Bigg Boss Non Stop: వోటింగ్ లెక్కలు... ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆసక్తికరంగా సాగుతుంది. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అందులో గత సీజన్లో పాల్గొన్న వారిని వారియర్స్ అని కొత్తగా అడుగుపెట్టిన వారిని చాలెంజర్స్ అని పిలుస్తున్నారు. ఇప్పటికే మొదటి వారం పూర్తి కాగా రెండో వారం చివరికి చేరింది. మొదటి వారం ఎవరూ ఊహించని విధంగా వారియర్స్ లో ఒకరైన ముమైత్ ఖాన్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. మరి రెండో వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనేది ఓటింగ్ శాతాన్ని బట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

11 మంది కంటెస్టెంట్స్
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు రెండో వారం పూర్తి చేసుకోబోతోంది. ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి మొత్తం రెండు టీములు కలిపి 11 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో ఏడుగురు వారియర్స్ టీమ్ నుంచి నామినేట్ అయిన నలుగురు ఛాలెంజర్స్ టీంకు చెందిన వారు నామినేట్ అయ్యారు.

సేఫ్ అయిపోవడం ఖాయమని
నామినేషన్స్ అయితే జోరుగా జరగడంతో 11 మంది లిస్ట్ లోకి వచ్చి చేరారు కానీ వీరందరిలో డేంజర్ జోన్ లో ఉన్నది మాత్రం ముగ్గురే అని తెలుస్తోంది. ఇక అందరి పరిస్థితి ఎలా ఉంది అనేది పరిశీలిద్దాం. నిజానికి వారియర్స్ లో ఉన్న వారియర్స్ లో నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టాలు డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ.. వారు సేఫ్ అయిపోవడం ఖాయమని అంటున్నారు.

టాప్ ప్లేస్ లో
ఇక వారిలో ఉన్న అఖిల్, అరియానా ఇద్దరూ కూడా ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నారని తెలుస్తోంది. కాబట్టి వీరిద్దరూ ఎలిమినేట్ అయ్యే ప్రసక్తే లేదు. అషురెడ్డి, హమీద ఇద్దరూ కూడా సేఫ్ జోన్ లో ఉన్నారని టాక్. అయితే గత వారం చావు తప్పి కన్ను లొట్ట పోయిన సరయుకి కూడా ఓట్లు బాగా పడ్డాయని అంటున్నారు.

ఓటింగ్ లో వెనకబడ్డారని
ఇక ఛాలెంజర్స్ టీమ్ లో అనిల్ రాథోడ్, మిత్రా శర్మ, శ్రీరాపాక డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. యాంకర్ శివకి అయితే ఓటింగ్ బాగానే జరుగుతుంది. అనిల్ రాథోడ్, మిత్రా శర్మ, శ్రీరాపాక ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా. ఇప్పటివరకు జరిగిన అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ లో ప్రకారం ఓటింగ్ చూస్తే మాత్రం అనిల్ కంటే శ్రీరాపాక, మిత్రశర్మ ఓటింగ్ లో వెనకబడ్డారని తెలుస్తోంది.

మొదలు కాకముందే
ఇక తాజాగా జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో అనిల్ రాథోడ్ విన్నర్ గా నిలిచాడు. అతడు కనుక ఈ వారం సేఫ్ అయినట్టే. మిత్ర శర్మ, శ్రీ రాపాక ఇద్దర్లో ఎలిమినేషన్ టెన్షన్ నెలకొంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంతే కాక వారం ఆమె ఎలిమినేట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. ఆమె ఒకరకంగా ఇప్పటికీ ఆట మొదలు పెట్టలేదు. మరి ఇంకా ఆట కూడా మొదలు కాకముందే ఎలిమినేటి అవుతుందా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications











