Bigg Boss Non Stop : ఈ వారం మరో స్ట్రాంగ్ లేడీ ఔట్.. ఎలిమినేట్ అయ్యేదెవరంటే?
ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ ఐదో వారం చివరికి వచ్చేసింది. ప్రతి ఆదివారం నాగార్జున హౌస్ లోపలికి వచ్చి ఒక హౌస్ సభ్యులని ఎలిమినేట్ చేస్తారు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నలుగురు సభ్యులు అలాగే ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎప్పటిలాగే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే విషయం ముందు రోజే లీక్ అయింది.. ఈ విషయం మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

నామినేషన్ ప్రక్రియలో కూడా షాక్
నిజానికి ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎపిసోడ్ ప్రారంభం అయిన నాటి నుంచి ఏదో ఒక షాకింగ్ విషయాన్ని ప్రేక్షకులకు చూపించేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కొత్త రకమైన టాస్కులు, కొత్త కొత్త పద్ధతులు కూడా ప్రవేశపెట్టడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఇప్పటికే చాలా సార్లు బిగ్ బాస్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన నిర్వాహకులు తాజాగా నామినేషన్ ప్రక్రియలో కూడా షాక్ ఇచ్చారు.

సేవ్ అయ్యే అవకాశం
నిజానికి ఐదో వారం నామినేషన్స్‌లో బిందు మాధవి, యాంకర్ శివ, అరియానా, అషురెడ్డి, అనిల్, మిత్రా శర్మ, మహేష్ విట్టా ఈ ఏడుగురు ఉండగా.. ఆ తర్వాత ఎపిసోడ్‌లో లెక్కలు మారిపోయాయి. నామినేషన్స్‌లో ఉన్న వాళ్లు కొంతమందికి సేవ్ కాగా.. మరికొంతమంది ఈ నామినేషన్స్ లిస్ట్‌లో చేరారు. నామినేషన్స్‌లో రెండవ లెవల్ ఉంటుందని నామినేట్ అయిన సభ్యులకి సేవ్ అయ్యే అవకాశం ఇచ్చారు.

ఎవరెవరు ఉన్నారంటే
సమయానుసారంగా బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్‌లను ఎదుర్కోవాలని.. వాటిలో గెలిచిన వాళ్లు సేవ్ అవుతారని చెప్పారు.. ఎలా మధ్యలో స్వైప్ చేసే టాస్క్ ఇవ్వడంతో దానిని వాడుకుని అషు, మహేష్ విట్టా దీని నుంచి సేఫ్ అయ్యారు. దీంతో వారిలో మొత్తం బిందు మాధవి, మిశ్రా శర్మ, యాంకర్ శివ, అరియానా గ్లోరీ, స్రవంతి చొక్కారపు, తేజస్వీ మదివాడ, అనిల్ రాథోడ్‌లు నామినేట్ అయ్యారు.

తక్కువ శాతం
వీరిలో ఎవరు ఎలిమినేట్ అయి బయటకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఎయిర్ పోర్ట్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు నీ విషయం మీద ముందే లీక్ లు బయటకు వచ్చాయి . సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ వారం స్రవంతి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఆమెకు ఓటింగ్లో తక్కువ శాతం వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది..

ఇద్దరు అయితే
మిగతా కంటెస్టెంట్ లతో పోలిస్తే ఆమెకు చాలా తక్కువ శాతం ఓట్లు వచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ లాంటిది ఏదైనా ప్లాన్ చేసి ఉంటే కనుక ఆమెతోపాటు తేజస్విని ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి ఇద్దరినీ పంపించడమో లేకపోతే ఇద్దరిలో ఒకరిని సీక్రెట్ రూమ్ లో ఉంచి కొన్ని రోజుల తర్వాత మళ్లీ ప్రవేశపెట్టే ప్రక్రియ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి ఆదివారం నాడు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











