Don't Miss!
- News
కరోనాకేసుల ఊగిసలాట: కాస్త తగ్గిన కొత్తకేసులు; లక్షా ఏడువేల యాక్టివ్ కేసులు!!
- Technology
భారత మార్కెట్లోకి OnePlus Nord 2T 5G విడుదల.. ధర ఎంతంటే!
- Finance
Multibagger Stock: ఇన్వెస్టర్లను ధనవంతులు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్.. లక్ష పెట్టిన వారికి రూ.5 లక్షలు..
- Automobiles
ఆటమ్ వాడెర్ ఇ-బైక్‌ని లాంచ్ చేసిన హైదరాబాద్ కంపెనీ.. మొదటి 1000 మంది కస్టమర్లకు బంపర్ ఆఫర్!
- Sports
India vs England 5th Test Weather : తొలి రోజు వర్షార్పణమే.. ‘టెస్ట్’ పెట్టనున్న వరుణ దేవుడు..!
- Lifestyle
ఈ 5 రాశుల తండ్రులు వారి పిల్లల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తారు..అందుకే చెడ్డ నాన్నలు కావచ్చు...
- Travel
సీనియర్ సిటిజన్స్‌తో ట్రావెల్ చేస్తే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Bigg Boss Non Stop Final List :పాత వాళ్ళే కాదు కొత్తవాళ్ళు కూడా.. ఎవరెవరు ఉన్నారంటే?
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేందుకు సిద్దమయింది. మునుపెన్నడూ లేని విధంగా 24 గంటల నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 26 శనివారం సాయంత్రం 6 గంటల నుంచి బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ప్రసారం కానుంది.
నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమం డిస్నీ హాట్ స్టార్‌లో 24 గంటలు నిరంతరాయంగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక ఇప్పటికే బిగ్ బాస్‌కి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై క్లారిటీ వచ్చేసింది.. దానికి సంబంధించిన లిస్ట్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.

కంటెస్టెంట్లుగా
ఫిబ్రవరి 26 శనివారం నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో ఈ షో ప్రారంభం కానుండగా 3, 4, 5 సీజన్లకు హోస్ట్‌గా హ్యాట్రిక్ కొట్టిన నాగార్జున బిగ్ బాస్ ఓటీటీకి హోస్టింగ్ చేయబోతున్నారు. అయితే ఈ బిగ్‌బాస్ ఓటీటీ అనే కాన్సెప్ట్ మొదలయినప్పటి నుంచి కంటెస్టెంట్లుగా ఎవరు అనే విషయంపై తెగ చర్చ నడుస్తోంది.

పాత వాళ్ళు
ఇందులో మాజీ కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా.. కొత్తవారు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ క్వారంటైన్లో ఉన్నారు. ఇక మాకందిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కంటెస్టెంట్స్‌గా రాబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ ఒక సారి పరిశీలిద్దాం ముమైత్ ఖాన్ (సీజన్ 1 కంటెస్టెంట్) తేజస్వి (సీజన్ 2 కంటెస్టెంట్), అషు రెడ్డి (సీజన్ 3 కంటెస్టెంట్)లు ఉండనున్నారు.

ఇంకా ఎవరెవరు అంటే
అలాగే అరియానా గ్లోరి (సీజన్ 4 కంటెస్టెంట్), మహేష్ విట్టా (సీజన్ 4 కంటెస్టెంట్), సరయు (సీజన్ 5 కంటెస్టెంట్), హమీదా (సీజన్ 5 కంటెస్టెంట్), నటరాజ్ మాస్టర్ (సీజన్ 5 కంటెస్టెంట్), రోల్ రైడ(సీజన్ 2 కంటెస్టెంట్) లు కూడా ఉన్నారు.

కొత్త వారు ఎవరంటే
ఇక కొత్తగా షోలోకి వచ్చే కొత్త వారి లిస్టు ఇలా ఉంది. బెస్ట్ ఆఫ్ ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ చొక్కారపు స్రవంతి, ఆవకాయ బిర్యానీ, రామరామ కృష్ణ కృష్ణ సినిమాల హీరోయిన్ బిందుమాధవి, యూట్యూబ్ యాంకర్ శివ ఉన్నారు.
అంతేకాక యూట్యూబ్ యాంకర్ నిఖిల్, ఆర్జే చైతు, శ్రీ రాపాక, మిత్రా శర్మ, అజయ్ కుమార్ కర్తాపూర్, చిచ్చా చార్లెస్ లు ఉన్నారు. వీరిలో ఒకరిద్దరిని సేఫ్ సైడ్ గా ఉంచుకున్నారు. మొత్తానికి 19 మంది ఉండనుండగా మొదటి రోజు మాత్రం ఒకరిని సీక్రెట్ రూమ్ లో ఉంచే అవకాశం ఉందని అంటున్నారు.

రెండు రోజుల గాప్
ఇక బిగ్‌బాస్ ఓటీటీ దాదాపు 84 రోజులు.. అంటే 12 వారాలు ఉండే అవకాశం ఉందని.. ప్రేక్షకుల రెస్పాన్స్ బట్టి మరిన్ని రోజులు పెంచుకునేందుకు ఆలోచిస్తున్నారని టాక్. అయితే ఇది 24 గంటలు స్ట్రీమింగ్ చేసే షో కనుక ముందుగానే స్ట్రీమింగ్ చేయకుండా కనీసం రెండు రోజులు వెనక్కి ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి. రెగ్యులర్ బిగ్ బాస్ ఈ రోజు జరిగింది రేపు చూపిస్తారు. కాని ఇక్కడ మాత్రం రెండు రోజుల క్రితం జరిగింది ఈ రోజు చూపిస్తారని టాక్.