Bigg Boss Non Stop: అఖిల్ బ్యాచ్ మోసానికి బొక్కబోర్లా పడిన స్రవంతి.. దారుణంగా వెన్నుపోటు!
బిగ్ బాస్ నాన్ స్టాప్ లో రోబో టాస్క్ ఎంతో ఆసక్తికరంగా కొనసాగింది. అయితే ఈ క్రమంలో చాలామంది స్నేహితులు ఉన్న వారు కూడా విడిపోవాల్సి వస్తోంది. మొన్నటి వరకు ఒక గ్రూపులో ఉన్న వారు ఇప్పుడు అవసరం కోసం మిగతా వారిని బలి చేసే విధంగా మాట్లాడుతున్నారు. మొన్నటి వరకు అఖిల్ బ్యాచ్ లో ఉన్న స్రవంతి ఇప్పుడు ఆ గ్రూపు నుంచి బయటకు వచ్చేసింది. ఇంకా ఆమెకు మద్దతుగా బిందుమాధవి నిలబడే ప్రయత్నం చేసింది. చూస్తుంటే రాబోయే రోజుల్లో స్రవంతి తన ఆటతో నమ్మక ద్రోహం చేసిన వారికి దెబ్బకొట్టేలా ఇలా ఉందని అనిపిస్తోంది. అసలు ఏం జరిగింది అనేది వివరాల్లోకి వెళితే..

అరియానా vs అషు రెడ్డి
బిగ్ బాస్ రోబో ఫ్యాక్టరీ టాస్క్ లో కంటెస్టెంట్స్ చాలావరకు చాలా కఠినంగా పోటీపడ్డారు ఫిజికల్ అటాక్ ఎక్కువగా ఉండడంతో కొంతమంది కంటెస్టెంట్స్ గాయాలను కూడా లెక్క చేయలేదు. అబ్బాయిలు అందరూ కూడా రోబో ఫ్యాక్టరీ పార్ట్స్ కోసం చాలా దూకుడుగా ప్రయత్నాలు చేశారు. ఒకవైపు అరియానా మరోవైపు అషు రెడ్డి కి సహాయం చేస్తూ మిగతా కంటెస్టెంట్స్ కయిన్స్ ను అందుకునే ప్రయత్నం చేశారు.

అఖిల్ కోసం స్రవంతి
ఈ క్రమంలో అఖిల్ బ్యాచ్ లో విభేదాలు తలెత్తడంతో ఆట లో మరొక కీలక ఘట్టం చోటు చేసుకుంది. మొదటి నుంచి కూడా అఖిల్ తన చుట్టూ నలుగురు ఉండే విధంగా ప్రతి విషయంలో సపోర్ట్ చేసే విధంగా జాగ్రత్త పడుతున్నాడు. అజయ్ ప్రాణస్నేహితుడిగా ఆ తర్వాత అషు రెడ్డి స్రవంతి కూడా అతనికి చాలా సహాయం చేశారు. ముఖ్యంగా శ్రవంతి అయితే అఖిల్ లేనిదే నేను లేను అన్నట్లుగా ప్రవర్తించింది.

ఎదురు తిరిగిన స్రవంతి
అఖిల్ ను ఎంతగానో నమ్మిన స్రవంతికి రోబో టాస్క్ లో మాత్రం బొక్క బోర్లా పడిన అనుభవం ఎదురయింది. స్రవంతిని ఇటీవల కూడా దూరం పెట్టేందుకు ప్రయత్నం చేయడంతో ఆమె ప్రత్యర్థి టీం లోకి వెళ్ళిపోయింది. అషు రెడ్డికి కాకుండా అరియానాకు సహాయం చేసే విధంగా ప్రయత్నాలు చేసింది. అంతే కాకుండా మధ్యలో రోబో పార్ట్ లను కూడా దొంగతనం చేసేందుకు కష్టపడింది.

అఖిల్, అజయ్ చీటింగ్!
అయితే రోబో టాస్క్ లో ఒక ఘట్టం ముగిసే సమయానికి కాయిన్స్ ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేయాలని బిగ్ బాస్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో సంచాలకుడిగా ఉన్న మహేష్ ప్రతి ఒక్కరిని గమనించాలి అని ఎవరైనా బజర్ మోగిన తర్వాత కయిన్స్ మార్చుకో వద్దు అని వివరణ ఇచ్చాడు. కానీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా అఖిల్ అజయ్ కు కయిన్స్ ఇచ్చాడు అని స్రవంతి చూసి చెప్పింది.
Recommended Video


నిజం ఒప్పుకున్నారు
ఇక స్రవంతి చూసిన విషయాన్ని మహేష్ కు చెప్పడంతో అది నిజం కాదు అన్నట్లుగా అషు రెడ్డి మాట్లాడింది. అంతేకాకుండా అజయ్ అఖిల్ కూడా తాము అలా చేయలేదు అని అందరి ముందు చెప్పారు. కానీ ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు మాత్రం అది తమ గేమ్ ప్లాన్ అని నిర్మొహమాటంగా వారి మోసం గురించి చెప్పారు. అయితే ఆ విషయాన్ని అక్కడ చెప్పడం అవసరమా అని అజయ్ స్రవంతి ని అడిగాడు.

బాధపడిన స్రవంతి
నువ్వు ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు మేము అలాగే చెప్పామా అంటూ అజయ్ స్రవంతిని అడగడంతో ఆమె కొంత ఫీలయ్యింది. చూసింది చెప్పింది కూడా తప్పైపోయింది అంటూ ఎవరు గ్రూపో ఎవరు పక్కోల్లో అంటూ బాధపడింది. ఇక ఆమె అప్పుడే అక్కడికి వచ్చిన బిందుమాధవి ఆమెకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేసింది. నువ్వు నీ గేమ్ ఆడినందుకు గర్వపడు అని ఆమెకు చెప్పింది.


Click it and Unblock the Notifications











