Bigg Boss Non Stop: బిందుమాధవిని కింద పడేలా చేసిన అషు.. నీయమ్మా అంటూ దారుణంగా..
ఎలాంటి టాస్క్ మొదలు పెట్టినా కూడా అందులో బిగ్ బాస్ ప్రధాన కంటెస్టెంట్స్ మధ్యలో చాలా తెలివిగా వివాదాలను సృష్టించే వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న టాస్క్ లో నిన్నటి వరకు మిత్రులుగా ఉన్నవారు కూడా ఇప్పుడు గొడవలు పడే పరిస్థితికి వచ్చారు. ఇక షోలో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న బిందుమాధవి అలాగే అఖిల్ మధ్యలో కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి.
ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కూడా చాలా ఆసక్తికరంగా మారబోతోంది. అందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హౌస్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే వివరాల్లోకి వెళితే..

బిందుమాధవి vs అఖిల్
ఇక విడుదలైన ప్రోమో విషయానికి వస్తే.. రోబోలను కాపాడుకోవాల్సిన బాధ్యతలో అరియానా చాలా సీరియస్ గా ఉన్నప్పటికీ మిగతా కంటెస్టెంట్స్ మాత్రం దొంగతనాలు చేసేందుకు ఎగబడ్డారు. అయితే ఆ బాధ్యతను తన ఫ్రెండ్ శివకు కూడా అప్పగించేసింది. ఈ క్రమంలో బిందుమాధవి అఖిల్ కు మధ్యలో కూడా ఒక గొడవ జరిగింది. అషు రోబోలను చెదరగొట్టేందుకు బిందు గట్టిగానే ప్రయత్నం చేసింది.

గ్రూపులుగా గేమ్
అయితే అఖిల్ ముందుగానే ఆమెతో మాది ముట్టుకుంటే మాత్రం మేము పీకి పడేస్తాం అంటూ హెచ్చరించాడు. ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా రోబో పార్ట్ లను కూడా తీసుకునేందుకు ప్రయత్నం చేసింది. ఇక అఖిల్ ఆమెకు విరుద్ధంగా పీకి పడేస్తాం అంటూ ఎదురుదాడికి దిగాడు. దీంతో బిందుమాధవి గ్రూపుగా గేమ్ ఆడుతున్నారు అంటూ అందుకు ఇదే సాక్ష్యం అని కూడా ఆరోపణలు చేసింది.
ఎగబడిన కంటెస్టెంట్స్
ఇక గ్రూప్ గా ఆడుతున్నారు అని చెప్పగానే అఖిల్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. గతంలో బెలూన్ టాస్క్ లో ఎవరు గ్రూప్ గేమ్ ఆడారో అందరికీ తెలుసు అని కౌంటర్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత రోబో ఫ్యాక్టరీ లో పార్ట్స్ కోసం కంటెస్టెంట్స్ అందరూ బజర్ మోగగానే ఒక్కసారిగా రంగంలోకి దిగారు. అసలు ఏ మాత్రం ఎవరిని కంట్రోల్ చేసుకోకుండా పార్ట్స్ కోసం ఎగబడిన విధానం ఆశ్చర్యాన్ని కలిగించింది.

బిందుమాధవిని కిందపడేసిన అషు
రోబో పార్ట్స్ కోసం కంటెస్టెంట్స్ అందరూ కూడా కంట్రోల్ లేకుండా ఒకరి నుంచి మరొకరు దొంగతనాలు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో బిందుమాధవి అడ్డుకునేందుకు ముమైత్ ఖాన్ పోటీపడ్డారు. అషు రెడ్డి అయితే బిందుని ఒక్కసారిగా కింద పడేసి ఆమెను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో బిందుమాధవి చాలా కోపానికి గురి అయింది.

చెప్పండ్రా బై..
ఒకవైపు మాట్లాడుతూ ఉంటే అరియానా రోబో ఫ్యాక్టరీ నుంచి దొంగతనాలు చేయడం ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. అంతేకాకుండా అఖిల్ అజయ్ గ్రూపులో ఎక్కువగా కనిపించే స్రవంతి కి చేదు అనుభవం ఎదురయింది. నువ్వు చూసిన దొంగతనాలు బయటకు చెబుతున్నావు కానీ మేము మాత్రం చెప్పకూడదు అని అడగడంతో.. చెప్పండ్రా బై.. నీయమ్మా చూసింది కూడా చెప్పింది తప్పై పోయింది.. అని అనడంతో అరవకు అంటూ అజయ్ చెప్పాడు.
Recommended Video


స్రవంతితో బిందుమాధవి..
రాత్రి నుంచి పిచ్చి దానిలాగా ఉండి పొద్దునే కష్టపడినా లాభం లేదు అనే విధంగా స్రవంతి కామెంట్స్ చేసుకుంటూ వాళ్ళ గ్రూప్ నుంచి దూరంగా వెళ్లిపోయింది. అంతేకాకుండా ఎవరు గ్రూప్లో ఉన్నారో అర్థమైపోయింది అని కూడా చెప్పడంతో ఇక అదే సమయంలో బిందుమాధవి స్రవంతి దగ్గరకు వెళ్లి ఆమెతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేసింది.
వాళ్ళ మాటలు నమ్మే ఏదో మంచి చేసినట్లు గొప్పలు చూపించుకున్నారు కానీ ఇప్పుడు నువ్వు నిజం తెలుసుకొని నీకోసం నువ్వు మాట్లాడటం గర్వించాల్సిన విషయం అని బిందుమాధవి ఆమె పై ప్రశంసలు కురిపించింది. ఇక టాస్క్ పూర్తయ్యేలోపు ఇంకా ఎంతమంది విడిపోతారో చూడాలి.


Click it and Unblock the Notifications











