Bigg Boss non stop: లుంగీ ఎత్తి చూపిస్తావా.. ఆ బూతులేంటి.. నటరాజ్ మాస్టర్ పై అరిచేసిన నాగార్జున!

బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూనే ఉన్నాయి. మొన్నటి వరకు ఎంతో సన్నిహితంగా ఉన్న వారు కూడా ఇప్పుడు హఠాత్తుగా శత్రువులుగా మారిపోయే వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఎవరికి ఎవరు మోసం చేస్తున్నారు అనే విషయంలో నాగార్జున ఈ వారం కంటెస్టెంట్స్ అందరి నుంచి కూడా గుట్ట లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది అనవసరంగా వాదిస్తూ ఉండడంతో నాగార్జున చాలా ఫీలవుతున్నారు. ఇక ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కూడా చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎవరు మోసం చేస్తున్నారు

ఎవరు మోసం చేస్తున్నారు

ప్రత్యేకంగా సీక్రెట్ రూమ్ కి పిలిచి నాగార్జున అందరిని కూడా కొన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆటలో ముఖ్యంగా నిన్ను ఎవరు మోసం చేస్తున్నారు అని మహేష్ విట్టాను అడిగాడు. అందుకు అతను మోసం చేసే చనువు అయితే నేను ఎవరికీ ఇవ్వలేదు అని తెలివిగా సమాధానమిచ్చాడు.. ఇక మరోవైపు హమీద అయితే ఇక్కడ నేను ఎవరిని నమ్మడం లేదు అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

బిందుమాధవిని మోసం

బిందుమాధవిని మోసం

ప్రత్యేకంగా బిందుమాధవిని కూడా అడిగినా నాగార్జున అందరినీ మాయమాటలతో ఒకరు మోసం చేస్తున్నట్లుగా తెలుసుకున్నాడు. దానికి బిందుమాధవి ఏమి తోచడం లేదు అంటూ సమాధానం ఇచ్చింది.. ఇక నట్రాజ్ మాస్టర్ అయితే యాంకర్ శివ గురించి గట్టిగానే చెప్పినట్లుగా తెలుస్తోంది. చివరికి బిందు మాధవిని కూడా అతను మోసం చేస్తాడు అని మరోసారి వివరణ ఇచ్చాడు.

లుంగీ ఎత్తి చూపించడం..?

లుంగీ ఎత్తి చూపించడం..?

ఇక మొన్నటి వరకు ఎంతో స్నేహంగా ఉన్న అఖిల్ తనను మోసం చేస్తున్నట్లుగా స్రవంతి నోరు విప్పింది. ఇక యాంకర్ శివ ఉహీంచినట్లే నట్రాజ్ మాస్టర్ అప్పుడప్పుడు తనను మోసం చేస్తున్నట్లుగా సమాధానం ఇచ్చాడు. కానీ నువ్వు లుంగీ ఎత్తి చూపించడం కరెక్ట్ అని అనుకుంటున్నవా అని నాగార్జున అడిగాడు. కానీ నేను సరదాగా అనుకున్నాను అని శివ ఆన్సర్ ఇవ్వగా నాగార్జున బిగ్ బాస్ వీడియో చూపించండి అనే విధంగా యాంకర్ శివ అసలు రూపాన్ని బయటపెట్టాడు.

ఆ మాటలు ఏంటి?

ఇక యాంకర్ శివ రెచ్చగొట్టినందుకు నటరాజ్ మాస్టర్ ఒక విధంగా తన సహనాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో నాగార్జున 23 ఏళ్ళ సినిమా అనుభవం తో ఉన్న మీరు ఇలా మాట్లాడడం ఏమిటి అని అడిగారు. ఇక అందుకు నటరాజ్ మాస్టారు ఇప్పటికే పది పదిహేను సార్లు లేపి చూపించాడు అంటూ చెప్పగా.. అయితే బోసిడికే అనేస్తారు అంటూ నాగార్జున డైరెక్ట్ గా అడిగేసాడు.

అరిచేసిన నాగార్జున

అరిచేసిన నాగార్జున

ఇక కుర్తా వేసుకున్నప్పుడు కూడా అలానే చేశాడు అంటూ నట్రాజ్ మాస్టర్ మరో సారి ఆరోపణలు చేయగా.. నాగార్జున శివ ను గట్టిగా అడిగే ప్రయత్నం చేశాడు. అయితే ఒక వైపు నాగార్జున మాట్లాడుతూ ఉండగా నట్రాజ్ మాస్టర్ అదేపనిగా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు.

దీంతో సహనం కోల్పోయిన నాగార్జున సైలెంట్ గా ఉండమని ఒకసారి చెప్పాడు. అయినప్పటికీ కూడా నట్రాజ్ మాస్టర్ మళ్లీ అబద్ధం అంటూ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అతనితో మాట్లాడుతున్నాను కదా అంటూ గట్టిగా అరిచేశాడు.. మరి వీరి మధ్య సంభాషణ ఎంత వరకు వెళుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X