Bigg Boss Non Stop: బిందుమాధవి అందం.. నోరు జారిన నటరాజ్.. వెనకాల ఒకటి ముందు ఒకటి అంటూ

బగ్ బాస్ నాన్ స్టాప్ రోజుకో టాస్క్ తో విభిన్నంగా మారుతోంది. మొదట కాస్త నీరసంగా కొనసాగిన ఈ షో ఇప్పుడిప్పుడే అసలైన గోడవలతో కంటెస్టెంట్స్ అసలైన గేమ్ స్టార్ట్ చేసినట్లు అనిపిస్తోంది. ఇక నటరాజ్ మాస్టర్ మరోసారి బిందుమాధవితో గోడవకు దిగాడు. ఒక పాయింట్ చెప్పడంలో తేడా రావడంతో వారియర్స్, ఛాలెంజర్ల నడుమ ఈ వారం గొడవ తీవ్రత ఎక్కువయ్యేలా ఉందని అనిపిస్తోంది. ఇక నేడు ప్రసారం కాబోయే 9గంటలకు సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రెండు గ్రూపుల మధ్య ఎలాంటి వాతావరణం నెలకొంది అనే వివరాల్లోకి వెళితే..

బాస్కెట్ బొనాంజా

బాస్కెట్ బొనాంజా

బిగ్ బాస్ వారియర్స్ కు వారి వసతులను గెలుచుకునెందుకు చివరగా బాస్కెట్ బొనాంజా అనే టాస్క్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ టాస్క్ లో వారియర్స్ గట్టిగానే పోరాడారు. అఖిల్ ఫెయిల్ అవ్వగా నటరాజ్ మాస్టర్ కరెక్ట్ గా గేమ్ ఆడి టీమ్ ను గెలిపించడం జరిగింది.

లాగేజ్ యాక్సెస్

లాగేజ్ యాక్సెస్

బెడ్ రూమ్ లేదా లగేజ్ యాక్సెస్.. ఈ రెండింటిలో దేనిని మీరు తిరిగి పొందాలని అనుకుంటున్నారో బిగ్ బాస్ కు తెలియజేయాల్సి ఉంటుంది అని నటరాజ్ మాస్టర్ చాలా సంతోషంగా చెప్పాడు. దీంతో అఖిల్ సరయి ఇలా వారియర్స్ లో ఎక్కువ మంది లాగేజ్ యాక్సెస్ కావాలని చెప్పారు.

మరో పాయింట్ తో వచ్చిన ఛాలెంజర్లు

మరో పాయింట్ తో వచ్చిన ఛాలెంజర్లు

ఇక ఆ తరువాత వారియర్స్ లో కొందరు వంట చేస్తూ బిజీగా ఉండగా ఛాలెంజర్స్ నుంచి ఒక ప్రాబ్లం అంటూ ఆర్జే చైతూ తన గ్యాంగ్ ను వెంట పెట్టుకొని వచ్చాడు. బెడ్ రూమ్ లేదా లగేజ్ యాక్సెస్ లలో ఛాలెంజర్స్ సభ్యులు ఈ రెండింటిలో మీరు వారియర్స్ కు ఏ వసతిని తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నారో నిర్ణయించుకొని బిగ్ బాస్ కు తెలియజేయాలని అని కొత్త రూల్ తో చైతూ వివరణ ఇచ్చారు.

బిందు మాధవి vs నటరాజ్

బిందు మాధవి vs నటరాజ్

ఇక లగేజ్ తీసుకోవాలని మీకు ఉందా అంటూ తేజస్వి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అనంతరం రెండు గ్రూపుల మధ్య మాట మాట పెరిగింది. ఇక ఆప్షన్ మా హ్యాండ్ లో ఉంది కాని మీరే తీసుకున్నారు అని చెప్పడానికి వచ్చాము అని మరోవైపు బిందు మాధవి, నటరాజ్ మాస్టర్ కు చెప్పుకొచ్చింది.

నోరు జారిన నటరాజ్ మాస్టర్

ఇక బిందు మాధవి మాటలకు నటరాజ్ మాస్టర్ ఆమె అందంను ప్రస్తావిస్తూ తన ఆలోచనలపై కూడా కామెంట్స్ చేయడం జరిగింది. మనకు అందం ఎంత ఇచ్చాడో మనం థింకింగ్ కు మనసుకు కూడా అంతే అందం ఉండాలి అని నోరు జరాడు. ఇక బిందు మాధవి పాసింగ్ కామెంట్స్ చీప్ గా ఉన్నాయని అడగడంతో పాయింట్ అడగడంతో మీకు ఏమి వచ్చింది అని నటరాజ్ మాస్టర్ మరింత గట్టిగా అడుగగా బిందు కూడా ఏదైనా ఉంటే ఫేస్ టూ ఫేస్ ఉండాలి అని మరింత గట్టిగా ఇచ్చేసింది.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
అరిచేసిన బిందుమాధవి

అరిచేసిన బిందుమాధవి

ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పాలని అప్పుడు నేను వింటాను అని బిందు మాధవి గట్టిగా చెప్పగా.. అంత గట్టిగా చెప్పడం వల్ల ఏమి రాదు అని నటరాజ్ మాస్టర్ మరో సెటైర్ వేశాడు. అంతే కాకుండా అందమైన మనసు ఉండాలని మాత్రమే తాను చెప్పానని అన్నాడు. ఇక డైరెక్ట్ గా మాట్లాడాలని వెనకాల మాట్లాడవద్దు అంటూ దూరం నుంచి బిందు మాధవి అరిచేసింది. ఇక వీరి గొడవ ఎంతవరకు వెళుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X