Bigg Boss Non Stop: వచ్చి రావడంతోనే ముద్దులతో స్టార్ట్ చేసిన మోడల్.. ఈ టాస్క్ తోనే హైలెట్!

మొత్తానికి మరో బిగ్ బాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఓటీటీలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో శనివారం రోజు షోను స్టార్ట్ చేశారు. ఇక ఈసారి ఓటీటీ నాన్ స్టాప్ లో సరికొత్త టాస్క్ లను మొదలు పెట్టబోతున్నట్లు చెప్పవచ్చు. అంతే కాకుండా రొమాన్స్ డోస్ తో పాటు గ్లామర్ డోస్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఇక వచ్చి రావడంతోనే ఒక కంటెస్టెంట్ ముద్దుల టాస్క్ తో హైలెట్ అయ్యే ప్రయత్నం చేశాడు. నాగార్జున ఇచ్చిన ఆ టాస్క్ షోలో చాలా ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

అదే తరహాలో నాగ్

అదే తరహాలో నాగ్

వరుసగా 5 సీజన్లతో బిగ్ బాస్ ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ లభించింది అనే చెప్పాలి. ముఖ్యంగా నాగార్జున హోస్టింగ్ తో వరుసగా మూడు సార్లు ఓ వర్గం ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ అందుకున్నారు. ఇక ఓటీటీ నాన్ స్టాప్ లో కూడా నాగార్జున అదే తరహాలో ఎట్రాక్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. శనివారం రోజు షోను నాగార్జున తనదైన శైలిలో స్టార్ట్ చేయించారు.

84 రోజులు నాన్ స్టాప్

84 రోజులు నాన్ స్టాప్

గడిచిన ఐదు సీజన్స్ ఒక లెక్క ఇప్పటి నుంచి మరొక లెక్క అనే విధంగా బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను అందించేందుకు రెడీ అయ్యింది. డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో శనివారం స్టార్ట్ అయిన ఈ ఓటీటీ షో 84 రోజుల పాటు నాన్ స్టాప్ గా లైవ్ లో కొనసాగనుంది. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఈసారి 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు.

రెండు గ్రూపుల మధ్య పోటీ

రెండు గ్రూపుల మధ్య పోటీ

గతంలో బిగ్ బాస్ లో పాల్గొన్న కొంతమంది కంటెస్టెంట్స్ ఈసారి నాన్ స్టాప్ లో కూడా వారి అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు. ఇక వారిని ఛాలెంజర్లుగా పరిచయం చేసిన బిగ్ బాస్ కొత్తవారిని వారియర్స్ గా గ్రూప్ గా మార్చేశారు. వీరి మధ్య విభిన్నంగా సాగే పోటీలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని తెలిపారు. కొంతమంది గ్లామరస్ బ్యూటీలు ఈసారి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ లో హైలెట్ గా నిలవబోతున్నట్లు సమాచారం.

రావడంతోనే ముద్దులు..

రావడంతోనే ముద్దులు..

ఇక అందరూ ఒక తరహాలో ఉంటే పదవ కంటెస్టెంట్ మాత్రం చాలా విభిన్నంగా హైలెట్ అయ్యాడు. అతను వచ్చిన మొదటి రోజే ఫోకస్ అయ్యాడు. ఏకంగా ముద్దుల టాస్క్ ను ఎదుర్కొనడం విశేషం. అతనే అనిల్ రాథోడ్. ఇంట్లో అందరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ అని ఈ రంగంలోకి రావడం పూర్తిగా తన ఇష్టమే అని అన్నాడు. మోడల్ గా కూడా పలు రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా గెలిచినట్లు చెప్పుకొచ్చాడు.

ముద్దు ఎవరితో కనిపెట్టాలి..

ముద్దు ఎవరితో కనిపెట్టాలి..

ఇక అనిల్ రాథోడ్ కు రావడంతోనే మంచి హైలెట్ టాస్క్ ను ఎదుర్కొన్నాడు. అతనికి నాగార్జున లిప్'మార్క్' కు సంబంధించిన ఛాలెంజ్ ఇచ్చారు. లేడి కంటెస్టెంట్స్ కొందరు ఇచ్చిన ముద్దు గుర్తులలో ఎదో ఒక దానిని సెలెక్ట్ చేసుకొమ్మని నాగ్ చెప్పగా అతను ఒక దాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక అది ఎవరితో కనిపెట్టడమే నీ చాలేని అని నాగ్ చెప్పడంతో అనిల్ అందరి అమ్మాయిలపై ఫోకస్ పెట్టె పనిలో పడ్డాడు. మరి అతను ఈ టాస్క్ లో ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X