Bigg Boss Non Stop నామినేషన్స్ లో అందరి చూపు ఆమె వైపే.. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలైన రెండు రోజుల వరకు కూడా అనుకున్నంత అంశాలు ఏవి హైలెట్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్స్ అందరూ కూడా జనాలకు కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికివారు నచ్చినట్టు గా గేమ్ ప్లాన్ ను ఫాలో అవుతున్నారు. ఇక వారియర్స్ గా వచ్చిన సీనియర్స్ మాత్రం ఎప్పటిలానే రొటీన్ ఫార్ములాల తో కాస్త చిరాకు తెప్పిస్తారు అనే చెప్పాలి. ఇక మొదటి వారం నామినేషన్స్ లోకి వచ్చిన వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇక అందరి చూపు అయితే ఒక కంటెస్టెంట్ పైనే ఉంది. ఆమె ఈ వారం హౌస్ లో నుంచి వెళ్లిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆమె ఎవరు అనే వివరాల్లోకి వెళితే..

హిందీలో సక్సెస్ కావడంతో..

హిందీలో సక్సెస్ కావడంతో..

బిగ్ బాస్ టెలివిజన్ లో మొదటి ఐదు సీజన్స్ సక్సెస్ కావడంతో ఆరో సీజన్ ను కూడా చాలా తొందరగానే మొదలుపెట్టాలి అని చాలా రకాల ప్రణాళికలు రచించారు. కానీ హిందీలో లో బిగ్ బాస్ కంటెంట్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో తెలుగులో కూడా అదే తరహాలో స్టార్ట్ చేయాలి అని ఆలోచనలు మార్చుకోవాల్సి వచ్చింది. ఇక నాగార్జున కూడా హోస్ట్ చేయడానికి సిద్ధమవడంతో నిర్వాహకులు భారీ స్థాయిలోనే మొదలుపెట్టారు.

మొదటి రోజు నుంచే..

మొదటి రోజు నుంచే..

ఈసారి కొంతమంది మాజీ సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొనడం విశేషం. ఇక వారిని వారియర్స్ గా ఒక గ్రూప్లలోకి చేర్చిన విషయం తెలిసిందే. కొత్తగా వచ్చిన వారిని చాలెంజర్స్ గా మార్చిన బిగ్ బాస్ రెండు గ్రూపుల మధ్య కాంట్రవర్సి గొడవలకు కారణం అయ్యేలా టాస్క్ లను కూడా ఇస్తున్నారు. ఇక ప్రతి ఒక్కరూ కూడా మొదటి రోజు నుంచే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు.

ఈ వారం ఎలిమినేషన్..

ఈ వారం ఎలిమినేషన్..

ఇక ఈ వారం నామినేట్ అయిన వారిలో ఎవరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా బిగ్ బాస్ అభిమానులు పోల్స్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే అందరి చూపు మాత్రం ఒక అమ్మాయి పైనే ఉంది. మొదటి వారం ఆమె ఈజీగా హౌస్ మంచి వెళ్ళిపోతుందని ఒక అంచనాకు వస్తున్నారు.

నామినేషన్స్ లో ఉన్నవారు..

నామినేషన్స్ లో ఉన్నవారు..

ఇక ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్నవారు నటరాజ్, 7 ఆర్ట్స్ సరయు, అరియానా గ్లోరీ, హమీదా ఖాతూన్, మిత్రావ్ శర్మ, ఆర్జే చైతు, ముమైత్ ఖాన్.. ఏడుగురు పేర్లు నామినేట్ చేయబడ్డాయి. ఇక వీరిలో మంచి క్రేజ్ ఉన్నటువంటి ముమైత్ ఖాన్ అరియానా, చైతూ సరయు మొదటి వారంలో ఎలిమినేట్ కారు అని చెప్పవచ్చు. వీరు నిత్యం హౌస్ లో ఏదో ఒక టాపిక్ తో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants List | Bigg Boss Telugu OTT | Oneindia Telugu
 మిత్రశర్మ ఎలిమినేట్?

మిత్రశర్మ ఎలిమినేట్?

ఇక మొదటి నుంచి హౌస్ లో చాలా గట్టిగా నిలబడాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఒక అమ్మాయి మాత్రం జెన్యూన్ గా గేమ్ ఆడడం లేదు అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఆమె మరెవరో కాదు మిత్రశర్మ అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో కూడా చాలామంది ఆమె ఈ వారం వెళ్లి పోతుంది అని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఇన్ సైడ్ టాక్ ప్రకారం కూడా నిర్వాహకులు ఆమెనే ఎలిమినేట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఫైనల్ ఎలిమినేషన్ డే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X