Bigg Boss Non Stop: షోలో శృతి మించిన అశ్లీలత.. టాప్ విప్పేసిన బ్యూటీ.. ఆ కుర్రాళ్లు ఏం చేశారంటే!

సరికొత్త టాస్కులు.. గతంలో ఎన్నడూ చూడని చిత్ర విచిత్రమైన సంఘటనలతో ప్రసారం అవుతూ.. సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తోన్న షో బిగ్ బాస్. దాదాపు 15 ఏళ్ల క్రితమే ఇండియాలో పరిచయం అయిన ఇది.. తెలుగులో మాత్రం చాలా ఆలస్యంగా వచ్చింది. అయితేనేం.. ఆరంభంలోనే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరాభిమానాలను అందుకుని సత్తా చాటింది. దీంతో వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవలే బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట ఓటీటీ వెర్షన్ మొదలైంది. ఇందులో అశ్లీలత రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ లేడీ కంటెస్టెంట్ టాప్ విప్పేసి రచ్చ చేసింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!

అలా వచ్చిన బిగ్ బాస్ నాన్ స్టాప్

అలా వచ్చిన బిగ్ బాస్ నాన్ స్టాప్

ఎన్నో అంచనాల నడుమ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్ ఫిబ్రవరి 26న వైభవంగా మొదలైంది. ఇది మొత్తం 84 రోజుల పాటు ప్రసారం కాబోతుంది. ఈ సీజన్‌లోకి ఏకంగా 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక, దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలాగే, రోజుకు రెండు ఎపిసోడ్స్ చొప్పున విడుదల చేస్తున్నారు.

 వీళ్లే కంటెస్టెంట్లుగా వచ్చేశారుగా

వీళ్లే కంటెస్టెంట్లుగా వచ్చేశారుగా

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో చాలా మంది మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు.

లైవ్ కావడంతో బూతులతో రచ్చ

లైవ్ కావడంతో బూతులతో రచ్చ

గతంలో బిగ్ బాస్ షో టీవీలో ప్రసారం అయ్యేది. అందులో గంట ఎపిసోడ్ మాత్రమే వచ్చేది కాబట్టి.. సెన్సార్ చేసి మరీ విడుదల చేసేవారు. అయితే, ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటలు ప్రసారం అవుతోంది. ఇందులో సెన్సార్ లాంటివి ఉండకపోవడంతో బోల్డు కంటెంట్‌ను బాగా చూపిస్తున్నారు. బూతులు కూడా చాలానే వినిపిస్తున్నాయి.

కంటెస్టెంట్లలో ఆమె స్పెషల్‌గానే

కంటెస్టెంట్లలో ఆమె స్పెషల్‌గానే

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎక్కువగా అమ్మాయిలు కనిపిస్తున్నారు. అందులోనూ బోల్డ్ బ్యూటీలు తెగ సందడి చేస్తున్నారు. ఇలా వచ్చిన వారిలో తెలుగు భామ తేజస్వీ మదివాడ ఒకరు. రెండో సీజన్‌లో రచ్చ చేసిన ఈ బ్యూటీ.. మధ్యలోనే ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఛాన్స్ వచ్చింది. ఇందులో మాత్రం ఆమె చాలా స్పెషల్ అనిపించుకుంటోంది.

 బూతులతో రచ్చ.. అన్నీ చెప్పేసి

బూతులతో రచ్చ.. అన్నీ చెప్పేసి

తేజస్వీ మదివాడ ఎంత బోల్డుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ హౌస్‌లోనూ ఈ అమ్మడు అదే కంటిన్యూ చేస్తోంది. గతంలో కంటే ఈ సారి ఆమె మరింత రెచ్చిపోతోంది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం.. ముక్కుసూటిగా ఎఫైర్ల గురించి రివీల్ చేయడం వంటివి చేస్తోంది. ఫలితంగా తేజస్వీ ఈ సీజన్‌లో తన మార్కును చూపిస్తూ దూసుకుపోతోంది.

క్యాట్ వాక్ చేస్తూ... టాప్ విప్పేసి

క్యాట్ వాక్ చేస్తూ... టాప్ విప్పేసి


తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో వారియర్స్, చాలెంజర్స్ క్యాట్ వాక్ చేస్తూ తెగ సందడి చేశారు. ఇందులో ఆర్జే చైతూ హోస్టుగా ఒక్కొక్కరినీ పరిచయం చేయగా.. అనిల్ రాథోడ్, ఆరియానా గ్లోరి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్, యాంకర్ శివ సహా పలువురు ఇందులో పాల్గొన్నారు. ఇక, చివర్లో వచ్చిన తెలుగు బోల్డు బ్యూటీ తేజస్వీ మదివాడ ఏకంగా టాప్ విప్పేసి మరీ వాక్ చేసి షాకిచ్చింది.

నోరెళ్లబెట్టేసిన కుర్ర కంటెస్టెంట్లు

నోరెళ్లబెట్టేసిన కుర్ర కంటెస్టెంట్లు


తేజస్వీ మదివాడ క్యాట్ వాక్ చేస్తోన్న సమయంలో చాలా బోల్డుగా వ్యవహరించింది. నడుస్తూ వస్తుండగానే ఆమె తన టాప్‌ను విప్పేసి గిరగిరా తిప్పుతూ విసిరేసింది. దీంతో అక్కడే ఉన్న మేల్ కంటెస్టెంట్లు షాకై నోరెళ్లబెట్టేశారు. ఆ తర్వాత తేజస్వీ కూడా సిగ్గు పడుతూ వెళ్లి బెడ్‌పై పడుకుండిపోయింది. దీంతో ఈ ఎపిసోడ్‌లో ఆమె టాప్ తీసేయడమే చాలా హైలైట్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X