Bigg Boss Non Stop: పిసకడం రాదు అంటూ బాడీ షేమింగ్.. సరయుపై డబుల్ మీనింగ్ డైలాగ్స్.. షాకింగ్!
బిగ్ బాస్ లో ఎప్పుడు ఎలాంటి కారణాలతో ఎవరు నామినేట్ చేస్తారో చెప్పడం చాలా కష్టం. ఇక పొరపాటున నోరు జారితే మాత్రం వారికి ఊహించని విధంగా వరుసగా చేదు అనుభవాలు ఎదురవ్వడం కాయం. ఇక బిగ్ బాస్ లో యాంకర్ శివపై ఇటీవల కంప్లైంట్స్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. అతను మాట్లాడే మాటల్లో కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ దారుణంగా ఉన్నాయని కొందరు కంటెస్టెంట్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ వారియర్స్ అయితే అతని మాటలను ఏ మాత్రం సహించడం లేదు. ఇక ఇటీవల బాడీ షేమింగ్ చేశాడని సరయి మరో వివరణ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఈజీగా టార్గెట్..
బిగ్ బాస్ మొదటి వారం కంటెస్టెంట్స్ పరిచయాలు చాలా తొందరగానే ముగిశాయి. ఒకరికొకరు వారి అసలు రంగును కూడా చాలా తొందరగానే బయట పెట్టినట్లు అనిపించింది.
సీనియర్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి చేయకుండా కాస్త నెమ్మదిగా గేమ్ ఆడుతున్నారు అని కామెంట్స్ అయితే చాలానే వస్తున్నాయి. కానీ కొత్తగా వచ్చిన చాలెంజర్స్ మాత్రం తొందర పాటున కొన్ని మాటలు అనడంతో ఈజీగా టార్గెట్ అవుతున్నారు.

అర్థం చేసుకొని ఉంటేనే..
బిగ్ బాస్ లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం చాలా కష్టం. ఇక వాటిని అర్థం చేసుకొని ముందుకు సాగితేనే వీలైనన్ని ఎక్కువ రోజులు హౌస్ లో ఉంటారు. అంతే కాకుండా బిగ్ బాస్ టైటిల్ సొంతం చేసుకునేందుకు కూడా ఓపిక అనేది చాలా ముఖ్యం. అలాగే కొన్నిసార్లు ఎక్కువ స్థాయిలో ఓపిక పట్టడం కూడా నామినేషన్స్ కు దారితీస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కొంతమంది చాలెంజర్ లు తొందరపాటు మాటలతో ఇబ్బందుల్లో పడుతున్నారు.

యాంకర్ శివ కారణంగా..
అయితే యాంకర్ శివ కొన్నిసార్లు తెలివిగా గేమ్ ఆడుతున్నాడు అని తనలో తానే అనుకుంటున్నాడు. కానీ అతను చేసే కామెంట్స్ హౌస్ లో కొందరిని తీవ్ర స్థాయిలో అసంతృప్తిని కలిగిస్తున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇతర కంటెస్టెంట్స్ ను నెగిటివ్ గా హైలెట్ చేసే విధంగా అతను అడిగే ప్రశ్నలు కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

యాంకర్ శివ vs సరయి
మరికొన్నిసార్లు టైమింగ్ చూసి ఇతరులపై సెటైర్లు వేయాలని అనుకుంటున్నాడు. కానీ అతనే ఊహించని విధంగా నవ్వులపాలవుతున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక ఈ మధ్య అతనికి సరయుకు మధ్య కొన్ని గొడవలు జరుగుతున్నాయి. అతను ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో చిరాకు తెప్పిస్తున్నాయి అని కూడా రెండో వారంలో నామినేట్ చేయడం జరిగింది.

పిసకడం రాదు అంటూ..
ముఖ్యంగా యాంకర్ శివ బాడీ షేమింగ్ చేస్తున్నాడు అంటూ రీసెంట్ గా పిండి పిసకరా అని అడిగితే నాకు సరిగ్గా పిసకడం రాదు అంటూ అసభ్యకరంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడాడని నామినేషన్స్ లో ఒక కారణం చెప్పింది. అతని మాటలు ఏ మాత్రం కరెక్ట్ కాదు అంటూ ఇది వీలైనంత తొందరగా మార్చుకుంటే మీకే మంచిది అని కూడా ఆమె శివకు వివరణ ఇచ్చింది.

అఖిల్ కూడా..
అఖిల్ కూడా మోనాల్ విషయాన్ని పదేపదే లాగడం తనకు ఏమాత్రం నచ్చడం లేదు అని ఆమె వల్లే నేను రన్నరప్ వరకు వచ్చానంటూ శివ వివరణ ఇవ్వడం కాస్త మనస్థాపానికి గురి చేసింది అని అఖిల్ నామినేట్ చేశాడు. తన నోటి దురుసు కాస్త తగ్గించుకుంటే మంచిది అనే విధంగా కూడా కౌంటర్ ఇవ్వడం విశేషం. మరి ఈ విమర్శలతో యాంకర్ శివ హైలెట్ అవుతాడా లేదంటే నామినేషన్స్ ద్వారా ఇంటికి వెళ్లిపోతాడో లేదో ఈవారం ఎపిసోడ్ జరిగే పరిణామాలతో అర్ధమవుతుంది.


Click it and Unblock the Notifications











