Bigg Boss Non Stop: ఫ** అంటూ బిందుపైకి దూసుకెళ్లిన కంటెస్టెంట్.. ‘ఆడ’ అనగానే అతడు ఏడుస్తూ!

ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులు ఇస్తూ.. ప్రేక్షకులకు కావాల్సిన దానికంటే ఎక్కువ మజాను అందిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. హిందీలో ఎప్పుడో మొదలైన ఈ కార్యక్రమం.. తెలుగులోకి మాత్రం ఐదేళ్ల క్రితమే వచ్చింది. ఎన్నో అనుమానాలతో ప్రారంభం అయినా.. తక్కువ సమయంలోనే సక్సెస్‌ అయింది. దీంతో ఐదు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ను మొదలు పెట్టారు.

ఇది కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో టైటిల్ ఫేవరెట్లుగా ఉన్న బిందు మాధవి, అఖిల్ సార్థక్ మధ్య భీకర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. అసలేం జరిగింది? దీనికి సంబంధించిన వివరాలు మీకోసం!

నాన్ స్టాప్‌గా మజాను పంచుతూ

నాన్ స్టాప్‌గా మజాను పంచుతూ

భారీ అంచనాల నడుమ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ మూడు వారాల క్రితమే ప్రారంభం అయింది. అంచనాలకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్ల కంటే ఎక్కువగానే గొడవలు ఇందులో కనిపిస్తున్నాయి. అలాగే, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చతో ఈ సీజన్ అంతకంతకూ రంజుగా మారుతూ సాగుతోంది.

ఆ ఇద్దరి మధ్యనే టైటిల్ ఫైట్

ఆ ఇద్దరి మధ్యనే టైటిల్ ఫైట్

ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇందులోకి మొత్తం 17 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇందులో ఇద్దరు టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగారు. అందులో ఒకరు తెలుగు హీరోయిన్ బిందు మాధవి కాగా.. మరొకరు మాజీ రన్నరప్ అఖిల్ సార్థక్.

ఇద్దరూ ఇద్దరే... ఆటతో పోటీగా

ఇద్దరూ ఇద్దరే... ఆటతో పోటీగా

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లు అనిపించుకుంటోన్న బిందు మాధవి, అఖిల్ సార్థక్ ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా ఆడుతున్నారు. ఆట పరంగా ఇద్దరూ పోటీ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలాగే, మైండ్ గేమ్ పరంగానూ సత్తా చాటుతున్నారు. అయితే, ఆరంభం నుంచే వీళ్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. మధ్యలో కలిసినా దూరంగానే ఉంటున్నారు.

కెప్టెన్సీ టాస్కులో పెద్ద గొడవ

కెప్టెన్సీ టాస్కులో పెద్ద గొడవ

నాలుగో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్కు మొత్తం గొడవలతో సాగింది. మరీ ముఖ్యంగా యాంకర్ శివను సపోర్ట్ చేయడానికి బిందు మాధవి.. అతడిని ఓడించడానికి అఖిల్ సార్థక్ ప్రయత్నించారు. ఇందులో భాగంగానే బిందును లాగుతూ యాంకర్ శివతో అఖిల్ వాగ్వాదం స్టార్ట్ చేశాడు. దీనికామె క్లారిటీ ఇవ్వబోగా రెచ్చగొట్టాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య గొడవ మొదలైంది.

ఫ్రెండ్స్ లేకపోతే బ్రతకలేవు

ఫ్రెండ్స్ లేకపోతే బ్రతకలేవు

కెప్టెన్సీ టాస్కులో అషు రెడ్డి.. బిందును బ్లేమ్ చేస్తూ మాట్లాడింది. అప్పుడామె సమాధానం చెప్పగా అఖిల్ ఎంట్రీ ఇచ్చి ‘సీరియస్‌గా తీసుకుంటే కెప్టెన్ పోటీదారులు కావాలి కదా.. మీరు ఎన్నిసార్లు అయ్యారు. మీరు ఫ్రెండ్‌ హెల్ప్ ఉంటేనే ఆడతారు' అన్నాడు. దీంతో రెచ్చిపోయిన బిందు ‘ఇక్కడ ఫ్రెండ్‌ మీద ఆధారపడేది నువ్వు. వాళ్లు లేకపోతే నువ్వు బతకలేవు' అంది.

నువ్వు ఆడా అంటూ కామెంట్

నువ్వు ఆడా అంటూ కామెంట్

బిందు, అఖిల్ మధ్య చాలా సేపు యుద్ధ వాతావరణం కనిపించింది. అప్పుడు అఖిల్ ‘మీరు సేఫ్ గేమ్ ఆడతారు. టార్గెట్ చేస్తారు. పట్టి పట్టి బ్లేమ్ చేస్తారు. ఇది అందరికీ తెలుసు.. నేను అలా గేమ్ ఆడా' అన్నాడు. దీనికి బిందు ‘నువ్వేదీ ఆడా.. నువ్వసలు ఏదీ ఆడా. నువ్వు ఆడా' అంటూ పదే పదే అంది. దీంతో తనను ‘ఆడది' అన్నట్లుగా అఖిల్ అర్థం చేసుకుని ఏడ్చేశాడు.

అంటూ దూసుకొచ్చేశాడు

అంటూ దూసుకొచ్చేశాడు

కెప్టెన్సీ టాస్కు నుంచి వైదొలిగిన తర్వాత అజయ్.. బిందుతో గొడవ పడ్డాడు. ‘వాడు ఫ్రెండ్స్ లేకుంటే బతకలేడు అంటున్నావేంటి' అంటూ ఆమెపైకి దూసుకొచ్చాడు. ఈ క్రమంలోనే బూతు మాటలను కూడా వాడాడు. దీంతో బిందు కూడా అతడి మీదకు వచ్చి ‘నీ ప్రాబ్లం ఏంటి' అంటూ సీరియస్ అయింది. మొత్తానికి ఈ గొడవ బిగ్ బాస్ షోలో తెగ హైలైట్ అయిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X