Bigg Boss Non Stop: ఆరియానా సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ వ్యవహారం లీక్.. నోరు జారి బుక్కైన బ్యూటీ

ఆరియానా గ్లోరీ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. చాలా తక్కువ సమయంలోనే పాపులారిటీని సంపాదించుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో తనదైన శైలి వ్యవహారంతో పాటు అద్భుతమైన ఆటతో మంచి పేరు తెచ్చుకుంది.

ఈ షోలో గెలవకున్నా మంచి మంచి ఆఫర్లను అందుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంటర్ అయింది. వచ్చీ రావడమే ఆరియానా గ్లోరీ సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ గురించి అక్కినేని నాగార్జున కామెంట్స్ చేశారు. దీంతో నోరు జారిన ఈ బ్యూటీ అడ్డంగా బుక్కైంది. ఆ వివరాలు మీకోసం!

రాంగోపాల్ వర్మ వల్ల ఫుల్ ఫేమస్

రాంగోపాల్ వర్మ వల్ల ఫుల్ ఫేమస్

ఆరియానా గ్లోరీ యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో ఆయనతో ఆమె బోల్డుగా చర్చలు జరపడంతో హైలైట్ అయింది. ఆ తర్వాత ఆర్జీవీ.. ఆరియానాను ప్రశంసిస్తూ వీడియోలను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అప్పటి నుంచి ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయిపోయింది.

బిగ్ బాస్ ఛాన్స్.. ఫినాలేకి వెళ్లినా

బిగ్ బాస్ ఛాన్స్.. ఫినాలేకి వెళ్లినా

సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ కారణంగా బిగ్ బాస్ ఆఫర్ అందుకుంది ఆరియానా గ్లోరీ. ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఆమె.. బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ముక్కుసూటిగా ఉంటూ నిజాయితీ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు, ఏకంగా ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంతో సరిపెట్టుకుందీ భామ.

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారి

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారి

బిగ్ బాస్ షో పుణ్యమా అని ఆరియానా ఎంతో ఫేమస్ అయింది. అంతేకాదు, వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఇప్పటికే పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు ఇలా ఎన్నో చేస్తోన్న ఈ బ్యూటీ.. పలు సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ మధ్యనే కొన్ని సినిమాలు చేసింది. అలాగే, బిగ్ బాస్ బజ్ టాక్ షోకు హోస్టుగానూ వ్యవహరించింది. ఇలా అమ్మడు బిజీగా మారిపోయింది.

బిగ్ బాస్ నాన్ స్టాప్‌లోకి ఎంటర్

బిగ్ బాస్ నాన్ స్టాప్‌లోకి ఎంటర్

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' శనివారం సాయంత్రమే ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ఇది మొత్తం 84 రోజుల పాటు సాగబోతుంది. ఇక, ఇందులో 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ ఒకరు. ఏడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అదిరిపోయే లుక్‌తో మరోసారి అందరి దృష్టినీ లాగేసింది.

బిగ్ బాస్ తనను వదలట్లేదంటూ

బిగ్ బాస్ తనను వదలట్లేదంటూ

బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన ఆరియానా గ్లోరీ.. హోస్ట్ నాగార్జునతో తన భావాలను పంచుకుంది. 'బిగ్ బాస్ నన్ను వదలట్లేదు సార్. నాలుగో సీజన్ తర్వాత బిగ్ బాస్ బజ్‌కు ఫస్ట్ లేడీ హోస్టును చేశారు. ఇప్పుడు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. ఈ షో నాకు ఎంతో ఉపయోగపడింది. ఎన్నో ఆఫర్లను అందుకుంటున్నాను. ఐ లవ్ యూ బిగ్ బాస్' అంటూ తెగ సంబర పడిపోయింది.

సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ వ్యవహారం

సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ వ్యవహారం

ఇక, ఆరియానా గ్లోరీతో హోస్ట్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ముందుగా ముక్కు అవినాష్ గురించి ప్రశ్నించాడు. అయితే, పెళ్లి తర్వాత అతడు తనకు కలవడం లేదని, ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాడని ఆమె సరదాగా చెప్పింది. ఆ తర్వాత నాగార్జున 'ఏంటమ్మా ఆరియానా.. నీకు సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడంట కదా. ఇంతకీ ఎవరా వ్యక్తి' అని సూటిగా ప్రశ్నించాడు.

నోరు జారి బుక్కైన ఆరియానా

నోరు జారి బుక్కైన ఆరియానా

హోస్ట్ అక్కినేని నాగార్జున సూటిగా ప్రశ్నించడంతో ఆరియానా గ్లోరి తెగ సిగ్గు పడిపోయింది. 'అయ్యో సార్.. సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ గురించి మీకెలా తెలిసింది. ఉన్నారులేండి కొందరు. అయినా దాని గురించి నేను మాట్లాడను సార్. అది చాలా సీక్రెట్' అంటూ నోరు జారి బుక్కైంది. దీని తర్వాత అసలు ఆరియానా బాయ్‌ఫ్రెండ్ ఎవరని అందరూ తెగ చర్చించేసుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X