Bigg Boss Non Stop: మేకప్ లేకుండా దీన్ని చూస్తే ఘోరం అంటూ.. చెప్పులతో కొట్టుకున్న కంటెస్టెంట్స్

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలైనప్పటి నుంచి కూడా కాస్త నీరసంగా కొనసాగుతోంది అని కామెంట్స్ చాలానే వస్తున్నాయి. అయినప్పటికీ బిగ్ బాస్ మాత్రం షో లో టాస్క్ లలో డోస్ గట్టిగా పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. కంటెస్టెంట్స్ కూడా మొదటి రెండు మూడు రోజుల తర్వాత కాస్త ఎక్కువ హైలెట్ అయ్యే విధంగా మాటలతో కొట్లాటలతో ఓ వర్గం వారిని బాగానే ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఇక కొందరైతే నవ్వుతూనే వారి పగను తీర్చుకుంటున్నారు. అయితే అరియానా అషు రెడ్డి ఇద్దరు కలిసి చెప్పులతో కొట్టుకునే వరకూ వ్యవహారం వచ్చింది. వారిని చూసి మిగతా కంటెస్టెంట్ కూడా చాలా నవ్వుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఇంకా అనుకున్నంత డోస్ పెంచలేదు

ఇంకా అనుకున్నంత డోస్ పెంచలేదు

బిగ్ బాస్ తెలుగు టెలివిజన్ నుంచి ఓటీటీ లోకి వచ్చిన అనంతరం తప్పకుండా కంటెంట్ డోస్ ఎక్కువగానే ఉంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇంకా నాన్ స్టాప్ షో అయితే ప్రేక్షకుల అంచనాలను ఆకట్టుకోలేదు అని అనిపిస్తోంది.. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో 17 మంది కంటెస్టెంట్స్ ను రెండు గ్రూపులుగా విభజించిన విషయం తెలిసిందే గతంలో బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ను వారియర్స్ గా కొత్తగా వచ్చిన వారిని చాలెంజర్స్ గా విభజించారు.

అస్సలు తగ్గకుండా

అస్సలు తగ్గకుండా

మొత్తానికి బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మొదటివారం కాకముందే లైవ్ స్ట్రీమింగ్ ఎగిరిపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. బుధవారం బిగ్ బాస్ లైవ్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో చాలా రకాల నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. అంతేకాకుండా జనాలు కూడా ఈసారి అనుకున్నంత స్థాయిలో బిగ్ బాస్ షోను ఫాలో అవ్వడం లేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. నిర్వాహకులు మాత్రం అస్సలు తగ్గకుండా స్
డోస్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు.

ముందుగానే ప్లాన్ చేసుకొని..

ముందుగానే ప్లాన్ చేసుకొని..

ఇక బిగ్ బాస్ లో నిన్న జరిగిన పరిణామాలు ఒక వైపు నవ్విస్తూనే మరొకవైపు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ షో మొదలైనప్పటి నుంచి కూడా గతంలో మాదిరిగానే కొన్ని గ్రూపులు రాజకీయాలు మొదలయ్యాయి. అషు రెడ్డి అరియనా ముందుగానే ప్లాన్ చేసుకొని మరియు ఒకటి అయినట్లు కనిపించింది. అలాగే యాంకర్ శివ ఆర్జే చైతూ ఇద్దరు కూడా వారితో కలిసి ఉన్నట్లు అనిపిస్తోంది.

కావాలనే అలా చేస్తున్నారు

కావాలనే అలా చేస్తున్నారు

ఇక నిన్న ఉదయం లేవగానే ఈ ఇద్దరు కూడా చెప్పులతో కొట్టుకునే వరకు వ్యవహారం వెళ్ళింది. ఒకవైపు నవ్వుతూనే మరోవైపు వారు ఇద్దరు కూడా కావాలనే కొట్టుకున్నట్లు అనిపించింది. ముందుగా అషు రెడ్డి వచ్చే కావాలనే కొందరు పనిష్మెంట్ ఇస్తున్నారు అని.. వస్తువులను వారే పోగొట్టి తమపై నిందలు వేస్తున్నారు అని చైతు శివ ముందు తన గోడును చెప్పుకుంది. ఇక ఆమెను పట్టించుకోని యాంకర్ శివ చైతు సెటైర్లు వేయడం మొదలుపెట్టారు.

 చెప్పులతో కొట్టుకున్న కంటెస్టెంట్స్

చెప్పులతో కొట్టుకున్న కంటెస్టెంట్స్

మరొక వైపు నుంచి వచ్చిన అరియానా అసలు దీన్ని మేకప్ లేకుండా చూస్తేనే చాలా ఘోరంగా ఉంటుంది అని దారుణంగా తీసి పారేసింది. ఆ మాటలు తట్టుకోలేకపోయిన అషు రెడ్డి వెంటనే చెప్పులు తీసి అసలు నువ్వు నా టీమేబా అంటూ కొట్టసాగింది. అరియానా కూడా పైకి నవ్వుతూనే తన చెప్పులు తీసుకుని అషు రెడ్డి బ్యాక్ పై కొట్టే ప్రయత్నం చేసింది. ఇక వీరి గోడవలు చూసి చైతు శివ బాగా ఎంజాయ్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X