Bigg Boss Non Stop: వారం రోజుల్లో అతన్ని తీసిపారేయ్యాలని అనుకున్నారు.. కానీ ఇప్పుడు టాప్ 5లో..

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ ఎప్పటి వరకు ఉంటారు అనేది ఎవరూ ఊహించలేరు. కానీ పరిస్థితులను బట్టి కొంతమందిని కావాలనే తీసివేస్తారు అని టాక్ అయితే నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. ఇక రీసెంట్ గా మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో ఎలిమినేషన్ పై అయితే ఓ వర్గం అభిమానులు ఏమాత్రం సంతృప్తి చెందడం లేదు. అయితే ఒక వ్యక్తిని మాత్రం వారం రోజుల లేదా రెండు వారాల కంటే ఎక్కువ రోజులో ఉంచకూడదు అని నిర్వాహకులు అనుకున్నారట. కానీ రెండు వారాలలో ఆ కంటెస్టెంట్ కొనసాగుతున్న విధానాన్ని చూసి వెంటనే మళ్ళీ ఆలోచనను మార్చుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు అతను టాప్ ఫైవ్ లోకి కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఆ విషయంలో అప్సెట్

ఆ విషయంలో అప్సెట్

బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మొదలైనప్పుడు ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు కూడా అనుకున్నంత స్థాయిలో సెలబ్రిటీలు కాదు అనే కామెంట్స్ వచ్చాయి. అంతేకాకుండా కాస్తోకూస్తో సెలబ్రిటీ హోదా ఉన్న వారిని కూడా మొదటి రెండు మూడు వారాల్లోనే పంపించేయడంపై కూడా విమర్శలు వచ్చాయి.

న్యాయంగా లేకుండా..

న్యాయంగా లేకుండా..

ఇప్పటివరకు హౌస్ లో నుంచి వెళ్లిపోయిన వారిలో ముమైత్ ఖాన్ శ్రీ రాపాక ఆర్జే.చైతు ముగ్గురు కూడా బయట జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారే. షో లో ఇలాంటి వారు ఉంటేనే అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని ఆలోచిస్తారు. కానీ బిగ్ బాస్ నాన్ స్టాప్ నిర్వాహకులు మాత్రం అసలు న్యాయంగా లేకుండా ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించడంపై అనుమానాలు ఉన్నాయని పలువురు నెటిజన్లు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

వారం రోజుల కంటే..

వారం రోజుల కంటే..

అయితే ఒక కంటెస్టెంట్ విషయంలో మాత్రం బిగ్ బాస్ నిర్వాహకులు ఒక బలమైన నిర్ణయంతోనే అతన్ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అతన్ని వారం రోజుల కంటే ఎక్కువగా ఉంచకూడదని కుదిరితే రెండు వారాల కంటే ఎక్కువగా అస్సలు కొనసాగించ కూడదు అని కూడా బలమైన నిర్ణయంతోనే ఉన్నారట. కానీ ఇప్పుడు అతను హౌస్ లో ఏదో ఒక విధంగా హైలెట్ అవుతూ ఉండడంతో అతనిని టాప్ 5 వరకు కొనసాగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

 అతను ఎవరంటే..

అతను ఎవరంటే..

ఇక ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు. యాంకర్ శివ అని తెలుస్తోంది. పలు యూట్యూబ్ చానల్స్ ఇంటర్వ్యూల తో యాంకర్ గా మంచి గుర్తింపును అందుకున్న యాంకర్ శివ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోయే మొదటి కంటెస్టెంట్ అని ముందే వార్తలు వచ్చాయి.. ఇక తను సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు హడావుడి చేయడంతో అందరు చాలా ఈజీగా పసిగట్టేశారు.

అలా హైలెట్ అవుతున్న శివ

అలా హైలెట్ అవుతున్న శివ

ఇక ప్రస్తుతం బిగ్ బాస్ స్టార్ నాన్ స్టాప్ షోలో శివ ప్రతి టాస్క్ లో కూడా తన పాత్ర ఉండే విధంగా జాగ్రత్త పడుతున్నాడు. ముఖ్యంగా ఆటను మలుపుతిప్పే ట్వీస్ట్ ల విషయంలో కూడా శివ పోషిస్తున్న పాత్ర హైలెట్ గా నిలుస్తోంది. రీసెంట్ గా శివ తేజస్వి, బిందుమాధవి తో కలిసి చేసిన ఒక కామెడీ స్కిట్ బాగా వైరల్ అయింది. అందులో శివ ఒక చీరకట్టులో వచ్చి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు.

ఇలా ఉంటే టాప్ 5 వరకు

ఇలా ఉంటే టాప్ 5 వరకు

ఒకవైపు అరియానా వంటి సీనియర్ కంటెస్టెంట్ తో ఎంతో మంచి బాండింగ్ ఏర్పరుచుకుని మరొకవైపు బ్యూటిఫుల్ హీరోయిన్ బిందు మాధవి తో కూడా తన ట్రాక్ ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం బిందు మాధవికి అత్యధిక స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్నందున ఆమెకు తోడుగా ఉండడంతో శివకు ఆ రూట్లో కూడా సపోర్ట్ లభిస్తుంది. ప్రతీ కంటెస్టెంట్ ను జాగ్రత్తగా పరిశీలిస్తున్న యాంకర్ శివ హౌస్ లో హడావిడి చేస్తున్నాడు. ఇక అతన్ని ఫైనల్స్ టాప్ 5 వరకు కూడా బిగ్ బాస్ నిర్వాహకులు కొనసాగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X