Bigg Boss Non Stop: అషు, ఆరియానా, తేజస్వీ అసభ్యంగా.. లవర్స్, కిస్‌లు, ఆ పార్ట్‌కు సర్జరీలు అంటూ!

అసలేమాత్రం అంచనాలు లేకుండానే.. ఎన్నో అనుమానాల నడుమ మొదలైన షో బిగ్ బాస్. అలా వచ్చినా.. తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో భారీ స్థాయిలో స్పందనను అందుకుంది. దీంతో ఆరంభంలోనే సూపర్ డూపర్ హిట్ షోగా పేరొందింది. దీంతో నిర్వహకులు సరికొత్త ప్రయోగాలతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఐదింటిని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్‌ను కూడా మొదలు పెట్టారు. గతంలో మాదిరిగా కాకుండా ఇందులో బోల్డు సీన్లను ఎక్కువగా చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా అషు రెడ్డి, ఆరియానా, తేజస్వీలు బూతులతో రెచ్చిపోయారు. ఆ వివరాలు మీకోసం!

సెన్సార్ లేకపోవడంతో ఘాటుగా

సెన్సార్ లేకపోవడంతో ఘాటుగా

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటలు ప్రసారం అవుతోంది. ఇందులో సెన్సార్ లాంటివి ఉండకపోవడంతో బోల్డు కంటెంట్‌ను చూపిస్తున్నారు. డబుల్ మీనింగ్ డైలాగులు, బోల్డు బిహేవియర్‌తో పాటు హాట్ హాట్ సీన్లతో నడుపుతున్నారు. దీంతో ఈ సీజన్ మొదటి నుంచే హైలైట్ అవుతోంది. దీంతో దీనికి మరింత ఎక్కువగా స్పందన దక్కుతూనే ఉంది.

నో ఫిల్టర్ గేమ్.. బూతులతో రచ్చ

నో ఫిల్టర్ గేమ్.. బూతులతో రచ్చ


బిగ్ బాస్ నాన్‌ స్టాప్‌లో తాజా ఎపిసోడ్‌లో హౌస్‌లోని కంటెస్టెంట్లకు 'నో ఫిల్టర్' టాస్కును ఇచ్చారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లు అందరూ రౌండ్‌గా కూర్చుంటారు. అప్పుడు ఒకరు వీల్‌ను తిప్పుతారు. అందులో బాణం గుర్తు ఎవరి వైపు ఉంటే వాళ్లు బిగ్ బాస్ పంపిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నలను ముందుగా రివీల్ చేయరు.. కంటెస్టెంట్లే ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.

 బిందు మాధవి బాయ్‌ఫ్రెండ్‌తో

బిందు మాధవి బాయ్‌ఫ్రెండ్‌తో

'నో ఫిల్టర్' టాస్కులో భాగంగా ముందుగా బిందు మాధవి వంతు వచ్చింది. ఇందులో 'మీరు మళ్లీ మీ పాత బాయ్‌ఫ్రెండ్స్‌లో ఒకరితో కలవాలని అనుకుంటే ఎవరితో కలుస్తారు' అన్న ప్రశ్న ఎదురైంది. దీనికామె 'నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒకరితో లవ్ ట్రాక్ నడిపా. అతడితో మళ్లీ కలవాలని అనుకుంటున్నా. కానీ, ఇప్పుడు తనకు పెళ్లి కూడా అయిపోయింది' అని చెప్పింది.

తేజస్వీ అలాంటి డేటింగ్‌లంటూ

తేజస్వీ అలాంటి డేటింగ్‌లంటూ

'నో ఫిల్టర్' టాస్కులో తేజస్వీ మదివాడకు 'మీరు డేటింగ్ చేస్తున్న సమయంలోనే విషపూరితంగా ఎవరితోనైనా ప్రవర్తించారా' అన్న ప్రశ్న వచ్చింది. దీనికామె ఏమాత్రం మొహమాటం లేకుండానే 'అవును.. నేను ఇద్దరితో రిలేషన్స్ పెట్టుకున్నాను. వాళ్లిద్దరితోనూ అలాగే బిహేవ్ చేశా. అందుకే ఆ రెండూ బ్రేకప్ అయిపోయాయి' అంటూ సూటిగానే సమాధానం చెప్పింది.

 ఆరియానాకు ముద్దుల గురించి

ఆరియానాకు ముద్దుల గురించి


ఎంతో బోల్డుగా సాగిన 'నో ఫిల్టర్' టాస్కులో ఆరియానా గ్లోరికి 'ఎప్పుడైనా మీరు ముద్దు పెడుతుంటే.. ఛీ ఆపింకా అని మీ పార్ట్‌నర్ అన్నారా' అన్న ప్రశ్న ఎదురైంది. దీనికామె 'నేను ఒకరి గురించి చెబితే నేను కాదా అని మరొకరు ఫీల్ అవుతారు. ఇంకొకరి గురించి చెబితే వీళ్లు ఫీల్ అవుతారు' అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అందరూ కేకలు వేస్తూ తెగ నవ్వేసుకున్నారు.

భర్తతో శ్రీయ శరణ్ హాట్ సెల్ఫీ: ఏకంగా బ్రాతో అతడి మీద పడుకుని రచ్చ
https://telugu.filmibeat.com/heroine/shriya-saran-and-andrei-koscheev-romantic-pic-viral-107516.html

అషు రెడ్డి ఒకేసారి ఇద్దరితో అని

అషు రెడ్డి ఒకేసారి ఇద్దరితో అని


బూతులు, డబుల్ మీనింగ్ డైలాగుతో నడిచిన 'నో ఫిల్టర్' టాస్కులో అషు రెడ్డికి 'మీరు ఎప్పుడైనా ఒకేసారి ఇద్దరితో డేటింగ్ చేశారా' అని ప్రశ్న వచ్చింది. దీనికామె 'ఓ.. చాలాసార్లు అలా చేశాను. ఒకేసారి ఇద్దరూ హ్యాండ్సమ్‌గా కనిపించడం నా తప్పా? అసలు వాళ్లిద్దరికీ సమస్య లేనప్పుడు నాకేం ప్రాబ్లం. అందుకే అలా చాలాసార్లు చేశాను' అంటూ బయట పెట్టేసింది.

ఏ పార్టుకు సర్జరీ చేసుకుంటావ్?

ఏ పార్టుకు సర్జరీ చేసుకుంటావ్?


'నో ఫిల్టర్' టాస్కులో అందరికీ రకరకాల బోల్డు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే యాంకర్ శివకు 'మీరు ఎప్పుడైనా కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నారా' అన్న ప్రశ్న వచ్చింది. దీనికి అతడు సమాధానం చెబుతుండగా.. ఆరియానా వచ్చి 'ఒకవేళ భవిష్యత్‌లో సర్జరీ చేయించుకోవాల్సి వస్తే ఏ పార్టుకు చేయించుకుంటావు' అంటూ బోల్డుగా మాట్లాడి అందరికీ షాకిచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X