bigg boss non stop: తెలుగు సరిగ్గా రాదు కాబట్టి లక్కీ.. లేకుంటే గు**.. అంటూ ముమైత్ వీరంగం
బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగులో మెల్లమెల్లగా గొడవలు తీవ్ర స్థాయిలో హీటెక్కిస్తున్నాయి. మొన్నటివరకు చాలా స్నేహంగా ఉన్నవారు అభిప్రాయ బేధాలు రావడంతో కొట్లాటకు దిగుతున్నారు. ఏ మాత్రం కంట్రోల్ అవ్వకుండా మాటలతో కూడా షాక్ ఇస్తున్నారు. ఇక రీసెంట్ గా ఆర్జే చైతూ ముమైత్ ఖాన్ మధ్యలో కూడా గోడవల తీవ్రత మరింత ఎక్కువైంది. గతంలో ఎప్పుడు లేని విదంగా ముమైత్ కూడా మాటలతో వీరంగం సృష్టించింది. అంతే కాకుండా ఆమె చాలా ఎమోషనల్ అయ్యింది. అసలు చైతూ ఏమన్నాడు ముమైత్ ఏం ఫీల్ అయ్యింది అనే వివరాల్లోకి వెళితే..

ముమైత్ ఖాన్ vs చైతూ
బిగ్ బాస్ నాన్ స్టాప్ మళ్ళీ సరికొత్తగా మొదలైనట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ కూడా ఎప్పటికప్పుడు టాస్క్ లో విషయంలో చాలా కొత్తగా ఆలోచిస్తున్నాడు. ఇక అభిప్రాయాలను వ్యక్తం చేసే క్రమంలో కంటెస్టెంట్స్ ఎవరు కూడా కంట్రోల్ లో ఉండటం లేదు ఒక అభిప్రాయం చెబితే వెంటనే దాన్ని సీరియస్ గా తీసుకుంటూ గొడవలకు దారితీస్తున్నారు. రీసెంట్గా ముమైత్ ఖాన్ చైతు మధ్యలో కూడా ఒక అభిప్రాయం బేధం మాటల తూటాలు పేల్చేలా చేసింది.

ముమైత్ పై చైతూ కామెంట్స్
మార్నింగ్ యాక్టివిటీస్ లో భాగంగా ఇంటి సభ్యులు వారు లేచిన వెంటనే ముందుగా ఎవరి ముఖం చూడాలి అని అనుకుంటారు? ఎవరి మొహం చూడవద్దు అని అనుకుంటారో తగిన కారణాలతో చెప్పాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ నుంచి ఆదేశాలను అందుతాయి. ఇక దాన్ని అందరికీ వివరించిన చైతూ మొదట ముమైత్ ఖాన్ ను ఫోకస్ చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

ముమైత్ మొహం చూడబుద్ది కాదు
పొద్దున లేవగానే బిగ్ బాస్ తో గొడవలు మొదలు పెట్టి అయ్యో పాపం అని ఫీలింగ్ కలిగించేలా చేస్తున్న ముమైత్ ఖాన్ మొహం అసలు చూడ బుద్ధి కాదు అని చైతు చాలా ఓపెన్ గా వివరణ ఇచ్చాడు. ఇక తన అభిప్రాయాన్ని ముమైత్ ఖాన్ చాలా మొండిగా వ్యతిరేకించింది. నువ్వు నన్ను ఇంకా ఏదో తప్పు గా డిసైడ్ చేస్తున్నావు అని వ్యతిరేకిస్తుంది. కానీ చైతూ మాత్రం ఇదే నా పర్ఫెక్ట్ రీజన్ అని నా అభిప్రాయం అని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

సిగరెట్ల కోసం ఏడుస్తుంది అని..
ఇక ముమైత్ ఖాన్ నిన్ను నేను మొదటి నుంచి కూడా ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి చాలా తప్పు చేశాను అని ముమైత్ చెప్పగానే నేను చెప్పేది విను అని చైతూ అన్నాడు. అయినప్పటికీ కూడా ముమైత్ కొద్దిగా వాదించడంతో చైతూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రీసన్ ఏమిటో వినకుండా పొద్దుపొద్దున్నే సిగరెట్ల కోసం ఏడుస్తుంది అని చైతు అదేపనిగా ముమైత్ కామెంట్స్ చేస్తూ వచ్చాడు.

తెలుగు రాదు కాబట్టి లక్కీ..
మరొకవైపు గార్డెన్ లో ముమైత్ ఖాన్ చైతూ మాట్లాడిన విధానానికి చాలా ఫీల్ అవుతూ కంటతడి పెట్టుకుంది. ఆమె అజయ్ ను గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసింది. నాకు తెలుగు సరిగ్గా రాదు కాబట్టి చాలా లక్కీ.. లేదంటే ప్రాపర్ గా గుద్దుతా అంటూ చాలా నాటుగా మరొకరికి సమాధానమిచ్చింది. ఆమెను ఓదార్చేందుకు మిగతా కంటెస్టెంట్ కూడా చాలా ప్రయత్నాలు చేశారు.

తొక్క మంచి అబ్బాయి..
పొద్దుపొద్దున్నే ఆమెతో వెళ్లి మాట్లాడదాం అనుకుంటే ఏడ్చుకుంటూ ఉంటుంది. అది నాకు నచ్చదు అని క్లియర్ గా చెప్పాను అని చైతూ చెప్పగా.. నన్ను చాలా తప్పుగా హైలెట్ చేయాలని చూస్తున్నారు అంటూ ముమైత్ ఖాన్ మరింతగా కంటతడి పెట్టుకుంది. అయితే నిన్ను తప్పుగా చూపించినంత మాత్రనా నువ్వు తప్పు అయిపోవని అషు కూడా ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇక ముమైత్ ఖాన్ ఏ మాత్రం తగ్గకుండా అతను మంచి అబ్బాయిని కాదు అంటూ ఒక తొక్క మంచి అబ్బాయి అని ఉంటుంది. కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారు అని కూడా అంటుంది. ఇక చైతు మాత్రం ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు అనే విధంగా మిగతా వారితో చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











