Bigg Boss Non Stop: ఈసారి ఎలిమినేషన్స్ లో కొత్త ట్విస్ట్.. ఆ రూట్లో ఆలోచిస్తే వాళ్లిద్దరిలో ఒకరు?
బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షో రోజుకోక కొత్త మలుపులతో ఎంతో ఆసక్తికరంగా మారుతోంది. బిగ్ బాస్ మొదట్లో కాస్త బోర్ కొట్టించినప్పటికి కూడా ఇప్పుడు మాత్రం సరికొత్త టాస్క్ లతో కంటెస్టెంట్స్ మధ్యలో పోటీని తీవ్రతరం చేస్తున్నాడు. అయితే ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ లో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రతి ఆదివారం కూడా నాగార్జున బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరిని పంపిస్తుండగా ఈ వారం అంత కంటే రెండు రోజుల ముందే ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ రూట్లో ఆలోచిస్తే మాత్రం ఇద్దరిలో ఒకరు తప్పనిసరిగా ఈ వారం ఇంట్లో నుంచి వెళ్లి పోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది పూర్తి వివరాల్లోకి వెళితే..

మొదట్లోనే అసంతృప్తి
బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కొంతమంది కంటెస్టెంట్స్ అయితే ఎందుకు ఉన్నారో.. అనే సందేహాలు చాలానే వస్తున్నాయి. అసలే కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఓ వర్గం ప్రేక్షకులు అయితే తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారైనా డిఫరెంట్ సెలబ్రిటీలను హౌస్ లోకి తీసుకు వస్తారు అని అనుకుంటే.. అసలు గుర్తు పట్టని వారిని తీసుకు వచ్చారని నెగిటివ్ కామెంట్స్ చేశారు.

వెన్నుపోటు పొడిచే పరిస్థితి..
ఇక బిగ్ బాస్ మాత్రం ఆ విషయాలను పట్టించుకోకుండా టాస్క్ ల విషయంలోనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండడం విశేషం. కంటెస్టెంట్స్ మధ్యలో గొడవలు సృష్టించి మళ్ళీ వారి మధ్యలో ఏదో ఒక స్నేహం వాతావరణాన్ని క్రియేట్ చేయడం అలవాటుగా వస్తున్నదే. ఇక ఈసారి యాంకర్ శివ అరియానా మధ్యలో కూడా అదే తరహాలో గొడవలు మొదలవుతున్నాయి. మొన్నటి వరకూ ఎంతో అన్యోన్యంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు మాత్రం టాస్క్ ల విషయంలో ఒకరికొకరు వెన్నుపోటు పొడిచే పరిస్థితికి వచ్చారు.

న్యాయం లేకుండా ఎలిమినేషన్స్?
ఇక ఆ సంగతి పక్కన పెడితే ఎలిమినేషన్స్ విషయంలో అయితే బిగ్ బాస్ పై తీవ్రస్థాయిలో నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఉండాల్సిన వల్లనే చాలా తొందరగా బయటకు పంపిస్తూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఏదేమైనా ఇప్పటివరకు ఎలిమినేషన్ లో సమ న్యాయం జరగడం లేదని నాగార్జున కూడా ఒక వైపు నుంచి ఆలోచిస్తున్నారు అని ఓ వర్గం నెటిజన్లు భారీ స్థాయిలో సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ముందుగానే ఒక ఎలిమినేషన్?
ఇక ప్రతి ఆదివారం కూడా ఎలిమినేషన్ లో ఉన్న వారిలో ఒకరిని బయటకు పంపింస్తూ ఉండగా.. ఈసారి ఆ తరహా ప్లాన్ లేకపోవచ్చు అని తెలుస్తోంది. బిగ్ బాస్ నాగార్జున కంటే ముందుగానే ఒకరిని ఇంట్లో నుంచి పంపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కుదిరితే ఈవారం ఇద్దరు హౌస్ నుంచి బయటకు వెళ్లి పోవచ్చని కూడా టాక్ వినిపిస్తోంది. రాబోయే రెండు రోజుల్లో ఎలిమినేషన్స్ ఎప్పుడైనా జరగవచ్చు అని కూడా బయట ఒక టాక్ వినిపిస్తోంది.
Recommended Video


వాళ్లిద్దరిలో ఒకరు?
ఇక ఎలిమినేషన్స్ లో వెళ్ళిపోవాల్సి వస్తే ఎవరు వెళ్ళిపోతారు అనే విషయంలో కూడా ఇప్పటికే అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ప్రతి వారం కూడా డేంజర్ జోన్లో కొనసాగుతున్న మిత్ర వర్మ అలాగే స్రవంతి ఇద్దరికీ కూడా అసలు ఏమాత్రం ఓట్లు రావడం లేదని తెలుస్తోంది. ప్రతివారం కూడా ప్రేక్షకుల ఓట్లను అందుకున్న వారిలో ఈ ఇద్దరు చివరి స్థానంలో నిలుస్తున్నారు. వీరితోపాటు ముమైత్ ఖాన్ కు కూడా ఓట్లు ఏమాత్రం దక్కడం లేదు. ఇక ఈసారి ఓటింగ్ రూట్ లో మాత్రం ఎలిమినేషన్ ప్రక్రియకు కొనసాగిస్తే శ్రవంతి, ముమైత్ ఖాన్ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్లిపోవడం పక్కా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











