Bigg Boss Non Stop: మళ్ళీ అతను ఎలిమినేట్ అవ్వడం పక్కా.. బిందుమాధవి దెబ్బకు క్లోజ్ అయినట్లే..
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలైనప్పటి నుంచి కూడా కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరూ వారికి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకోవాలని ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. మాజీ కంటెస్టెంట్స్ వారియర్స్ గా వారి గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఈసారి ఎలాంటి పొరపాట్లు లేకుండా టైటిల్ విన్నర్ గా నిలవాలని చూస్తున్నారు. ఇక కొత్తగా వచ్చిన ఛాలెంజర్స్ అయితే వీలైనంతవరకు సేఫ్ జోన్ లో ఉండాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒక మాజీ కంటెస్టెంట్ మాత్రం అనవసరంగా నోరు పారేసుకుంటూ నెగిటివ్ కామెంట్స్ అందుకుంటున్నాడు. ఇక ఈసారి ఒక వ్యక్తి వెళ్ళి పోవడం పక్కా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇటీవల బిందుమాధవి దెబ్బకు కూడా అతను చాలా మైనస్ అయిపోయాడు. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

ట్రాక్ లో పడిన బిగ్ బాస్
బిగ్ బాస్ ఓటీటీలో మొదలైనప్పుడు మొదట్లో కొంత నిరసన కొనసాగింది అనే కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత వెంటనే లైవ్ స్ట్రీమింగ్ కూడా ఆగిపోవడంతో ఓ వర్గం ప్రేక్షకులు నుంచి నెగిటివ్ కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి ఎప్పటిలానే కంటిన్యూ చేసి ఉంటె అయిపోతుంది అని 24 గంటలు ఎవరు చూస్తారు అని కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ నిర్వాహకులు మాత్రం కొంచెం కూడా వెనక్కి తగ్గకుండా మంచి ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి రెండవ వారంకి వచ్చేసరికి ట్రాక్ లోకి వచ్చింది అనే చెప్పాలి.

సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం
ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ కూడా టాస్క్ విషయంలో అసలైన డోస్ పెంచుతున్నాడు. కంటెస్టెంట్స్ అందరూ కూడా మొదట చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఆ తర్వాత అసలైన టాస్క్ లు మొదలయ్యే సరికి విలన్లుగా మారుతున్నారు. ఒక విధంగా అయితే కొందరు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. అఖిల్ సార్ధక్ కొందరిపై ఇదివరకే ఆ విధంగా కామెంట్స్ కూడా చేశాడు.

హౌస్ కి బారంగానే..
ఇక ఎవరు ఎలా ఉన్నా కూడా ఒక వ్యక్తి మాత్రం ఇంకా హౌస్ కి భాగంగానే కొనసాగుతున్నాడు అనే కామెంట్స్ చాలానే వస్తున్నాయి. ఆ వ్యక్తి మరెవరో కాదు. నటరాజ్ మాస్టర్. బిగ్ బాస్ ఐదో సీజన్లో కంటెస్టెంట్ గా వచ్చిన నట్రాజ్ మాస్టర్ మొదట్లో కాస్త ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి అని చాలా ప్రయత్నాలు చేసాడు. ప్రతిదానికి ఏడవడం మొదలు పెట్టే తన రేంజ్ ను కూడా కాస్త తగ్గించుకున్నాడు అని చెప్పాలి. ఇక అనవసరమైన వాదనలతో అప్పుడు ఎలిమినేట్ అయ్యాడు.

వరుసగా పొరపాట్లు..
అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలో కూడా నటరాజ్ మాస్టారు అదే తరహా ఫార్మాట్లో ముందుకు సాగుతుండడం విశేషం. మొదట అతను ఫ్యామిలీ అనే పాయింట్ తో ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉండడం.. ఆ తర్వాత ఆటల్లో మాత్రం అనవసరమైన మాటలతో గొడవలు పడటం అలవాటుగా మారిపోయింది. ఇటీవల బిగ్ బాస్ చెప్పినదాన్ని తప్పుగా చదవడమే కాకుండా మళ్లీ దాన్ని వాదించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ఈసారి కూడా తొందరగానే..
రీసెంట్ గా బిందుమాధవి అయితే నటరాజ్ మాస్టర్ పరువు పోయే విధంగా ఇచ్చి పడేసింది అని చెప్పాలి. ముందు ఒకటి.. వెనకాల ఒకటే మాట్లాడకుండా ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పేయండి అని నటరాజ్ మాస్టర్ ను కడిగిపారేసింది. నటరాజ్ మాస్టర్ మొదటివారంలో బజార్ మోగే సమయంలో కూడా అనవసరమైన వాదోపవాదాలు చేసి నెగిటివ్ కామెంట్స్ అందుకున్నారు. బిందుమాధవితో జరిగిన గొడవతో ఆయన షోలో అనవసరంగా కొనసాగుతున్నారు అని కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులను బట్టి చూస్తే నటరాజ్ మాస్టర్ కు జనాల నుంచి ఓట్లు పెద్దగా వచ్చేలా అవకాశం లేదని తెలుస్తోంది. ఇక అతను తొందర్లోనే వెళ్ళిపోతాడు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











