twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Non stop: నాగార్జున నోటి నుంచి బూతు పదం.. అతనికి కౌంటర్.. కంటెస్టెంట్స్ షాక్!

    |

    బిగ్ బాస్ షో సరికొత్త టాస్క్ లతో గోడవలతో రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. గడిచిన నాలుగు వారాలు కూడా ఊహించని విధంగా పేరున్న సెలబ్రెటీలు హౌస్ లో నుంచి వెళ్లిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక వారంతరంలో వస్తున్న నాగార్జున కూడా అద్భుతమైన హోస్టింగ్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ వారం నాగార్జున కంటెస్టెంట్స్ ను ఒక ఆట అడుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

    తొక్క, తోటకురా..

    తొక్క, తోటకురా..

    బృందావనంలో కృష్ణుడు వచ్చాడే.. అంటూ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఇక సోగ్గాడి తరహాలో ట్రెడిషనల్ లుక్ లోకి వచ్చిన కింగ్ నాగార్జున అందరిని ఒక ఆటాడుకున్నారు. అషు రెడ్డి ఆట తొక్క, తోటకురా అంటూ వాటినే చూపించడం షాక్ ఇచ్చింది. అషు రెడ్డి కూడా సరదాగా నవ్వుకుంది.

    నాగార్జున కౌంటర్స్

    నాగార్జున కౌంటర్స్

    అంతే కాకుండా అందరిని ఇమిటెడ్ చేసిన నాగార్జున ముందుగా నటరాజ్ మాస్టర్ ఛాతీ ముందుకు పెట్టుకొని నడుస్తున్న విధానాన్ని హైలెట్ చేశారు. నటరాజ్ మాస్టర్ కూడా చాలా సరదాగా నవ్వుకున్నాడు. ఇక ఆ తరువాత యాంకర్ శివ హామీదా మెడలో ఏదో గొలుసు లాంటిది వేస్తూ మళ్ళీ తీసేస్తాను లే అంటూ జవాబిచ్చాడు. దానిపై కూడా నాగార్జున కౌంటర్ వేశారు.

    బిందుమాధవితో అలా..

    బిందుమాధవితో అలా..

    కొంతమంది సెన్సిటివ్ గా ఉండే మైకులను విసిరేస్తూ ఉంటారని నాగార్జున బిందుమాధవిపై మరో సెటైర్ వేశారు. అంతే కాకుండా ఆమె దండాలు పెట్టే స్టైల్ ను కూడా చూపించారు. ఇక బిందు కూడా అలానే చేయడంతో నువ్వే అని తెలిసిపోయిందా అని అన్నారు. ఆమె కూడా తనంతట తానే బోనులో వచ్చి నిలబడింది.

    శివ అనేది బ్రాండ్

    శివ అనేది బ్రాండ్

    ఇక శివ బ్రాండ్ అంటూ యాంకర్ శివపై ప్రశంసలు కురిపించారు నాగార్జున. శివ బ్రాండ్ అనేది నీ మూలాన కాదు. 1989లో రిలీజైన శివ సినిమా బ్రాండ్ అని నాగార్జున తన సినిమాపైనే తనే హైప్ క్రియేట్ చేసుకున్నారు. ఇక ముమైత్ ఖాన్ ని పిలిచి.. జరిగే గోడవలన్నీ కూడా బాష గురించి యాస్ గురించి అని.. కానీ మనకు బాష రాదని ముమైత్ ఖాన్ పై సెటైర్ వేశారు.

     అరియానా ఎవరి సైడ్?

    అరియానా ఎవరి సైడ్?

    ఇక అఖిల్ విషయంలో నాగార్జున కాస్త సీరియస్ గానే స్పందించాడు. అరియానా బోనులోకి వచ్చి మాట్లాడిన తరువాతనే నువ్వు కేసు గెలిచావు అని.. మరి అరియానా ఎవరి సైడ్ ఉందని ప్రశ్నించాడు. ఇక అరియానా కూడా ఆ రోజు ఒక విషయాన్ని చెప్పలేకపోయానని తెలిపింది. వీరి సంభాషణ షోలో హైలెట్ అయ్యేలా ఉందని తెలుస్తోంది.

    బూతు గురించి నాగ్ కౌంటర్

    ఇక అజయ్ విషయంలో నాగార్జున ఎవరు ఊహించని డైలాగ్ కొట్టాడు.. వ్వాట్ ద F* గేమ్.. అంటూ ఎలాంటి ఆట ఆడుతున్నావు అనే డైలాగ్ ను గుర్తు చేశారు. నాగార్జున అలా అనడం అజయ్ కు షాక్ తగిలనట్లయ్యింది. ఇక గేమ్ ఆడకుండా ఎందుకు ఎదుస్తున్నావు? హౌస్ లో నుంచి వెళ్లిపోవాలని ఉందా అని నాగార్జున మిత్ర శర్మను ప్రశ్నించాడు. మరి నాగ్ ప్రశ్నలకు వారు ఎలాంటి సమాధానం ఇస్తారో తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

    English summary
    Bigg Boss Non stop telugu latest promo nagarjuna shocking counters
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X