Bigg Boss Non Stop: బిగ్ బాస్ ముందే లవ్ ఫెయిల్.. నాగార్జున ముందు బయటపెట్టిన తెలుగు హీరోయిన్

తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. సుదీర్ఘ కాలంగా నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అంతేకాదు, దేశంలో మరే భాషలోనూ రాని విధంగా టీఆర్పీ రేటింగ్‌ను అందుకుంటోన్న ఇది నెంబర్ వన్ ప్లేస్‌కు చేరుకుంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటున్నారు.

ఇలా ఇప్పటికే ఐదింటిని దిగ్విజయంగా ముగించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట ఓటీటీ వెర్షన్‌ను తీసుకు వచ్చారు. శనివారమే మొదలైన ఈ సీజన్‌లోకి తెలుగు హీరోయిన్ బిందు మాధవి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున ముందే ఆమె తన లవ్ గురించి బయటపడింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

 అందులో మొదలైన బిగ్ బాస్

అందులో మొదలైన బిగ్ బాస్

బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' ఫస్ట్ సీజన్ శనివారమే ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇది మొత్తం 84 రోజుల పాటు సాగబోతుంది. ఇక, వైభవంగా సాగిన ప్రారంభ ఎపిసోడ్‌లో 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ హౌస్‌లోకి ఎన్నో ఆశలతో ఇచ్చారు. ఇక, ఈ సీజన్‌ను బుల్లితెరపై కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

గ్రాండ్‌గా ‘నాన్ స్టాప్' సీజన్

గ్రాండ్‌గా ‘నాన్ స్టాప్' సీజన్

ఈ రియాలిటీ షోను ఇష్టపడే వాళ్లంతా ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఓటీటీ మొదటి సీజన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్'ను ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభించారు. దీనికి సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ముందుగా ఆయన బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి.. అన్ని ప్రదేశాలనూ ప్రేక్షకులకు చూపించారు. ఆ తర్వాత కంటెస్టెంట్లను లోపలికి పంపించారు.

17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ

17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ప్రీమియర్ ఎపిసోడ్‌లో అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇచ్చారు.

తమిళం నుంచి తెలుగులోకి

తమిళం నుంచి తెలుగులోకి

శనివారం జరిగిన ఎపిసోడ్‌లో మొత్తం 17 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగు పెట్టారు. అయితే, అందులో స్పెషల్‌గా నిలిచింది మాత్రం తెలుగు హీరోయిన్ బిందు మాధవే అని చెప్పాలి. దీనికి కారణం ఆమె బిగ్ బాస్ తమిళం మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లడమే. అంతేకాదు, అక్కడ ఆమె చక్కని ఆటతీరుతో ఫినాలే వరకూ వెళ్లింది. దీంతో ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ పట్టేసింది.

బిందు మాధవికి నాగ్ ప్రశంస

బిందు మాధవికి నాగ్ ప్రశంస

చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన బిందు మాధవి 'ఆవకాయ్ బిర్యానీ' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉన్న తమిళ బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఫినాలే వరకూ వెళ్లింది. ఈ విషయాన్ని వెల్లడించిన నాగార్జున.. ఆమెను ఎంతగానో ప్రశంసించాడు.

ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అంటూ

ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అంటూ

స్టేజ్‌పై ఉన్న సమయంలో బిందు మాధవిని 'తమిళ బిగ్ బాస్‌లోకి వెళ్లే ముందు నువ్వు డిప్రెషన్‌లో ఉన్నావంట ఎందుకు' అని ప్రశ్నించాడు. దీనికామె 'అవును సార్.. దానికి ముందు నేను ఒకరిని ప్రేమించాను. కానీ, అప్పుడే బ్రేకప్ అయింది. దీంతో చాలా డిప్రెషన్‌లోకి వెళ్లాను. కౌన్సెలింగ్ తీసుకుంటున్న సమయంలోనే బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది' అని చెప్పుకొచ్చిందామె.

బిగ్ బాస్ వల్లే.. ఛాన్స్ కోసమే

బిగ్ బాస్ వల్లే.. ఛాన్స్ కోసమే

ఆ తర్వాత బిందు మాధవి మాట్లాడుతూ.. 'డిప్రెషన్‌తో షోలోకి వెళ్లినా.. అక్కడ వాతావరణంతో త్వరగా కోలుకున్నాను. బిగ్ బాస్ నన్ను మంచిగా మార్చింది. ఇప్పుడు మరోసారి ఆఫర్ ఇచ్చింది. ఇక, ఇందులోకి రావడానికి మాత్రం కారణం తెలుగు వాళ్లకు మరింత దగ్గరవ్వాలని, సినిమా ఛాన్స్‌లు అందుకోవాలనే' అంటూ చెప్పింది. ఇలా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X