Bigg Boss Non Stop: చీర కట్టుకొని శివ రొమాన్స్.. బిందుమాధవికి ఉండాల్సింది లేదంటూ పచ్చి బూతులు!

బిగ్ బాస్ నాన్ స్టాప్ షో పై విమర్శలు అనుమానాలు ఎన్ని వచ్చినా కూడా మళ్ళీ విభిన్నమైన టాస్క్ లతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో అయితే గత రెండు వారాల నుంచి ఓ వర్గం ప్రేక్షకులు ఈ ఓటీటీ షోపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉండాల్సిన వాళ్లను బయటకు తోసేస్తున్న బిగ్ బాస్ అర్హతలేని వారిని మాత్రం చాలా అవకాశాలు ఇస్తున్నారు అనే కామెంట్స్ వచ్చాయి. ఇక వాటిని మరిచిపోయే విధంగా బిగ్ బాస్ మళ్లీ డిఫరెంట్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు. రీసెంట్ గా యాంకర్ శివ చీరకట్టులో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అంతే కాకుండా అతను బిందు మాధవి తో మాట్లాడిన విధానం ఆశ్చర్యాన్ని కలిగించింది.

టైమ్ చూసి గొడవలు పెడుతున్న బిగ్ బాస్

టైమ్ చూసి గొడవలు పెడుతున్న బిగ్ బాస్

బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో ఎప్పుడు ఎలాంటి డ్రామా కొనసాగుతుందో చెప్పడం కష్టంగానే ఉంటుంది. బిగ్ బాస్ గేమ్ లో భాగంగానే ముందుగా కంటెస్టెంట్స్ మధ్యలో ఒక మంచి బాండింగ్ క్రియేట్ చేసి ఆ తర్వాత సమయాన్ని చూసి అసలైన వారి మధ్యలోనే గొడవలు పెట్టే విధంగా ఒక్కసారిగా వాతావణాన్ని మార్చేస్తుంటాడు. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవహారాలు చూస్తుంటే కొంతమంది కంటెస్టెంట్ మధ్యలో తీవ్రమైన గొడవలు కలిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

దొంగతనం చేసిన శివ

దొంగతనం చేసిన శివ


గార్డెన్ ఏరియాలో లైక్ బటన్స్ వర్షాన్ని కురిపించిన బిగ్ బాస్ ఎవరైతే ఎక్కువ లైక్స్ సంపాదిస్తారో వారే గేమ్ లో గెలిచినట్లు అని ఇటీవల ఒక టాస్క్ ఇచ్చాడు. అయితే కష్టపడి సంపాదించుకున్న లైక్స్ బటన్స్ ను ఇతరులు దొంగిలించే అవకాశం ఉందని ముందుగానే బిగ్ బాస్ హెచ్చరికలు కూడా చేశాడు. అయితే కొంత మంది మాత్రం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా వాటిని బయట కనిపించే విధంగా పెట్టేసారు. యాంకర్ శివ అరియానా దగ్గర నుంచి 20 లైక్స్ దొంగతనం చేశాడు.

అరియానా అనుమానం

అరియానా అనుమానం

ఇక ఉదయాన్నే 15 లైక్స్ ఎవరు దొంగతనం చేశారు అని అరియానా చాలా ఆవేదనకు గురి అయింది. ఇక నటరాజ్ మాస్టర్ అయితే తను ఏమాత్రం తీయలేదని శివ అక్కడే రాత్రి అటు ఇటు తిరిగాడు అనే అనుమానం వ్యక్తం చేశాడు. ఇక వెంటనే అరియానా ఎవరు తీసారో తనకు తెలుసని కూడా సమాధానం చెప్పింది. ఇక చేసేదేమి లేక యాంకర్ శివ దొరికిపోతే చాలా కష్టంగా ఉంటుంది అని కావాలని నేనే తీసాను అని నాకు తిరిగి ఇచ్చేశాడు.

యాంకర్ శివతో బిందు మాధవి

యాంకర్ శివతో బిందు మాధవి

ఇక బిగ్ బాస్ ఆ తర్వాత హౌస్ మేట్స్ ను మెప్పించి ఫాలోవర్స్ ట్యాగ్స్ ను సంపాదించుకునే విధంగా ఎంటర్టైన్మెంట్ ను క్రియేట్ చేయాలి అని చెప్పడంతో ఎలిమినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ వారికి నచ్చినట్లుగా స్కిట్స్ వేశారు. ఇక యాంకర్ శివ బిందు మాధవి తేజస్వి ముగ్గురు కలిసి బతుకు జట్కా బండి తరహాలో కామెడీ స్కిట్ చేశారు.

చీరలో యాంకర్ శివ

చీరలో యాంకర్ శివ


యాంకర్ శివ అయితే చీర కట్టుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను ఎక్కువగా అఖిల్ ను ఫోకస్ చేసినట్లు అర్థమైంది. వచ్చీరాగానే ఎంట్రీతో అఖిల్ మీద పడి పోయి ముద్దులు పెట్టే ప్రయత్నం చేశాడు. అతను ఎంత వద్దు అని చెబుతున్న కూడా అదే పనిగా రొమాన్స్ చేయడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత కొంతమంది అమ్మాయిలు కూడా శివను కిస్ చేశారు.

బూతులతోనే..

బూతులతోనే..

ఇక హోస్ట్ తరహాలో తేజస్విని ఉండగా యాంకర్ శివ బాధిత భార్యగా బిందు మాధవి వేధించే భర్తగా స్కిట్ లో నటించారు. ఇక ఈ స్కిట్ మొదలవగానే యాంకర్ శివ పచ్చి బూతులతో రెచ్చిపోయాడు. మా ఇంట్లో నా మొగుడికి అసలైనది లేదని అంటూ గడియారం ఉంది కానీ అందులో ముల్లు లేదు అని డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పాడు. దానికి బిందుమాధవి సిగ్గుపడిపోతూ ఏం మాటలు అని సరదాగా కామెంట్ చేసింది. బూతులతోనే తోనే స్కిట్ లు మొత్తం హైలెట్గా నిలవడంతో ప్రేక్షకులుగా ఉన్న మిగతా కంటెస్టెంట్స్ యాంకర్ శివకు ఫాలోవర్స్ గా ఫిదా అయిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X