Bigg Boss Non Stop: ఈసారి నాగార్జున రెమ్యునరేషన్ ఎంతంటే.. గతంలో కంటే తక్కువగానే..?

బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే గొడవలు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటాయి. అలాంటి షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాలి అంటే చాలా టెన్షన్ తో కూడుకున్న పని. వీలైనంత వరకు గొడవలు పుట్టిస్తూనే సేఫ్ జోన్ లోనే హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉండాలి. ముఖ్యంగా బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోకు హోస్టింగ్ అనేది కత్తి మీద సాము లాంటిది అని కూడా చెప్పవచ్చు. మొదట వ్యాఖ్యాతగా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ నాని ఇద్దరు కూడా మళ్ళీ కంటిన్యూ చేయలేకపోవడానికి తీవ్ర ఒత్తిడే కారణం. ఇక నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కూల్ గా తన హోస్టింగ్ కు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సారి ఓటీటీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో కోసం ఆయన ఏ స్థాయిలో పారితోషకం తీసుకుంటున్నారు అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

ఒక్క సీజన్ కే గుడ్ బాయ్

ఒక్క సీజన్ కే గుడ్ బాయ్

తెలుగులో అసలు బిగ్ బాస్ షో సక్సెస్ అవుతుందా లేదా అనే కామెంట్స్ మొదట్లో చాలానే వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ తో అట్టహాసంగా మొదలైన బిగ్ బాస్ షో అయితే మొదట రేటింగ్స్ బాగానే అందుకుంది. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఒక వైపు సినిమాలు మరో వైపు రియాల్టీ షోను కొనసాగించే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కానీ ఆ తరువాత కంటిన్యూ అవ్వలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన నాని కూడా ఒక సీజన్ కే గుడ్ బాయ్ చెప్పేసాడు.

 అదుపు తప్పకుండా..

అదుపు తప్పకుండా..

ఇక మూడవ సీజన్ నుంచి కొనసాగుతున్న నాగార్జున మరోసారి తన ఆలోచనా విధానంతో షోకు సరైన న్యాయం చేశారు అని చెప్పాలి. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రియాలిటీ షోను చాలా తెలివిగా కొనసాగించారు. ఏమాత్రం అదుపు తప్పకుండా అలాగే తనపై కూడా నెగటివ్ కామెంట్స్ రాకుండా నాగార్జున బిగ్ బాస్ షోను కొనసాగించడం విశేషం.

 మరోసారి..

మరోసారి..

ఇక మూడవ సీజన్ తర్వాత మళ్లీ నాగార్జున కనిపించకపోవచ్చు అని కామెంట్స్ చాలానే వచ్చాయి. కానీ ఆ తర్వాత 5వ సీజన్ వరకు కూడా ఆయనే బెస్ట్ హోస్ట్ అని నిరూపించుకున్నారు. బిగ్ బాస్ ఓటీటీ విషయానికి వచ్చేసరికి మరోసారి నాగార్జున సిద్ధమవడం విశేషం. ఎనభై నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ షో 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ కానుంది.

రెమ్యునరేషన్ ఎంతంటే?

రెమ్యునరేషన్ ఎంతంటే?

అయితే ఈ షో కోసం నాగార్జునకు స్థాయిలో పారితోషికం ఇస్తున్నారు అనే విషయం కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం నాగార్జున ఈసారి పోషో కు 8 నుంచి 9 కోట్ల మధ్యలో పారితోషికం అందుకుంటున్నట్లుగా సమాచారం. ఒక విధంగా టెలివిజన్ బిగ్ బాస్ కు 10కోట్లకు పైగానే రాబట్టిన నాగార్జున ఇప్పుడు కాస్త తక్కువగానే, బిజినెస్ పరంగా ఆలోచించే ఈ స్థాయిలో పారితోషికం అందుకుంటున్నారని సమాచారం.

ఛాలెంజర్స్ vs వారియర్స్..

ఛాలెంజర్స్ vs వారియర్స్..

ఇక ఈసారి హౌస్ లోకి వచ్చిన 17 కంటెస్టెంట్స్ లలో కొంతమంది ఇదివరకే బిగ్ బాస్ షోలతో పాల్గొన్నారు. ఇక వారిని ఛాలెంజెర్స్ గా కొత్త వారిని వారియర్స్ గా విడగొట్టడం జరిగింది. ఈసారి కంటెస్టెంట్స్ గా ఉన్నవారు.. అషూ రెడ్డి, మ‌హేష్ విట్టా, ముమైత్ ఖాన్‌, అజ‌య్‌, యాంకర్‌ స్రవంతి, ఆర్జే చైతూ, అరియానా, న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, శ్రీరాపాక, మోడల్‌ అనిల్‌ రాథోడ్‌, నటి మిత్ర శర్మ, తేజస్వీ, సరయు, యాంక‌ర్ శివ‌, హీరోయిన్‌ బిందు మాధవి, హ‌మిదా, అఖిల్‌ సార్థక్ ఓటీటీ బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్స్‌గా అడుగు పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X