Bigg Boss Non Stop: ఇక్కడ కూడా వాళ్ళని వదలని అఖిల్.. హగ్గుల కోసం ముమైత్ ఖాన్ తో అలా..
గత శనివారం సరికొత్తగా మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తోంది. అయితే ఈసారి పోటీలోకి అంతగా ఆశ్చర్యపోయే సెలబ్రిటీలు ఎవరు అయితే అడుగుపెట్టలేదు. పాత వాళ్లను మళ్లీ ఛాలెంజర్స్ గ్రూపుగా హౌస్ లోకి రప్పించిన బిగ్ బాస్ ఓటీటీ షో ఈసారి కొట్టిస్తున్నారు అని టాక్ వస్తోంది. ఇక కొత్తగా వచ్చిన వారు కూడా అనుకున్నంత స్థాయిలో ఇంకా షో కు కనెక్ట్ అవ్వలేదు. ఇక మాజీ రన్నరప్ గా నిలిచిన టువంటి అఖిల్ సార్ధక్ మళ్లీ ఎప్పటిలానే తన రొమాంటిక్ యాంగిల్ ను బయటపెడుతుండడం విశేషం. ఇక ఇటీవల అతను ముమైత్ ఖాన్ తో మాట్లాడిన సంభాషణ కూడా హైలెట్ గా నిలిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Recommended Video

బిగ్ బాస్ 5లో..
అఖిల్ బిగ్ బాస్ ఐదో సీజన్లో రన్నరప్ నిలిచిన విషయం తెలిసిందే. చివరి దశలో అనుకోకుండా ఫైనల్ దశకు చేరుకున్నాడు. తప్పకుండా టైటిల్ విన్నర్ గా నిలుస్తారు అని ధీమాగా ఉండగా అతనికి నిరాశే ఎదురయింది. అభిజిత్ ఫైనల్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఒక విధంగా అఖిల్ కు రెమ్యూనరేషన్ తప్పితే ఆ షో ద్వారా ఎలాంటి లాభం లేకుండా పోయింది. అతనికి సినిమా అవకాశాలు కూడా అనుకున్నంతగా రాలేదు.

టైటిల్ వదిలి పెట్టకూడదు అని..
బిగ్ బాస్ సీజన్ 5 నుంచి బయటకు వచ్చిన తర్వాత అఖిల్ సినిమాలతో బిజీ ఇవ్వాలని చాలా ప్రయత్నాలు చేసాడు. కానీ మళ్లీ అతను బిగ్ బాస్ ఓటీటీ ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే విధంగా అడుగులు వేస్తున్నాడు. ఈ షో ఎనభై నాలుగు రోజులపాటు కొనసాగనుంది. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టైటిల్ వదిలి పెట్టకూడదు అనే టైటిల్ విన్నర్ గా నిలవాలని అఖిల్ మొదటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

అమ్మాయిల వెంట అఖిల్
అయితే అఖిల్ వచ్చీరాగానే కొంతమంది అమ్మాయిల వెంట పడుతున్నట్లు తెలుస్తోంది. కొంత మంది అమ్మాయిలను తనదైన శైలిలో అట్రాక్ట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎవరు కూడా అతనికి అంతగా కనెక్ట్ అవ్వడం లేదు అని చెప్పాలి. ఎదో పైకి మాట్లాడుతున్నారు అంతే.

ముమైత్ ఖాన్ తో అలా..
ముమైత్ ఖాన్ కు లేవగానే ఎవరు హగ్గులు ఇవ్వడం లేదు అని మిత్రశర్మ నీ హగ్ కోసం ముమైత్ ఖాన్ వెయిట్ చేస్తోంది అని మాట్లాడుతూ వచ్చాడు. అయితే అక్కడ హగ్స్ కావాల్సింది నాకు కాదు అఖిల్ కు అంటూ ముమైత్ ఖాన్ కూడా అప్పుడే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఏమైనా కూడా అఖిల్ మరోసారి ప్లే బాయ్ గా షో లో హైలెట్ అవ్వాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.

నామినేషన్ లో ఉండకుండా..
అంతేకాకుండా అఖిల్ మొదట నుంచి ఒక్కొక్కరిని గమనిస్తూ తన దైన శైలిలో గేమ్ ప్లాన్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అబ్బాయిలతో ఒకవైపు మంచి గా ఉంటూనే మరోవైపు అమ్మాయిలతో కూడా చాలా సరదాగా మాట్లాడుతున్నాడు వీలైనంతవరకు నామినేషన్ లో ఉండకుండా ముందుకు సాగించాలనే అఖిల్ ప్రణాళికలు రచిస్తున్నట్లు అర్థమవుతోంది.

వారానికి తగ్గట్టుగా..
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బిగ్బాస్ నాన్ స్టాప్ కోసం ఈసారి భారీ స్థాయిలోనే ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. టెలివిజన్ షోకి వచ్చిన కంటెస్టెంట్స్ కు ఏ తరహాలో అయితే పారితోషికాలు ఇచ్చారో ఇప్పుడు ఓటీటీ లో కూడా అదే తరహాలో పారితోషికాలు ఇస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఎనభై నాలుగు రోజుల ప్రయాణం లో ఎవరు ఎక్కువ రోజులు కొనసాగితే.. వారికి వారానికి తగ్గట్లుగా రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











