారంభం అయింది. ఇది మొత్తం 84 రోజుల పాటు సాగబోతుంది. ఇక, వైభవంగా సాగిన ప్రారంభ ఎపిసోడ్‌లో 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ హౌస్‌లోకి ఎన్నో ఆశలతో ఇచ్చారు. ఇక, దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలాగే, హాట్‌స్టార్‌లో రోజుకు రెండు ఎపిసోడ్స్ పెడుతున్నారు.

నో ఫిల్టర్ గేమ్.. అలాంటి ప్రశ్న
మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లకు 'నో ఫిల్టర్' టాస్కును ఇచ్చాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లు అందరూ రౌండ్‌గా కూర్చుంటారు. అప్పుడు ఒకరు వీల్‌ను తిప్పుతారు. అందులో బాణం గుర్తు ఎవరి వైపు ఉంటే వాళ్లు బిగ్ బాస్ పంపిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నలను ముందుగా రివీల్ చేయరు.. కంటెస్టెంట్లే ఒక కార్డ్‌ను తీసుకోవాలి.

హమీదా లవ్ ట్రాకుల గురించి
'నో ఫిల్టర్' టాస్కులో భాగంగా కంటెస్టెంట్లు అందరికీ బిగ్ బాస్ యూనిట్ బూతులతో కూడిన బోల్డు ప్రశ్నలను పంపించింది. ఇందులో భాగంగానే చాలా మంది ఫిల్టర్ లేకుండా అంటే మనసులో మాటలను సహచరుల ముందు పంచుకున్నారు. ఇందులో గ్లామరస్ కంటెస్టెంట్ హమీదా ఖతూన్‌కు 'మీరు ప్రస్తుతం ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా?' అన్న ప్రశ్న ఎదురైంది.

ఐదో సీజన్‌లో క్లోజ్... రొమాన్స్
హమీదాకు ఈ ప్రశ్న ఎదురవడానికి కారణం ఐదో సీజన్‌లో ఆమె సింగర్ శ్రీరామ చంద్రతో లవ్ ట్రాక్ నడిపించడమే అన్న విషయం తెలిసిందే. మొదట స్నేహితులుగా ఉన్న వీళ్లిద్దరూ ఆ తర్వాత రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేశారు. అంతేకాదు, బయటకు వచ్చిన తర్వాత కూడా పలు పార్టీలను కూడా చేసుకున్నారు. దీంతో వీళ్లిద్దరూ ప్రేమలో పడిపోయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ప్రేమ కాదు అంటూనే క్లారిటీగా
'నో ఫిల్టర్' హమీదా లవ్ ట్రాక్ గురించి ప్రశ్నలు రావడంతో ఆమె దీనిపై తొలిసారి స్పందించింది. ఈ మేరకు 'నేను లవ్ ట్రాక్ నడుపుతున్నానో లేదో తెలీదు. కానీ, కనెక్షన్ అయితే ఒకరితో ఉంది. అది ఎవరో మీ అందరికీ తెలుసు. మా వరకూ అయితే ఇద్దరం ఫ్రెండ్స్‌గా ఉంటున్నాము. అంతకు మించి ఏమీ లేదని చెప్పగలను' అంటూ ఈ హాట్ బ్యూటీ క్లారిటీ ఇచ్చేసింది.

సరయుపై ఆగ్రహం.. వద్దంటూ
తాను కనెక్షన్ అయిన పర్సన్ ఎవరో అందరికీ తెలుసు అని హమీదా అన్న తర్వాత.. సరయు రాయ్ సహా పలువురు ఆ వ్యక్తి ఎవరో చెప్పాలంటూ గొడవ చేశారు. కానీ, ఆమె మాత్రం పేరు చెప్పడానికి నిరాకరించింది. ఆ తర్వాత పేరు చెప్పమని అనడంతో సరయుపై ఆమె ఫైర్ అయింది. క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండి ఇలా అందరి ముందు అడగడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

సీక్రెట్స్ లీక్ చేసేసిన సరయు
ఆ తర్వాత సరయు మాట్లాడుతూ.. 'ఇందులో తప్పేముంది? మీ ఇద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని అనుకున్నా. నువ్వు ఫోన్ చేసిన ప్రతిసారీ ఆయన గురించి మాట్లాడతావు. దానికి ఎవరైనా ఏమని అనుకుంటారు' అంటూ వీళ్లిద్దరి సీక్రెట్ ట్రాక్‌ను బయట పెట్టేసింది. దీంతో హమీదా, శ్రీరామ చంద్ర మధ్య నిజంగానే లవ్ ట్రాక్ నడుస్తుందన్న విషయం లీక్ చేసినట్లైంది.


Click it and Unblock the Notifications











