Bigg Boss Non Stop: అప్పుడు బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు అంకుల్ అనేసిన అరియనా.. ఆడుకున్నారుగా..
బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ షో స్టార్ట్ అయినప్పుడు ఓ వర్గం వారు అంచనాలు గట్టిగానే పెట్టుకున్నారు. అయితే షో గ్రాండ్ గా ఎప్పటిలానే స్టార్ట్ అయినప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం అంతగా అంచనాలను అందుకోలేక పోయింది అనే కామెంట్స్ అయితే చాలానే వచ్చాయి. ఇక మెల్లగా బిగ్ బాస్ షోలో గొడవల డోస్ కూడా ఎక్కువవుతోంది. కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకవైపు గ్రూపు రాజకీయాలు మరోవైపు యాంటీ గ్రూపులను కరెక్ట్ గా ఫాలో అవుతున్నారు. ఇక అరియానా గతంలో మాదిరిగా బిగ్ బాస్ కెమెరాలను తనవైపుకు తిప్పుకునేలా ట్రై చేస్తోంది. రీసెంట్ గా అషు రెడ్డి, తేజస్వితో ఆమె కలిసి బిగ్ బాస్ ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుకున్నారు.

ముమైత్ ఎమోషనల్ ట్రాక్
బిగ్ బాస్ లో రంగులు మార్చే కంటెస్టెంట్స్ ఈసారి కూడా చాలామంది ఉన్నారని అనిపిస్తోంది. ఇక నామినేషన్ లో ఒక్కొక్కరి రూపాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే నామినేషన్ జరిగింది. ఇక నామినేషన్ లో ఉన్నవారు సేవ్ అయ్యేందుకు వారి మాటను నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముమైత్ ఖాన్ కూడా గత రెండు మూడు రోజులు నుంచి చైతు విషయంలో తన మాట నెగ్గాలని ఎమోషనల్ ట్రాక్ కొనసాగిస్తోంది.

సేఫ్ గేమ్ ఆడేందుకు..
గతంలో బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ను వారియర్స్ గా కొత్త వారిని ఛాలెంజర్లుగా రెండు గ్రూపులుగా డివైడ్ చేసిన బిగ్ బాస్ టాస్క్ లలో ఇద్దరికి గొడవలు కూడా గట్టిగానే క్రియేట్ చేస్తున్నాడు. సేఫ్ గేమ్ ఆడాలని కొంతమంది బాగానే ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా అషు రెడ్డి కొన్ని సమయాల్లో సేఫ్ గేమ్ ఆడేందుకు ట్రై చేస్తున్నట్లు అఖిల్ సార్ధక్ మొహం మీదే చెప్పేశాడు.

అరియనా బాయ్ ఫ్రెండ్
ఇక బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ అరియానా ఈసారి కూడా డిఫరెంట్ గా తనదైన శైలిలో బిగ్ బాస్ ను ఎట్రాక్ట్ చేయాలని చూస్తోంది. గతంలో ప్రతీ సారి ఆమె కెమెరా దగ్గరకు వెళ్లి బిగ్ బాస్ తో తన జీవితానికి సంబంధించిన అనేక రకాల విషయాలను చెప్పుకుంటూ బిగ్ బాస్ తన బాయ్ ఫ్రెండ్ అని కూడా ప్రచారం చేసుకుంది.

ఈసారి అంకుల్ అంటూ..
ఇక బిగ్ బాస్ ను గతంలో బాయ్ ఫ్రెండ్ అనేసిన అరియానా ఈసారి మాత్రం నాన్ స్టాప్ లో అంకుల్ అని సంభోదించింది. ఇక పక్కనే ఉన్న అషు రెడ్డి అప్పుడు బాయ్ ఫ్రెండ్ అని ఇప్పుడు అంకుల్ అంటావా అని అడిగింది. దీంతో పక్కనే ఉన్న తేజస్వి వారితో పాటు కౌంటర్లు వేయడం స్టార్ట్ చేసింది.
Recommended Video

బిగ్ బాస్.. భార్య పిల్లలు
బగ్ బాస్ కు ఇప్పుడు ప్రత్యేకంగా ఫ్యామిలీ ఉందని ఆయనకి వైఫ్ కూడా వచ్చింది అని చెప్పుకొచ్చింది. ఇక ఆయన పిల్లలు మనకు కొన్ని గిఫ్ట్ కు కూడా పంపారని సెటైర్లు వేయడం స్టార్ట్ చేసింది. అప్పుడప్పుడు ఆయనకు ఫస్ట్రేషన్ కూడా వస్తుందని అది జూడా ఆయన భార్య కారణంగా అంటూ ఏ మాత్రం గ్యాప్ లేకుండా కౌంటర్స్ వేసుకుంటూ నవ్వుకున్నారు.


Click it and Unblock the Notifications











