Bigg Boss Non Stop: అర్ధరాత్రి అతడితో ఒకే బెడ్‌పై బిందు.. F** అంటూ బూతులు మాట్లాడడంతో!

తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకుని ఆదరణను దక్కించుకుంటాయి. ఫలితంగా సూపర్ సక్సెస్ అవుతుంటాయి. అలాంటి కార్యక్రమాల్లో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. అంచనాలు లేకుండానే వచ్చిన విజయవంతంగా ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది.

దీంతో ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ను మొదలెట్టి.. దీన్ని కూడా అంతకంతకూ ఆసక్తికరంగా నడుపుతున్నారు. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో టైటిల్ ఫేవరెట్ బిందు మాధవి బూతులు మాట్లాడి అందరికీ షాకిచ్చింది. అసలేం జరిగింది? ఆ వివరాలేంటో మీరూ చూడండి!

నాన్ స్టాప్‌ స్టఫ్‌తో బిగ్ బాస్

నాన్ స్టాప్‌ స్టఫ్‌తో బిగ్ బాస్

ప్రకటన సమయం నుంచే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ గత నెలలో ప్రారంభం అయింది. ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. గత సీజన్ల కంటే ఎక్కువగానే గొడవలు, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చతో ఈ సీజన్ అంతకంతకూ రంజుగా మారుతూ అనుకున్న దాని కంటే ఎక్కువ మజాను అందిస్తోంది.

టైటిల్ ఫేవరెట్‌గా బిందు

టైటిల్ ఫేవరెట్‌గా బిందు

ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ అనుకున్నట్లుగానే గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇందులోకి మొత్తం 17 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఇందులో ప్రముఖ హీరోయిన్ బిందు మాధవి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. దీంతో ఆరంభంలోనే ఆమె అందరి దృష్టినీ పట్టేసింది.

ఆటతో పాటు మైండ్‌ గేమ్

ఆటతో పాటు మైండ్‌ గేమ్

తాజా సీజన్‌లో టైటిల్ ఫేవరెట్ అనిపించుకుంటోన్న బిందు మాధవి తనదైన ఆటతో అందరికీ గట్టి పోటీని ఇస్తుంది. టాస్కులను చక్కగా ఆడుతూనే మైండ్ గేమ్ పరంగానూ సత్తా చాటుతోంది. అయితే, మరీ ముఖ్యంగా ఏ విషయంలోనైనా క్లారిటీ వ్యవహరిస్తూ నచ్చని వాటిని విభేదిస్తోంది. ఫలితంగా హౌస్‌లోని ఒక వర్గానికి చుక్కలు చూపిస్తోంది. ఇలా బిందు తరచూ హైలైట్ అవుతోంది.

అతడితో ఎక్కువ క్లోజ్‌గా

అతడితో ఎక్కువ క్లోజ్‌గా

గతంతో తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన బిందు మాధవి.. తమిళ బిగ్ బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్‌గా వెళ్లింది. మళ్లీ చాలా కాలం తర్వాత నాన్ స్టాప్ సీజన్‌తో తెలుగులోకి వచ్చింది. ఇక, ఈ సీజన్‌లో ఈమె ఆరంభం నుంచే యాంకర్ శివతో క్లోజ్‌గా ఉంటోంది. అతడితోనే మాట్లాడుతూ.. ఆడుకుంటూ కనిపిస్తోంది. అలాగే, శివకు మద్దతుగా పలుమార్లు గొడవలు కూడా పెట్టుకుంది.

కెప్టెన్సీ టాస్క్ నడిపించి

కెప్టెన్సీ టాస్క్ నడిపించి

ఆరో వారానికి జరిగిన కెప్టెన్సీ టాస్కులో పోటీదారులుగా ఉన్న నలుగురులో ఎవరికి అర్హత లేదని అనుకుంటారో వాళ్లను.. మిగిలిన కంటెస్టెంట్లు సరైన కారణాలు చెప్పి కత్తితో వాళ్ల ఫొటోలను పొడవాలని చెప్పారు. ఈ టాస్క్‌కు బిందు మాధవిని సంచాలకురాలిగా నియమించారు. ఇక, ఇందులో అషు రెడ్డి విజయం సాధించింది. ఫలితంగా ఆమె ఇంటికి కెప్టెన్‌గా ఎంపిక అయింది.

అలిగిన శివ.. అర్ధరాత్రిలో

అలిగిన శివ.. అర్ధరాత్రిలో

కెప్టెన్సీ టాస్కులో సంచాలక్‌గా చేసిన బిందు మాధవి తనకి సపోర్ట్‌ చేయలేదని యాంకర్ శివ అలిగాడు. అప్పుడు ఆమె ఏదో వివరణ ఇస్తున్నా కూడా అతడు వినిపించుకోకుండా వెళ్లిపోయాడు. ఇక, అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత బిందు అతడిని పిలిచి మాట్లాడడానికి ప్రయత్నించింది. అప్పుడు యాంకర్ శివ కూడా ఆమె బెడ్ మీదకు వెళ్లి దుప్పటిలో దూరిపోయాడు.

బిందు నోటితో బూతులు

బిందు నోటితో బూతులు

యాంకర్ శివ అలిగాడని తెలుసుకున్న బిందు మాధవి.. అతడిని బ్రతిమాలుతూ కనిపించింది. కానీ, అతడు మాత్రం అస్సలు వినలేదు. అప్పుడామె What the fuck అంటూ బూతు మాట అనేసింది. ఇక్కడామె అనడంలో తప్పేమీ లేదు. కానీ, మొన్న ఇదే మాట అన్నాడని అజయ్‌పై బిందు గొడవ చేసింది. పైగా ఆమె నోటి నుంచి ఈ మాట రావడంతో ఇప్పుడిది హైలైట్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X