Bigg Boss Non Stop: అన్నా అని బాంబ్ పేల్చేశాసిన బ్యూటీ.. మాట్లాడేందుకు జంకుతున్న అబ్బాయిలు

టీవీలో మొదట ఐదు సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఈసారి నాన్ స్టాప్ గా అలరించేందుకు ఓటీటీ లోకి ప్రవేశించింది. తప్పకుండా ఈసారి అంతకుమించి అనేలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని నాగార్జున తనదైన శైలిలో షోను ప్రారంభించారు. ఇక బిగ్ బాస్ షో లోకి ఈసారి మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ ప్రవేశించారు. ఎవరికి వారు సొంత స్టైల్ ను ఫాలో అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఒక గ్లామర్ బ్యూటీ మాత్రం హౌస్ లోకి వచ్చి రాగానే అందరినీ అన్నా అనేస్తూ షాకిచ్చింది. దీంతో మిగతా కంటెస్టెంట్ ఆ బ్యూటీతో మాట్లాడేందుకు కాస్త భయపడుతున్నారు అనే చెప్పాలి. ఇక ఈ బ్యూటీ ఎవరిని అన్నా అనేసింది? వారు ఎలా రియాక్ట్ అయ్యారు అనే వివరాల్లోకి వెళితే..

భారీగా రెమ్యునరేషన్స్

భారీగా రెమ్యునరేషన్స్

బిగ్ బాస్ ఆరో సీజన్ ఎప్పుడు మొదలవుతుంది అని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిర్వాహకులు ఓటీటీ షో ద్వారా సరికొత్త సర్ ప్రైజ్ ఇచ్చారు అనే చెప్పాలి. హాట్ స్టార్ మొదటిసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ ను ఓటీటీలో టెలికాస్ట్ చేస్తోంది. అందుకోసం ఈ సంస్థ భారీ స్థాయిలో ఖర్చు పెట్టబోతున్నట్లు సమాచారం. కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఏ మాత్రం తక్కువ కాకుండా గట్టిగానే పారితోషికం కూడా ఇస్తున్నారట.

11వ కంటెస్టెంట్ గా..

11వ కంటెస్టెంట్ గా..

అనుభవమున్న కంటెస్టెంట్స్ ఈసారి షోలో మరింత హైలెట్ అయ్యే విధంగా ప్రణాళికలు రచించబోతున్నారు. కొత్తవారు సీనియర్స్ కు ఎలా పోటీని ఇస్తారు అనేది కూడా ఎంతో ఆసక్తికరంగా మారింది. అయితే పదకొండవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన మిత్రశర్మ కూడా తనదైన శైలిలో షో లో హైలెట్ అయ్యే విధంగా అడుగులు వేస్తోంది. ఈ బ్యూటీ ఇదివరకే రెండు తెలుగు సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది.

జనాలకు మరింత దగ్గరయ్యేలా..

జనాలకు మరింత దగ్గరయ్యేలా..

తానేంటో ఈ షో ద్వారా అందరికీ పూర్తిగా తెలుస్తుంది అని మిత్రశర్మ వచ్చీరాగానే ఛాలెంజ్ కూడా చేసింది. ఇక తను నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేయబోతున్నట్లు తెలియజేసింది. ముంబైలో తన తండ్రితో కలిసి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినటుగా వివరణ ఇచ్చింది. అయితే తండ్రి చనిపోగానే మళ్లీ హైదరాబాద్ కు వచ్చినట్లు చెబుతూ బిగ్ బాస్ ద్వారా జనాలకు మరింత దగ్గరయ్యేందుకే వచ్చినట్లుగా తెలిపింది.

అన్న అంటూ..

అన్న అంటూ..

అయితే మిత్రశర్మ వచ్చీరాగానే కొందరిని అన్న అంటూ బాంబు పెంచేసింది. వచ్చిరాగానే ఆర్జే చైతుని చూసిన ఈ బ్యూటీ అన్నా అంటూ పలకరించేసింది. పలంకరించిన విధానం బాగానే ఉంది కానీ అన్న అనడం ఏమాత్రం కరెక్ట్ కాదు అనేలా చైతూ మొహం మార్చేశాడు. ఆమె ఇచ్చిన డోస్ కు చైతు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడేందుకు కాస్త వెనకడుగు వేయాల్సి వచ్చింది.

 బాంబ్ పేల్చేశావు..

బాంబ్ పేల్చేశావు..

అయితే మిత్రశర్మ యాంకర్ శివను కూడా అన్నా అని పలకరించింది. దీంతో బాంబ్ పేల్చేశావు కదా అంటూ శివ చాలా ఫీల్ అయ్యాడు అనిపించింది. ఇక మిత్రశర్మ మాత్రం తన మనసులో అనుకున్న విషయాన్ని కూడా చాలా ఓపెన్ గా బయటపెట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అన్నా అని ఎందుకు అంటున్నావు అని అడిగితే అది అంతే అని చాలా సూటిగా సమాధానం చెబుతోంది. మరి ఈ బ్యూటీ రానున్న రోజుల్లో ఇంకా ఎంత మందికి షాక్ ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X