Bigg Boss Non Stop: అభిజిత్, కౌశల్ కలిపితే ఆ కంటెస్టెంట్.. సోలో వారియర్‌గా గెలుపు ఖాయమేనా?
బిగ్ బాస్ రియాలిటి షోలో ఫైనల్ టాప్ 5 వరకు వెళ్లడం అంటే అంత సాధారణమైన విషయం కాదు అని అంటారు. కానీ గడిచిన నాలుగు ఐదు సీజన్స్ లో ఆ కంటెస్టెంట్స్ ఎవరో నెటిజన్లు ముందే గ్రహించారు. ఒక విధంగా ఫైనల్ విన్నర్ ఎవరో కూడా ముందే తెలిసిపోయింది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ విషయంలో కూడా అలాంటి రూమర్స్ గట్టిగానే వస్తున్నాయి. ఇక అభిజిత్, కౌశల్ మండాను మిక్స్ చేస్తే ఒక కంటెస్టెంట్ అని ఇప్పుడున్న వారిలో ఒకరు పేరు బాగా ట్రెండ్ అవుతోంది.

టాప్ 5లోకి..?
బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాలిటి షోలో ప్రస్తుతం టాప్ 5కి వచ్చేవారిలో ఒక క్లారిటీ వచ్చేసింది. తప్పకుండా వాళ్లే టాప్ ఫైనల్స్ వరకు వస్తారని కామెంట్స్ వస్తున్నాయి. కానీ బిగ్ బాస్ మాత్రం మొదట్లోనే ఎలిమినేషన్స్ లో నెవ్వర్ బిఫోర్ అనేలా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఉంటారు అనుకున్న బలమైన కంటెస్టెంట్స్ ఐదు వారాలు అవ్వకముందే వెళ్లిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

వాళ్ళు వెళ్లిపోవడం..
ముమైత్ ఖాన్ మొదటి వారం ఎలిమినేట్ అయినప్పటికీ మళ్ళీ వైల్డ్ కార్డ్ తో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత శ్రీరాపాక, ఆర్జే చైతు, సరయు కూడా వెళ్లిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మిగతా వారితో పోలిస్తే ఆర్జే చైతు, సరయు వెళ్లిపోయే కంటెస్టెంట్స్ అయితే కాదు. ఇక వారి తరువాత అఖిల్ లాంటి వారికి మరింత బలం చేకూరింది.

అభిజిత్, కౌశల్ తరహాలో
ఇక బిగ్ బాస్ లో ప్రస్తుతం ఒక కంటెస్టెంట్ ను మాజీ బిగ్ బాస్ విన్నర్స్ తో పోలుస్తూ ఉండడం విశేషం. కౌశల్ మండాలోని ప్రశ్నించే తత్వం.. అలాగే అబిజిత్ తరహాలో అవసరం లేనప్పుడు అనవసర వివాదాలు వెళ్లకుండా కూల్ గా ఉండే విధానం.. ఒక కంటెస్టెంట్ లో ఉన్నట్లు చెబుతున్నారు.

వాళ్ళిద్దరూ అలా..
కౌశల్ మండా బిగ్ బాస్ రెండవ సీజన్ లో విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అతన్ని ఎంత మంది టార్గెట్ చేసి గొడవలకు దిగినా కూడా ఒంటరి పోరాటం చేసి టైటిల్ విన్నర్ గా నిలిచాడు. ఇక అభిజిత్ అయితే అనవసరంగా గొడవలు పడకుండా తన గేమ్ తను ఆడుకుంటూ ముందుకు వెళ్లి ప్రేక్షకుల మనసులతో పాటు బిగ్ బాస్ 4 టైటిల్ గెలుచుకున్నాడు. కౌశల్ మండా, అబిజిత్ ఇద్దరికి కూడా చాలా తేడా ఉంది. కానీ వారి స్వభావంతోనే బిగ్ బాస్ విన్నర్స్ గా నిలిచారు.
Recommended Video


బిందుమాధవి.. ట్రెండింగ్
ఇక వాళ్ళ ఇద్దరిని మిక్స్ చేస్తే బిందుమాధవి అని టాక్ వస్తోంది.. అవసరం అయినప్పుడు ఆవేశాన్ని చూపిస్తూ అనవసరం అన్నప్పుడు కూల్ గా ముందుకు సాగుతున్న కంటెస్టెంట్ బిందుమాధవి అన్ని వర్గాల ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది. ఆమెకు పోటీగా అఖిల్ వస్తున్నప్పటికీ కూడా ఎక్కువగా బిందుమాధవికి మద్దతు లభిస్తోంది. మరి బిగ్ బాస్ నాన్ స్టాప్ లో బిందు మాధవి అతని నుంచి ఎలాంటి చాలెంజ్ ను ఎదుర్కొంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











