bigg boss Non stop: బిందు మాధవితో లవ్ ట్రాక్.. అనరాని మాట అనడంతో మరోసారి నవ్వులపాలైన యాంకర్ శివ
బిగ్ బాస్ లో ఎప్పుడు ఎలాంటి గొడవలు జరిగుతాయో చెప్పడం కష్టం. అలాగే ఎప్పుడు ఎవరు స్నేహితులుగా మారతారో కూడా ఊహించడం కష్టం. కంటెస్టెంట్స్ చాలా వరకు గేమ్ ను బట్టి రంగులు మారుస్తూ ఉంటారు. ఇక కొందరు షోలో హైలెట్ అవ్వాలని కెమెరాలు వారి వైపు చూడాలని ఏదో చేయాలని అనుకుంటారు. ఇక అలా హైలెట్ అవ్వాలని చేసిన చాలామంది చివరికి నవ్వుల పాలయ్యారు. ఇక ప్రస్తుతం షోలో యాంకర్ శివ కూడా అలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. షోలోకి వచ్చిన మొదట్లోనే అతనికి అమ్మాయిల నుంచి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇక రీసెంట్ గా బిందు మాధవిని లైన్ లో పెట్టాలని చూసిన అతనికి కోలుకోలేని దెబ్బ పడింది. ఆ విషయాలను చెప్పుకుంటూ అఖిల్ అజయ్ తెగ నవ్వుకున్నారు. ఆ విషయాల్లోకి వెళితే..

యాంకర్ శివకు చేదు అనుభవాలు
బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఎవరికి వారు హైలెట్ అవ్వాలని చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైనంత వరకు సేఫ్ జోన్ లో ఉండాలని ఇప్పుడే ఎక్కువగా రెచ్చిపోకూడదు అని కూడా మెల్లగా వారి అసలు రంగును బయట పెడుతున్నారు. అయితే కొత్తగా వచ్చిన ఛాలెంజర్స్ లలో కొందరు అనుకోకుండా అతికి పోయి ఆ
నవ్వుల పాలవుతున్నారు. మొదటి రోజు నుంచి ఎక్కువగా యాంకర్ శివ చేదు అనుభవాలను ఫేస్ చేయాల్సి వస్తోంది.

మొదట ఆమె అన్న అనడంతో..
యాంకర్ శివ యూ ట్యూబ్ ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అయితే అందుకున్నాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ద్వారా తన కెరీర్ ను మరో లెవెల్ కు తీసుకు వెళ్లాలని గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మొదటి రోజు అతను 17 మందిలో హైలెట్ అవ్వాలని ట్రై చేసిన విధానం కాస్త ఓవర్ గా అనిపించింది. మిత్ర శర్మను లైన్ లో లెట్టాలని కూడా అనుకున్నాడు. కానీ ఆమె అన్న అనడంతో మనోడు తోక ముడిచి సైలెంట్ అయ్యాడు.

బిందు మాధవిపై ఫోకస్
ఇక ఇప్పుడు యాంకర్ శివ ఫోకస్ మొత్తం హీరోయిన్ బిందు మాధవి వైపు మళ్లింది. కానీ అక్కడ కూడా అతనికి సరైన రియాక్షన్ అయితే రాలేదు. ఇక అతని స్టోరీని చెప్పుకుంటూ అఖిల్ అజయ్ నవ్వుకున్నారు. రీసెంట్ శివ తన పేరు బిందు మాధవి పేరు రాసుకొని కెమెరాకు చూపించే ప్రయత్నం చేశాడు అని అది నేను కూడా చూశాను అంటూ అజయ్ నవ్వుకుంటూ అఖిల్ , శ్రవంతితో చెప్పుకొచ్చాడు.
Recommended Video

నవ్వులపాలైన శివ..
అయితే యాంకర్ శివను బిందు ఆ తరువాత బ్రో అనేసిందని అజయ్ పగలబడి నవ్వుతూ అఖిల్ కు చెప్పాడు. ఇక అఖిల్ జూడా యాంకర్ శివ పరిస్థితిపై జోకులు వేస్తూ అతని గాలి మొత్తం తీసేశాడు. ఒకసారి లోపల ఉన్నప్పుడు మళ్ళీ మా మధ్య డిస్కషన్ జరిగిందని యాంకర్ శివ ఏదో చెప్పో బోయాడు. అంతే కాకుండా మాలో మాకు చాలా ఉంటాయని అన్నాడు. దీంతో అఖిల్ అప్పుడు బ్రో అంది. మళ్ళీ ఆ తరువాత తమ్ముడు అనిందా అని అతన్ని నవ్వులపాలు చేశారు. ప్రేమగా ప్లే బాయ్ లా మారాలని అనుకున్న శివకు అమ్మాయిల నుంచి అనరాని మాటలు వస్తున్నాయని కొంత అప్సెట్ అవుతున్నాడు. ఇక యాంకర్ శివ చేసేదేమీ లేక హామీదా వైపు కూడా ఫోకస్ పెట్టాడు. మరి ఆమె ఏమంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











