Bigg Boss Non Stop: బిగ్ బాస్‌కే ఎదురు తిరిగే పరిస్థితి.. దారుణంగా ఆలోచిస్తున్న కంటెస్టెంట్స్
బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి కూడా కంటెస్టెంట్స్ అందరూ ఎవరికి నచ్చిన స్టైల్ లో వారు వెళ్లే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. కొన్నిసార్లు బిగ్ బాస్ నియమాలను కూడా లెక్క చేయడం లేదు అనే చెప్పాలి. వీలైనంత వరకు సేఫ్ గేమ్ ఆడుతూ ఇతరులను విలన్స్ గా మారుస్తున్నారు. ఇక ఈసారి ఏకంగా బిగ్ బాస్ కు ఎదురు తిరిగేందుకు కూడా సిద్ధమయ్యారు అంటే వారి ఆలోచనా విధానం ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ ఏ విధంగా ఉండబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

అగ్గి రాజేసే విధంగా
బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. రెండు గ్రూపులుగా విడిపోయిన కంటెస్టెంట్స్ టాస్క్ లలో వారి సత్తాను చాటుతున్నారు. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను వారియర్లు గా కొత్తగా వచ్చిన వారిని ఛాలెంజర్లుగా సెట్ చేసిన బిగ్ బాస్ ఇద్దరి మధ్య అగ్గి రాజేసే విధంగా టాస్క్ లను పెడుతున్నాడు.

పుష్ప తరహాలో..
ఇక రీసెంట్ గా స్టార్ట్ చేసిన పుష్ప కాన్సెప్ట్ స్మగ్లర్లు vs పోలీస్ టాస్క్ లో కంటెస్టెంట్స్ పోటీపడి గేమ్ అడుతుండగా కొంతమంది మధ్యలో గొడవలు మొదలయ్యాయి. కంటెస్టెంట్స్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా నెట్టుకునే వరకు వెళుతున్నారు. ఇక రీసెంట్ గా వారియర్స్ అయితే ఛాలెంజర్లు ఆటకి నియమాలు లేవని వారిని బిగ్ బాస్ ఎందుకు కంట్రోల్ చేయడం లేదో అర్థం కావడం లేదని ఎదురు తిరిగేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఎంత చెప్పినా కూడా వినడం లేదని
ముందుగా యాంకర్ శివ మనం ఏమైనా అంటే నోరు జారుతున్నారు అంటూ తన టీమ్ మెంట్స్ తో చెప్పుకొచ్చాడు. మరొకవైపు స్మగుల్ చేయొద్దని ఎంత చెప్పినా కూడా వినడం లేదని అఖిల్ చెప్పాడు. కావాలని చెక్ పోస్ట్ లు దాటుతున్నారు అని అవి మనం చేసామా అలాంటివి అని అన్నాడు.

బిగ్ బాస్ కు ఎదురుతిరుగుతున్న కంటెస్టెంట్స్
ఇక మీరు నెక్స్ట్ టైమ్ నుంచి రూల్స్ పెట్టకండి అంటూ తేజస్విని చెప్పగా ఎవరికి నచ్చినట్లు వారు ఆడతారాని ఒకవేళ పెట్టినా కూడా డెమో లాంటిది ఇవ్వండి అని మిగతా వారియర్స్ చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ ఈ విషయంలో కరెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వకుంటే నెక్స్ట్ దాన్ని నేను బ్రేక్ చేయడానికి సిద్ధమే అని అఖిల్ మొండిగా చెప్పేశాడు.

మహేష్ విట్టా, అనిల్ మధ్యలో గొడవ
ఇక మరోవైపు బిగ్ బాస్ మాటను వారియర్స్ లెక్క చేయడం లేదని ఛాలెంజర్లు వాదించారు. ఈ క్రమంలో వారియర్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉండగా వెనకాల నుంచి ఛాలెంజర్లు మోసపూరిత గేమ్ ఆడారు. ఈ క్రమంలో మహేష్ విట్టా, అనిల్ మధ్యలో కూడా వాదనలు జరిగాయి. ఇక ఏమేస్తున్నావురా అంటూ మహేష్ చెప్పగా అనిల్ సీరియస్ అయ్యాడు.
Recommended Video
గొడవ జరుగుతూ ఉండగా..
గొడవ జరుగుతూ ఉండగా ఛాలెంజర్లు మొండిగా హుండీలో డబ్బులు వేసినట్లు డ్రాప్ బాక్స్ లో వేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ విషయంలో నటరాజ్ మాస్టర్ కూడా అప్సెట్ అయ్యాడు. కష్టపడి గేమ్ అడుతుంటే ఏంటిది బిగ్ బాస్ అని ఆయన కంటతడి పెట్టుకున్నారు. ఇక మరోవైపు ఛాలెంజర్లలో మిత్రా శర్మ కూడా ఎమోషనల్ అయ్యింది. మరి ఈ పరిణామాలు బిగ్ బాస్ ను ఎలాంటి మలుపు తిప్పుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











