Bigg Boss Non Stop: బిందు మాధవిపై ఆ కంటెస్టెంట్ల దాడి.. మైక్ విసిరేసి మరీ.. షోలో ఇదే తొలిసారి
బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ రియాలిటీ షో దాదాపు ఐదేళ్లుగా ప్రభావాన్ని చూపిస్తూ టాప్ ప్లేస్‌లో నిలుస్తోంది. అసలే మాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన దీనికి తెలుగు ఆడియెన్స్ భారీ రెస్పాన్స్ అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ను కూడా జనరంజకంగా నడుపుతున్నారు. ఆరంభంలోనే మంచి ఆదరణను అందుకున్న ఈ సీజన్‌లో తాజాగా బిందు మాధవి ఊహించని ప్రవర్తనతో అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!
Recommended Video


నాన్ స్టాప్‌గా మజాను అందిస్తూ
ప్రారంభించానికి ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ గత నెలలో ప్రారంభం అయింది. ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్ల కంటే ఎక్కువగానే గొడవలు ఇందులో కనిపిస్తున్నాయి. అలాగే, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చతో ఈ సీజన్ అంతకంతకూ రంజుగా మారుతూ మజాను అందిస్తోంది.

టైటిల్ ఫేవరెట్లు వాళ్లిద్దరే అని
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ అనుకున్నట్లుగానే గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇందులోకి మొత్తం 17 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇందులో ఇద్దరు టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగారు. అందులో ఒకరు మాజీ రన్నరప్ అఖిల్ సార్థక్ కాగా.. మరొకరు తెలుగు హీరోయిన్ బిందు మాధవి.

ఆటతో పాటు మైండ్‌గేమ్ కూడా
తాజా సీజన్‌లో టైటిల్ ఫేవరెట్లు అనిపించుకుంటోన్న బిందు మాధవి, అఖిల్ సార్థక్ ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా ఆడుతున్నారు. ఆట పరంగా ఇద్దరూ పోటీ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలాగే, మైండ్ గేమ్ పరంగానూ సత్తా చాటుతున్నారు. అయితే, ఆరంభం నుంచే వీళ్ల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. మధ్యలో కలిసినా దూరంగానే ఉంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు.

బిగ్ ఫైట్.. అలాంటి మాటలతో
నాలుగో వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్కు మొత్తం గొడవలతో సాగింది. మరీ ముఖ్యంగా యాంకర్ శివను సపోర్ట్ చేయడానికి బిందు మాధవి.. అతడిని ఓడించడానికి అఖిల్ సార్థక్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అప్పుడు బిందు.. ఫ్రెండ్ లేకుంటే బతకలేవు.. నువ్వు ఏ గేమ్ ఆడా అంటూ మాటలు అనడంతో అఖిల్ బాగా ఏడ్చేశాడు.

అఖిల్... బిందుకు విడాకులు
ఐదో వారానికి సంబంధించి కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసే టాస్కులో భాగంగా కోర్ట్ రూమ్ టాస్కును ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో బిందు మాధవి, అఖిల్ సార్థక్ విడాకులు తీసుకోడానికి కోర్టుకు వచ్చారు. వీళ్లలో ఎవరిది తప్పు అని తేలితే వాళ్ల టీమ్ ఓడినట్లు. ఇందులో జడ్జ్‌గా ముమైత్ రీఎంట్రీ ఇచ్చింది. బిందుకు శివ.. అఖిల్‌కు నటరాజ్ మాస్టర్ లాయర్లుగా వ్యవహరించారు.

బిందుపై అఖిల్ వర్గం దాడితో
లాయర్లు తమ క్లయింట్ల తరపున వాదిస్తోన్న తరుణంలో రెండు టీమ్‌ల సభ్యులు ఆరోపణలు చేయాల్సి ఉంటుంది. ఇందులో అఖిల్ తరపున అషు రెడ్డి, స్రవంతి, తేజస్వీ, అజయ్‌లు గట్టిగా తమ వాదనను వినిపించారు. ఒకానొక సమయంలో అందరూ బిందు క్యారెక్టర్‌పై మాటల దాడి చేసి తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అలాగే, నటరాజ్ కూడా ఆమె తన కోపాన్ని మొత్తం చూపించాడు.

మైక్ విసిరేసి.. ఏడుస్తూ అలా
తనపై అందరూ మాటల దాడి చేస్తుండడంతో బిందు మాధవి తట్టుకోలేక వెంటనే తన మైక్‌ను విసిరేసి మరీ వెళ్లిపోయింది. ఆ తర్వాత బెడ్‌పై పడుకుని చాలా సేపు ఏడుస్తూ కనిపించింది. గతంలో ఎవరూ ఇలా మైక్ విసరలేదని కూడా ఆమెపై విమర్శలు చేశారు. కొద్ది సేపటికి తేరుకున్న బిందు మాధవి.. తిరిగి టాస్కులో పాల్గొంది. ఇందులో గెలిచేది ఎవరో ఈరోజు తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











