Bigg Boss Non Stop: విన్నర్స్ ముందే తెలిస్తే కిక్కెముంది.. బిందుమాధవి కాకుండా అతను గెలిస్తే..?
ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో మొదలైనప్పుడు అసలు సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. కానీ నిర్వాహకులు మాత్రం అద్భుతమైన ప్రణాళికలతో బిగ్ బాస్ ను తెలుగు ప్రేక్షకులకు కూడా ఒక డైలీ సీరియల్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి సీజన్ నుంచి ఇప్పుడు వచ్చిన బిగ్ బాస్ నాన్ స్టాప్ వరకు పాజిటివ్ కామెంట్స్ ఏ రేంజ్ లో అందుకున్నారో అంతకంటే ఎక్కువగానే నెగిటివ్ కామెంట్స్ కూడా అందుకోవాల్సి వచ్చింది.
ఇక కాంట్రవర్సీలు ఎన్ని క్రియేట్ అయినా బిగ్ బాస్ కు పెద్దగా డ్యామేజ్ కాలేదు. అయితే ఫైనల్ గా విన్నర్స్ ఎవరు అనే విషయం లో మాత్రం బిగ్ బాస్ ప్రతి సారి కూడా టెన్షన్ పడుతున్నట్లు అర్థమవుతోంది. ఈసారి కూడా బిగ్ బాస్ లో విన్నర్ ఎవరో ముందే తేలిపోతే కిక్ ఏముంది? అనే కామెంట్స్ చాలానే వస్తున్నాయి. అందుకే ప్రస్తుతం టాప్ పొజిషన్లో ఉన్న వారు కాకుండా మరొకరిని ట్రాక్లోకి తెచ్చేందుకు బిగ్ బాస్ గేమ్ ను చేంజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..

షో స్టార్ట్ అయినప్పుడు..
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలైనప్పుడు కంటెస్టెంట్స్ విషయంలో అయితే ప్రేక్షకులు ఈ సారి పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు అని అర్థమైంది. రెండు గ్రూపులుగా వచ్చిన సీనియర్లు జూనియర్లు మొదటి వారం అయితే చాలా నీరసంగా ఆటను కొనసాగించారు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక నాన్ స్టాప్ ఎవరు చూస్తారని అణుకున్నారో ఏమో గాని చివరికి ఎపిసోడ్ ప్రసారమయ్యే పరిస్థితికి వచ్చే సరికి ప్రేక్షకులు కాస్త ఫోకస్ పెడుతున్నారు.

గతంలో మాదిరిగానే..
ఇక బిగ్ బాస్ లో ఈ సారి విజేతలుగా ఎవరు గెలుస్తారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈసారి విజేత ఎవరో ఊహించడానికి పెద్దగా సమయం పట్టలేదు. చాలామంది ప్రేక్షకులు అయితే బిందు మాధవి విన్నర్ అని చాలా గట్టిగా వాదిస్తున్నారు. నాలుగు సీజన్లలో అభిజిత్ గెలుస్తాడు అని ఇదే తరహాలో రెండు మూడు వారాల్లోనే తేల్చేశారు. అంతకు ముందు రాహుల్ సిప్లిగంజ్ విషయంలో కూడా అదే జరిగింది.

ట్విస్ట్ కోసం యాంకర్ శివ?
అయితే బిగ్ బాస్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూనే ఉంటాయి. అందుకే పరిస్థితులకు తగ్గట్టుగా అతను కొనసాగిస్తూ కంటెస్టెంట్స్ టాలెంట్ ను బయటికి లాగుతూ ఉండాలి. బిందుమాధవి విన్నర్, అఖిల్ రన్నరప్ అనే ఊహాగానాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వడానికి ఎక్కువగా యాంకర్ శివను హైలెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అతను కొనసాగుతున్న విధానం కూడా షోలో హైలెట్ గా నిలుస్తోంది.

ఫైనల్స్ వరకు ఎవరు?
యాంకర్ శివ అయితే టాప్ ఫైవ్ లో ఉంటాడు అనే ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. అతను బిగ్ బాస్ టైటిల్ గె లవకపోవచ్చు కానీ కనీసం రన్నరప్ గా నిలిచే అర్హత ఉందని ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అయితే అఖిల్ హడావిడి చూస్తూ ఉంటే అతను ఫైనల్స్ వరకు వచ్చే లా ఉన్నాడు అనిపిస్తోంది. అతనితోపాటు బిందుమాధవి బలమైన ప్రత్యర్థిగా జనాల ఓట్లతో ముందుకు సాగుతోంది.

అతను గెలిస్తే..
బగ్ బాస్ సీజన్ ఫైవ్ లో సన్నీ విజేతగా నిలుస్తారు అని ఎవరూ ఊహించలేదు. ఇక ఇప్పుడు యాంకర్ శివ కూడా అతని తరహాలోనే ట్రాక్ లోకి రావచ్చు అని అర్థమవుతోంది. ఒకవేళ అతను విజేతగా నిలిచిన బిందుమాధవి గెలవకపోయినా కూడా అందులో పెద్దగా అనుమానాలు రావు. కానీ అఖిల్ గెలిస్తే మాత్రం భారీ స్థాయిలో బిందుమాధవి అభిమానుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండదు. ఏదేమైనా బిగ్ బాస్ మాత్రం ఈసారి విజేత విషయంలో అతిపెద్ద ఛాలెంజ్ ను ఎదుర్కోబోతున్నట్లు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి ప్లాన్స్ వేసి కంటెస్టెంట్స్ ను హైలెట్ చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











