Bigg Boss Non Stop : ఆసక్తికరంగా కెప్టెన్సీ టాస్క్.. సీజన్లో మొట్టమొదటి కెప్టెన్ గా ఎవరూ ఊహించని వ్యక్తి!
గత శనివారం నాడు అట్టహాసంగా మొదలైన 'బిగ్ బాస్' నాన్-స్టాప్ షో అనుకోకుండా బుధవారం నాడు లైవ్ ఆపాల్సి వచ్చింది. అయితే మళ్ళీ గురువారం అర్ధరాత్రి తర్వాత లైవ్ స్ట్రీమింగ్ మొదలు పెట్టారు. అంతేకాక అంతకుముందు రోజూ ఉదయం ఒక అరగంట, రాత్రి ఒక అరగంట స్పెషల్ ఎపిసోడ్ లు విడుదల చేసే వారు. కానీ ఇప్పుడు రోజుకు గంట ఎపిసోడ్ విడుదల చేస్తున్నారు. అయితే మొదటి వారం రోజులు కావస్తుండటంతో హౌస్ కి మొదటి కెప్టెన్ ను టాస్క్ ల ద్వారా ఎంపిక చేశారు. ఆ వివరాలు

కెప్టెన్సీ కోసం టాస్క్
శనివారం నాడు అట్టహాసంగా ప్రారంభమైన 'బిగ్ బాస్' నాన్-స్టాప్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున 17 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించారు. గత బిగ్ బాస్ సీజన్లలో పాల్గొని అనుభవం ఉన్న బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను వారియర్స్‌గా, కొత్త సభ్యులను ఛాలెంజర్స్‌గా చెబుతూ హౌస్‌లోకి పంపించారు. లోపలికి వచ్చిన రెండు రోజులకే నామినేషన్స్ సెట్ చేసి అందరి మధ్య విభేదాలు సృష్టించిన బిగ్ బాస్ రెండు రోజులుగా హౌస్ లో కెప్టెన్సీ పోటీదారుల కోసం టాస్క్ లు నిర్వహిస్తున్నారు.

వారియర్స్ టీమ్ వాళ్ళే
ఎప్పటిలాగానే ఈ బిగ్ బాస్ సీజన్ లో కూడా కంటెస్టెంట్స్ తో కొన్ని టాస్క్ లు ఆడించి.. ఆ టాస్క్ లలో గెలిచిన కొందరిని కెప్టెన్సీ కంటెండర్స్ గా ఎంపిక చేశారు. అయితే ఈ టాస్క్ లు అన్నింటిలో వారియర్స్ టీమ్ వాళ్ళే ఎక్కువ పాయింట్స్ గెలుచుకోవడంతో వారి టీమ్ నుంచి నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్, మహేష్ విట్టా, సరయు, అరియానా, తేజస్వి లు కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడ్డారు.

ఎవరికి వారు
చివరి టాస్క్ లో భాగంగా స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఉన్న బాక్స్ లని సెలెక్ట్ చేసుకొని, పూల్ లో ఉన్న తాళాలను ఈదుతూ తీసి పూల్ ఒడ్డున బాక్స్ కి సరిపడా ఉన్నాయో లేదో చెక్ చేసి బాక్స్ లో ఉన్న కెప్టెన్సీ పౌచ్ ని బయటకు తీయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో అందరూ వారియర్స్ అయినా ఎవరికి వారు గెలిచేందుకు ఎవరి ప్లాన్లు వాళ్ళు వేసుకున్నారు.

చాలా కష్టపడి
ఎలా అయినా గెలవాలనే ఉద్దేశంతో అఖిల్ అయితే తనకు దొరికిన తాళాలు అన్నింటినీ గుప్పెట్లో పెట్టుకొని మరీ బాక్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. చాలా తాళాలు అఖిల్ దగ్గరే ఉన్నాయి. మొండిగా తన దగ్గర ఉన్న తాళాలు పెట్టి ట్రై చేస్తూనే ఉన్నాడు. వేరే వాళ్లకు తాళాలు దొరక్కుండా చేసినప్పటికీ తేజస్వి కూడా పట్టు వదలకుండా ప్రయత్నిస్తూనే ఉంది. అలా ఆమె మొదటి తాళం చాలా ఈజీగా ఓపెన్ చేసినా.. రెండో తాళం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది.

ఎవరూ ఊహించని విధంగా
ఈ క్రమంలోనే ఈ టాస్క్ లో ఎవరు గెలుస్తారు అనే విషయం కాస్త ఆసక్తికరంగా మారింది. ఎట్టకేలకు ఈ టాస్క్ లో అందరికంటే ముందు తేజస్వి బాక్స్ ను ఓపెన్ చేయడంతో ఆమెను బిగ్ బాస్ నాన్ స్టాప్ కు మొదటి కెప్టెన్ గా ఎంపిక చేశారు. అలా అందరూ అఖిల్ టాస్క్ విన్ అవుతారు అనుకుంటే ఎవరూ ఊహించని విధంగా ఫస్ట్ కెప్టెన్ గా తేజస్వి ఎంపికైంది.


Click it and Unblock the Notifications











