Bigg Boss Non Stop: నేను సిగరెట్లు తీశానని ఎవడన్నాడు.. యాంకర్ శివతో అషు రెడ్డి కోల్డ్ వార్!
బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే. కానీ నిత్యం గొడవలు జరగకుండా మాత్రం షో కొనసాగదు. ప్రతీ చిన్న దాన్ని భూతద్దంలో పెట్టి పెద్దది చేయడంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తరువాతే ఎవరైనా. ఇక మొన్నటివరకు సెన్సార్ తో కాస్త కంట్రోల్ లో ఉన్న బిగ్ బాస్ ఇప్పుడు ఓటీటీలోకి రావడంతో నాన్ స్టాప్ గా సెన్సార్ లేకుండా బోల్డ్ కంటెంట్ అందించేందుకు సిద్ధమైంది. ఇక తెలుగు నాన్ స్టాప్ లో ప్రస్తుతం కంటెస్టెంట్స్ మధ్యలో కోల్డ్ వార్స్ ఎక్కువగానే కొనసాగుతున్నాయి. మొదట్లో స్నేహంగా ఉన్నవారు వారం రోజులు గడవక ముందే శత్రువులుగా మారుతున్నారు. యాంకర్ శివతో అషురెడ్డి గొడవ పడే ప్రయత్నం చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
Recommended Video

యాంకర్ శివ పరిస్థితి అలా అయ్యింది..
ఇక బిగ్ బాస్ లో పనిష్మెంట్స్ హడావుడిలో కొంతమంది కంటెస్టెంట్స్ చాలా ఓవర్ చేస్తున్నారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక బిందు మాధవి ఎక్కడ ఉంటే అక్కడికి యాంకర్ శివ వాలిపోతున్నాడు. అయితే అతన్ని ఇదివరకే బిందు మాధవి బ్రో అనేసింది. అలాగే మిత్ర శర్మ కూడా అన్నా అనేసి గాలి తీసేసింది. దీంతో మనోడు ఎవరిని టచ్ చేసినా కూడా బ్రో అనే పధంతో నవ్వులపాలవుతున్నాడు.

ఓవర్ అయ్యిందని..
ఇక రీసెంట్ గా యాంకర్ శివకు అయితే బిందుమాధవి మొహం మీదే కాస్త ఓవర్ అయ్యిందని చెప్పేసింది. కాస్త తగ్గించుకుంటే మంచిది అంటూ ప్రతీ విషయంలో బిందు మాధవి అని పేరు లాగడం ఏ మాత్రం బాగోలేదని స్వీట్ గా వార్నింగ్ ఇచ్చేసింది. ఇక యాంకర్ శివ ఏమి చేసేది లేక చిలక ఏ తోడు లేక అనుకుంటూ పాట వేయమని బిగ్ బాస్ ను కోరాడు.

అషు రెడ్డితో కూడా
అయితే అషు రెడ్డి కూడా ఈ మధ్య శివ మీద కాస్త ఎక్కువ కోపం చూపిస్తోంది. ఆమె హైలెట్ అవ్వాలని ఎదో దొంగతనాలు చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక దాన్ని అనవసరంగా శివ బయట పెడుతూ మరింత చిరాకు తెప్పిస్తున్నాడు. ఇటీవల అషు రెడ్డి సిగరెట్ దొంగతనం చేసినట్లు శివ అందరికి చెప్పుకుంటూ తిరిగిన విధానం అషు రెడ్డికి చాలా కోపాన్ని తెప్పించింది.

సిగరెట్ల దొంగతనం
ఇక అఖిల్ తో మాట్లాడుతూ ఉండగా పక్కనే శివ సైలెంట్ గా కూర్చొని ఉన్నాడు. ఇక తాను సిగరెట్లు దొంగతనం చేసినట్లు ఎవడు చెప్పాడు అంటూ గట్టిగా ఆడిగేసింది. ఇక శివ తానే అన్నట్లుగా హావభావాలు చూపించగా చైతూ అతనికి డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక అతను చెప్పిన మాటలకు అషు రెడ్డికి చాలా కోపం వచ్చేసింది. అయినప్పటికీ సైలెంట్ గా ఉండిపోయింది. చూస్తుంటే వీరి మధ్య రాబోయే టాస్క్ లలో గొడవలు గట్టిగానే జరిగే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది.

బిగ్ బాస్ పై అనుమానాలు
అయితే బిగ్ బాస్ లైవ్ స్ట్రీమింగ్ గత రాత్రి నుంచి రాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంచి ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు నిర్వాహకులు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. మళ్ళీ గురువారం అర్ధరాత్రి నుంచి షో లైవ్ లో కొనసాగుతుందట. అయితే కావాలనే ముందుగానే స్క్రిప్ట్ తరహాలో నడిపించాలని బిగ్ బాస్ ను ఒక రోజు గ్యాప్ తో టెలికాస్ట్ చేయనున్నట్లు టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











