Bigg Boss Non Stop: హీట్టెక్కిస్తున్న నామినేషన్స్.. నటరాజ్ వార్నింగ్.. బిందుమాధవి కౌంటర్

బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మొత్తానికి రెండు వారాల పాటు విజయవంతంగా కొనసాగింది. మొదట్లో కంటెస్టెంట్స్ విషయంలో సోషల్ మీడియాలో పలు రకాల నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా బిగ్ బాస్ మాత్రం టాస్క్ ల విషయంలో ఏ మాత్రం తగ్గకుండా షో పై ఆసక్తిని కలిగించారు. ప్రస్తుతం కంటెస్టెంట్స్ వారి సర్వ శక్తులను బయట పెట్టి గేమ్ ను ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక రెండవ వారం నామినేషన్ ప్రక్రియ కూడా ఆసక్తికరంగా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కంటెస్టెంట్స్ ఈవారం గట్టిపోటీని ఎదుర్కోబోతున్నట్లు ప్రోమో ద్వారా అర్థమైంది. ప్రోమో వివరాల్లోకి వెళితే..

అరియానా vs తేజస్వి

అరియానా vs తేజస్వి

ముందుగా తేజస్వనీ మన పక్కపక్కనే ఉంటూ గోతులు తవ్వే వాళ్లు అంటే నాకు లైఫ్ లో ఏ మాత్రం ఇష్టం ఉండదు అని చెప్పడంతో ఆమె డైరెక్ట్ గా అరియానాకు కౌంటర్ వేసింది అని అర్థం అయింది. ఒకే గ్రూప్ కు చెందిన వారి మధ్య లో గత వారం ఒక జరిగిన టాస్క్ విషయంలో చాలా గొడవలు జరిగాయి. ఇక ఆమె మోసం చేసింది అని మహేష్ కూడా ఓపెన్ గానే చెప్పేసాడు. తేజస్వి కూడా నామినేషన్ ప్రక్రియ లో ఆమెను ఫోకస్ చేసినట్లుగా క్లారిటీగా అర్ధమైపోయింది.

ఓటు వేశానా లేదా?

ఓటు వేశానా లేదా?

ఇక తేజస్విని మదివాడ అలా అనగానే అరియానా రంగంలోకి దిగింది. తేజస్విని ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని కామెంట్ చేయడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక దానికి కౌంటర్ గా తేజస్వి కెప్టెన్గా వెళతాను అని అన్నప్పుడు నీవు నాకు ఓట్ కావాలి అని అడిగినప్పుడు నేను ఓటు వేశానా లేదా అనే విషయాన్ని కూడా తేజస్వి గుర్తు చేసింది.

కాళ్లు పట్టుకుంటానన్న చైతూ

కాళ్లు పట్టుకుంటానన్న చైతూ

మరొకవైపు చైతు మిత్రశర్మ మధ్యలో కూడా వాదోపవాదాలు గట్టిగానే కొనసాగినట్లు అర్థమైంది ముందుగానే నీ కాళ్లు పట్టుకుంటాను అంటూ చైతు చెప్పడం ఆ తర్వాత ఈ మిత్రశర్మ అందరూ ముందు మంచి గురించి మాట్లాడుతూ ఆ తరువాత మాట మారుస్తున్నారని ఈ కింది కింది మాటలు తనకు అర్థం కావు అని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

బిందు మాధవి vs అఖిల్

బిందు మాధవి vs అఖిల్

ఇక వారియర్స్ ఛాలెంజర్లను విడదీసినందుకు వచ్చావా అని అఖిల్ మాటలను గుర్తు చేసిన శివకు మాటల దాడి మొదలైంది. నిన్ను ఒక వర్డ్ అన్నప్పుడు నన్ను అను లేకుంటే అనవద్దని వాదించారు. ఇక శ్రవంతి కూడా శివ పేరును గుర్తు చేసింది. అలాగే మిత్రా శర్మ కూడా శివ విషయానికి వచ్చేసరికి తనను అందరూ సైడ్ చేసినట్లు చెప్పుకొచ్చింది.

ఇక ఆ తరువాత అఖిల్ వర్సెస్ బిందు మాధవి గొడవ గట్టిగానే సాగింది. తప్పుల గురించి బిందు అఖిల్ ను నిలదీసే ప్రయత్నం చేసింది. ఇక ఆర్జే చైతు తేజస్వి అనవసర నవ్వులు డిస్టబెన్స్ క్రియేట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu

గుద్ధడం అంటే ఎలా ఉంటుందో తెలుసా..

ఇక నటరాజ్ మాస్టర్ తనకు వార్నింగ్ ఇవ్వకూడదు అంటూ యాంకర్ శివతో చెప్పగా అతను మీరు డోర్ దగ్గర నన్ను ఎలా గుద్దారో తెలుసా అంటూ పాత గోడవకలను గుర్తు చేశారు. అది గుద్దడం అంటారా..గుద్ధడం అంటే ఎలా ఉంటుందో తెలుసా నీకు అని నటరాజ్ మాస్టర్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కౌంటర్ ఇచ్చాడు.

ఇక మరోవైపు అనిల్ మాటల వరకు ఓకే కానీ హ్యాండ్స్ తో పుష్ చేయడం అంటే కరెక్ట్ కాదు అని మహేష్ ను హెచ్చరించగా అతను కూడా ఏ మాత్రం తగ్గకుండా నువ్వు వెళితే మాత్రం ఓకే మేము ఆపితే మాత్రం తప్పా అని అన్నాడు. ఇక అనిల్ దొబ్బేసావు అని అన్నాడు. చూస్తుంటే ఈ వారం నామినేషన్ ఎవరు ఉహించని విధంగా కొనసాగనున్నట్లు అనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X