Bigg Boss Non Stop: బిందు మాధవి మిడ్‌నైట్ రొమాన్స్.. వెంటనే హగ్ ఇచ్చిన అఖిల్.. కంటెస్టెంట్లు షాక్!

సరికొత్త కాన్సెప్టుతో పాటు కొట్లాటలు, రొమాన్స్, లవ్ ట్రాకులు ఇలా ఎన్నో అంశాలతో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. దేశంలో చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా తెలుగులో మాత్రమే ఇది భారీ స్పందనను అందుకుంటోంది. ఫలితంగా నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. దీంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ను మొదలు పెట్టారు. ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఇందులో టైటిల్ ఫేవరెట్‌గా వచ్చిన బిందు మాధవి తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో మిడ్‌నైట్ రొమాన్స్ అంటూ అందరికీ షాకిచ్చింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

మజాను పంచుతోన్న ఓటీటీ సీజన్

మజాను పంచుతోన్న ఓటీటీ సీజన్

ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ మూడు వారాల క్రితమే ప్రారంభం అయింది. అంచనాలకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్ల కంటే ఎక్కువగానే గొడవలు ఇందులో కనిపిస్తున్నాయి. అలాగే, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చతో ఈ సీజన్ అంతకంతకూ రంజుగా మారుతూ వస్తోంది.

17 మంది ఎంట్రీ.. ఆమె ఫేవరెట్‌

17 మంది ఎంట్రీ.. ఆమె ఫేవరెట్‌

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ఇందులోకి మొత్తం 17 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇందులో ఇద్దరు ముగ్గురు మాత్రమే టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగారు. అందులో తెలుగు హీరోయిన్ బిందు మాధవి పేరు ముందుగా చెప్పుకుంటున్నారు.

తమిళంలో ఫైనల్‌కు.. ఇప్పుడిలా

తమిళంలో ఫైనల్‌కు.. ఇప్పుడిలా


చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన బిందు మాధవి ‘ఆవకాయ్ బిర్యానీ' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉన్న తమిళ బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఫినాలే వరకూ వెళ్లింది. కానీ, నాలుగో స్థానంలో సరిపెట్టుకుంది. ఇక, ఇప్పుడు నాన్‌ స్టాప్‌లోకి ప్రవేశించింది.

మైండ్ గేమ్.. ఆరంభంలోనే క్రేజ్

మైండ్ గేమ్.. ఆరంభంలోనే క్రేజ్


బిందు మాధవి తెలుగులో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపును అందుకోలేదు. అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఫేమస్ కాదేమో అని అంతా అనుకున్నారు. కానీ, ఆరంభం నుంచే ఆమె హైలైట్ అవుతోంది. మరీ ముఖ్యంగా మైండ్‌గేమ్‌తో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఔరా అనిపిస్తోంది. అలాగే, కూల్‌గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది.

టార్గెట్ చేస్తూ.. గొడవలు పడుతూ

టార్గెట్ చేస్తూ.. గొడవలు పడుతూ

టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న బిందు మాధవిని బిగ్ బాస్ హౌస్‌లోని సీనియర్లు అందరూ టార్గెట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తేజస్వీ మదివాడ, నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్‌, అషు రెడ్డిలు ఆమెపై కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తరచూ గొడవలు పడుతున్నారు. దీంతో బిందు మాధవికి సానుభూతి కూడా పెరుగుతోంది. ఫలితంగా ఆమెకిది మరింత బలంగా తయారు అవుతోంది.

బిందు మాధవి మిడ్‌నైట్ రొమాన్స్

బిందు మాధవి మిడ్‌నైట్ రొమాన్స్


తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో మార్నింగ్ యాక్టివిటీలో భాగంగా ఒక కంటెస్టెంట్.. మరో కంటెస్టెంట్‌ను అబద్ధాలతో పొగుడుతూ ఉండాలి. అలా అద్బుతమైన ప్రదర్శనతో అందరినీ నవ్వించాలి అని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో అఖిల్‌తో పాటు బిందు మాధవి టాస్క్ చేసింది. దీనిలో భాగంగా ఆమె.. అఖిల్ హ్యాండ్సమ్ అని, అతడితో రొమాన్స్ చేసినట్లు కల వచ్చిందని చెప్పింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Netizens trolls bigg Boss for splitting winner Abhijeet prize money to Sohel
మురిసిపోయిన అఖిల్... హగ్‌తో

మురిసిపోయిన అఖిల్... హగ్‌తో

ఈ టాస్కులో బిందు మాధవి మాట్లాడుతూ.. ‘నాకు నైట్ మీతో రొమాన్స్ చేసినట్లు కల వచ్చింది. ఈ హౌస్‌లో మీరే హాండ్సమ్. ఉదయాన్నే నా కళ్లు మీకోసమే చూస్తుంటాయి' అంటూ చాలా పొగిడేసింది. దీంతో అఖిల్ కూడా మురిసిపోయాడు. వెంటనే గొడవలను పక్కన పెట్టేసి ఆమెకు హగ్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా అతడు ఎంతోసేపు చాలా సంతోషంగా కనిపించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X