Bigg Boss Non Stop: ఐదో వారం షాకింగ్ ఎలిమినేషన్.. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్.. ఆమె మళ్లీ సేఫ్!

తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూనే ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. సీజన్ సీజన్‌కు సరికొత్త టాస్కులు.. ఊహించని సంఘటనలు.. ఆసక్తిని కలిగించే ఎలిమినేషన్స్ ఇలా ఎన్నో రకాల పరిణామాలతో షో ఆద్యంతం మజాను పంచుతూనే ఉంది. అందుకే తెలుగులో ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో ఊహించని ఎలిమినేషన్స్‌ కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఐదో వారం కూడా షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలిసింది. ఇందులో ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ వెళ్లిపోయిందట. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

మరింత మజాను పంచుతోందిగా

మరింత మజాను పంచుతోందిగా

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ అంతకంతకూ ఆసక్తికరంగా సాగుతోంది. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కంటెంట్‌ను ఇందులో ప్రసారం చేస్తుండడంతో పాటు బోల్డుగా చూపిస్తుండడంతో దీనికి ఆదరణ భారీగా పెరుగుతోంది. ఫలితంగా ఈ సీజన్ మరింత రంజుగా మారుతోంది. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అందుతోంది.

బిగ్ బాస్ నుంచి నలుగురు ఔట్

బిగ్ బాస్ నుంచి నలుగురు ఔట్

నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో 4 వారాల్లో ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయులు బయటకు వెళ్లారు.

ఐదో వారం ఏడుగురు నామినేట్

ఐదో వారం ఏడుగురు నామినేట్

ఐదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ టాస్క్ ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. అయితే, మధ్యలో స్వైప్ చేసే టాస్కును కూడా ఇచ్చారు. దీంతో అషు, మహేశ్ విట్టా దీని నుంచి సేఫ్ అయ్యారు. ఇలా చివరికి ఇందులో మొత్తం బిందు మాధవి, మిశ్రా శర్మ, యాంకర్ శివ, ఆరియానా గ్లోరీ, స్రవంతి చోకారపు, తేజస్వీ మదివాడ, అనిల్ రాథోడ్‌లు నామినేట్ అయిపోయారు.

ఆమెకు ఎక్కువ.. వాళ్లంతా సేఫ్

ఆమెకు ఎక్కువ.. వాళ్లంతా సేఫ్

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బిందు మాధవికి ఐదో వారం ఓటింగ్‌లో ఎక్కువ పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె మరోసారి టాప్‌ ప్లేస్‌లో నిలిచిందట. ఆమె తర్వాత యాంకర్ శివ, ఆరియానా గ్లోరీ, అనిల్ రాథోడ్‌లకు ఎక్కువ ఓటింగ్ జరిగిందని అంటున్నారు. దీంతో వీళ్లంతా ఈ వారానికి కూడా సేఫ్ అయిపోయారని సమాచారం.

ముగ్గురు మాత్రం డేంజర్ జోన్‌

ముగ్గురు మాత్రం డేంజర్ జోన్‌

బుల్లితెర వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. ఐదో వారానికి గానూ ముగ్గురు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలిసింది. అందులో తేజస్వీ మదివాడ, మిత్రా శర్మ, స్రవంతి చోకారపులకు చాలా తక్కువ ఓటింగ్ జరిగిందట. ఇందులో చివర్లో ఉన్న స్రవంతి ఈ వారం ఎలిమినేట్ అవడం ఖాయమన్న టాక్ వినిపించింది. దీంతో ఇదే అందరూ ఫిక్స్ అయిపోయారు.

మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్

మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఔట్

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఐదో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ శనివారమే పూర్తైందట. అందరూ అనుకున్నట్లుగా ఇందులో స్రవంతి చోకారపు కాకుండా.. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ తేజస్వీ మదివాడ ఎలిమినేట్ అయిందని తెలిసింది. రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన ఈమె మధ్యలోనే వెళ్లింది. ఇప్పుడు కూడా అదే జరిగిందని అంటున్నారు.

బిగ్ బాస్ తీరుపై అనుమానం

బిగ్ బాస్ తీరుపై అనుమానం

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఆరంభం నుంచీ ఎలిమినేషన్ షాకింగ్‌గానే జరుగుతోంది. ఇప్పుడు కూడా అదే జరిగిందని తెలుస్తోంది. వాస్తవానికి ప్రైవేట్ పోల్స్ అన్నింట్లోనూ స్రవంతి ఎలిమినేట్ అవుతుందనే ఫలితమే వచ్చింది. కానీ, అనూహ్యంగా తేజస్వీని ఎలిమినేట్ చేశారట. దీంతో బిగ్ బాస్ ఎలిమినేషన్ ఓటింగ్ ప్రకారమే జరుగుతుందా అన్న డౌట్స్ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X