Bigg Boss Non Stop: అక్కడ ముద్దు పెట్టేవాడు.. అదయ్యాక హ్యాండ్ ఇచ్చాడు.. అషు రెడ్డి లవ్‌లో ట్విస్ట్!
తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది అమ్మాయిలు సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా సినిమాల్లోకి, సీరియళ్లలోకి ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ అషు రెడ్డి ఒకరు. డబ్‌స్మాష్ వీడియోల ద్వారా ఫుల్ పాపులర్ అయిన ఈ భామ.. బిగ్ బాస్ షో వల్ల మరింత క్రేజ్‌ను సంపాదించుకుంది. మూడో సీజన్‌లో ఎంతో సందడి చేసిన అషు.. ఇప్పుడు ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చింది. గతంలో కంటే ఇప్పుడు ఎంతో హైలైట్ అవుతూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అషు రెడ్డి తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి వివరించింది. ఈ క్రమంలోనే ఎన్నో షాకింగ్ విషయాలు చెప్పింది. ఆ సంగతులు మీకోసం!

నాన్ స్టాప్ సీజన్‌లో కంటెస్టెంట్‌గా
బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా హడావిడి చేసిన అషు రెడ్డి.. ఆ తర్వాత బోల్డుగా వ్యవహరిస్తూ ఎంతో పాపులర్ అయింది. ఈ క్రమంలోనే పలు సినిమాలు.. షోల ఆఫర్లను కూడా అందుకుంది. అప్పటి నుంచి తీరిక లేకుండా ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ భామ.. ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంటరైంది.

గతంలో కంటే బోల్డుగా కనిపిస్తూ
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎక్కువగా లేడీ కంటెస్టెంట్లే ఉన్నారు. అందులోనూ కొందరు మాత్రమే బోల్డుగా వ్యవహరిస్తూ బాగా హైలైట్ అయ్యారు.అందులో అషు రెడ్డి ఒకరు. ఈమె తన ప్రవర్తనతో మరింత హైలైట్ అవుతోంది. గత బిగ్ బాస్ మాదిరిగా కాకుండా ఈ సారి మెచ్యూర్‌గా ఉంటూనే డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు మాట్లాడుతూ మరింత సందడి చేసేస్తోంది.

తలుపు తట్టిన ప్రేమ అనే టాస్క్
బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌లో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఇంట్లోని కంటెస్టెంట్లకు 'తలుపు తట్టిన ప్రేమ' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రతి కంటెస్టెంట్ తన మొదటి ప్రేమ అనుభవం గురించి వెల్లడించాలని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే ఇంట్లోని వాళ్లందరూ తమ మొదటి ప్రేమ అనుభవాన్ని మిగిలిన వాళ్లతో పాటు ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు.

20 ఏళ్లకు ప్రేమలో పడిపోయా
తన ప్రేమకథ గురించి అషు రెడ్డి వివరిస్తూ 'నాకు అప్పుడు 20 ఏళ్లు. ఆ సమయంలో ఓ వ్యక్తితో ప్రేమలో పడిపోయా. తను నేను కనిపించగానే నుదుటిపై ముద్దులు పెట్టేవాడు. అలా చిన్న చిన్న పనులు చేసేవాడు. అంత క్యూట్‌గా మా ప్రేమకథ నడిచింది. ఇద్దరం మాట్లాడుకోవడం.. కలుసుకోవడం ఇలా చాలా ఎంజాయ్ చేశాం. ఇదంతా నా ఫ్రెండ్‌కు చెప్పేదాన్ని' అని వెల్లడించింది.

ఇంట్లో తెలియడంతో కండీషన్
అషు రెడ్డి మాట్లాడుతూ.. 'మా ప్రేమ గురించి ఇంట్లో తెలిసిపోయింది. దీంతో నన్ను చాలా రోజుల పాటు హౌస్ అరెస్ట్ చేశారు. అప్పుడు మా వాళ్లు ముందు యూఎస్ వెళ్లి ఎంబీఏ పూర్తి చేసుకుని రా అని చెప్పారు. ఈ విషయం తనకు చెప్పగానే అతడు కూడా వస్తానన్నాడు. అలా నన్ను ఫ్లైట్ ఎక్కించేసి.. తను మాత్రం ఇక్కడే ఉండిపోయాడు' అంటూ ఎమోషనల్ అయిందామె.

దూరం పెరిగింది... చెప్పలేదు
'ఒకసారి తను విజిటింగ్ వీసా మీద యూఎస్ వచ్చాడు. అప్పుడు అతడి ప్రవర్తనలో తేడా కనిపించింది. అప్పుడు దూరంగా ఉందామని అన్నట్లుగా నాకు చెప్పాడు. ఇక, నేను చదువు పూర్తి చేసి రాగానే.. ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ, వాడు నన్ను దూరం పెడుతున్నాడని చెప్పలేకపోయా. అలా చెప్తే నేనే ఎదవను అవుతానని సైలెంట్‌గా ఉండిపోయాను' అని అషు చెప్పింది.

డిప్రెషన్.. అన్నీ షేర్ చేసేశా
'ఆఖరికి అతడికి నాకు సెట్ కావడం లేదని తెలుసుకున్నా. ఆ సమయంలోనే చాలా డిప్రెషన్‌కు వెళ్లిపోయాను. అప్పుడే ఇలా చేతిని కోసుకున్నా. ఇక, ఈ విషయాలన్నీ నా ఫ్రెండ్‌కు షేర్ చేసుకున్నా. అప్పటి వరకూ నాకు సపోర్ట్ చేసిన ఆమె.. ఇక బ్రేకప్ చెప్పమని చెప్పింది. అందుకు తగ్గట్లుగానే అతడిని వదిలేశాను. ఆ తర్వాత కెరీర్‌పై దృష్టి పెట్టాను' అని అషు ఏడ్చేసింది.

అషు లవ్ స్టోరీలో ట్విస్ట్ ఇదే
అషు తన ప్రేమకథను వివరించిన తర్వాత హౌస్‌లోని కంటెస్టెంట్లు 'మరి ఇప్పటి వరకూ తనతో ఎప్పుడూ మాట్లాడలేదా' అని అడిగారు. దీనికి ఆమె 'వాడు పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు.. నేను నా లవ్‌ను షేర్ చేసుకున్న నా క్లోజ్ ఫ్రెండ్‌నే' అంటూ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో హౌస్‌లోని వాళ్లతో పాటు ఇది చూసిన కంటెస్టెంట్లు కూడా షాక్‌కు గురయ్యారు.


Click it and Unblock the Notifications











