Bigg Boss Non Stop: అతనితో బిందు మాధవి కౌగిలింతలు.. స్పెషల్ గెస్ట్ గా వచ్చిన అన్నయ్య!
హొలీ సందర్భంగా బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో సరికొత్త వాతావరణం నెలకొంది. కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్స్ గొడవల గురించి మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇక పులిహోర కలిపేవాళ్ళు గట్టిగానే కలిపారు. అంతే కాకుండా ఒక ప్రత్యేకమైన గెస్ట్ రావడం కూడా జరిగింది కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక అందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే..

హొలీ సెలబ్రేషన్స్
హొలీ అని చెప్పగానే అందరూ కూడా బిగ్ బాస్ ఇచ్చిన కలర్స్ తో చాలా సరదాగా కనిపించారు. అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా అందరూ చాలా సంతోషంగా రంగులు పూసుకున్నారు. ఇక అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి హొలీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటూ తేజస్వి మాధివాడ సూక్తులు చెప్పింది.

బిందు మాధవితో అజయ్..
ఇక అజయ్ మరోసారి బిందు మాధవిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. ఎంతమంది పులిహోర రాజలు పులిహోర కలపాలని ట్రై చేసినా కూడా వాడి లోపల ఉన్న ఇంటెన్షన్ ను చూసి వాడిని నువాబు అంతే దూరం పెడతావు అని చెప్పాడు. ఇక ఇప్పుడు కూడా కలర్ పుద్దామని అనుకుంటే. కలర్ ఇంకా ఏ కలర్ అవసరం లేదని అనిపిస్తోందని అజయ్ డైలాగ్ కొట్టేశాడు.

కౌగిలింతలు
ఇక అజయ్ బిందుతో అలా మాట్లాడగానే బిందు కాదురా నేను పడిపోయాను. ఇక ఆపేయ్యండి అంటూ తేజస్వి నవ్వేసింది. అనంతరం బిందు అజయ్ కౌగిలించుకున్నారు.
ఇక అనిల్ రాథోడ్ అషు రెడ్డితో కలిసి డ్యాన్స్ చేశాడు. మిగతా కంటెస్టెంట్స్ బొమ్మను గిస్తే నీలా ఉంది అని పాటను పాడారు. ఇక ఆ పాటకు తగ్గట్టుగా అషు అనిల్ రెడ్డి రొమాంటిక్ గా స్టెప్పులు వేశారు.

సడన్ ఎంట్రీ ఇచ్చిన అన్నయ్య
ఇక సడన్ గా ఓంకార్ అన్నయ్య కూడా పంజా సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ అందరితో తనకు నచ్చినట్లు ప్రత్యేకంగా స్కిట్స్ కూడా వేయించి మధ్యలో పంచ్ లు వేసే ప్రయత్నం చేశాడు. మిమ్మల్ని మీట్ అవ్వాలని చాలా ఎగ్జైట్ అయ్యి వచ్చాను అని ఓంకార్ చెప్పాడు.

హామీదాతో అఖిల్ రొమాంటిక్ టాక్
ఇక హామీదా అఖిల్ రొమాంటిక్ ట్రాక్ కూడా హైలెట్ గా నిలిచింది. ఇక్కడ ఉన్న లైట్స్ కుడా అవసరం లేదు నీ వెలుగు చాలు అని డైలాగ్ వదిలాడు. అంతే కాకుండా అందరూ మూన్ వైవు చూస్తుంటే నేను హామీదా వైపే చూస్తున్నాను అన్నాడు. ఇక అందుకు ఓంకార్ కూడా ఫిదా అవ్వగా హామీదా అఖిల్ కు చేయి ఇచ్చేసింది. ఇక చేయి ఇచ్చేసింది అంటూ అఖిల్ చెప్పగా.. అందుకు ఓంకార్ నువ్వు అడిగితే ఏదైనా ఇచ్చేసారు.. చెయ్యెగా ఇప్పుడు ఇచ్చేసింది కౌంటర్ ఇచ్చాడు.

ఎలిమినేట్ అయ్యేది ఎవరు?
ఇక ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న వారిలో ఎవరు హౌస్ లో నుంచి వెళ్లిపోతారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ వారం మొత్తం 12 మంది నామినేట్ అవ్వగా ఓట్ల ప్రకారం అయితే చివరలో మహేష్, స్రవంతి డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా దాదాపు సేఫ్ అయినట్లే అనే టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











