Bigg boss Non Stop: అమ్మాయిలను అసభ్యంగా తాకేలా న్యూ టాస్క్.. తోలు తీస్తా అంటూ..
బిగ్ బాస్ లో ఎలాంటి టాస్క్ ఇచ్చినా కూడా పోటీ పడేందుకు ప్రతీ ఒక్క కంటెస్టెంట్ కూడా సిద్ధంగా ఉంటాడు. అయితే కొన్నిసార్లు పోటీ పడేందుకు అబ్బాయిలు చాలా భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే ఫిజికల్ గా టచ్ చేసే టాస్క్ వచ్చినప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అమ్మాయిల సంగతి పక్కన పెడితే ఏ మాత్రం తప్పుగా టచ్ చేసినా కూడా అబ్బాయిలపై నెగటివ్ కామెంట్స్ ఒక రేంజ్ లో వస్తూ ఉంటాయి. ఇక బిగ్ బాస్ ఓటీటీ కంటెంట్ లో సెన్సార్ ఇబ్బంది లేదు కాబట్టి లైవ్ లో జనాలకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది. ఇక ఇటీవల బిగ్ బాస్ ఇచ్చిన ఒక టాస్క్ అమ్మాయిలను అసభ్యంగా తాకే విధంగా ఉన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. టాస్క్ లో నటరాజ్ మాస్టర్ అయితే తీవ్ర స్థాయిలో కోపానికి గురి కావడం విశేషం. పూర్తి వివరాల్లోకి వెళితే..

డోస్ పెంచుతున్న బిగ్ బాస్
హిందీలో పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న బిగ్ బాస్ ఓటీటీ ఇప్పుడు తెలుగులో కూడా అదే తరహాలో గుర్తింపు అందుకునే విధంగా అడుగులు వేస్తోంది. అయితే మొదటి రెండు రోజుల్లో కాస్త నీరసంగా కొనసాగిన బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మూడవ రోజు నుంచి మాత్రం అసలైన గొడవలతో ఆసక్తికరంగా మారింది. కంటెస్టెంట్స్ అందరూ కూడా టాస్క్ ల విషయంలో అయితే ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో జనాలు మెల్లగా ఎట్రాక్ట్ అవుతున్నారు.

స్టిక్కర్ ఎటాక్
రీసెంట్ గా కెప్టెన్సీ పోటీలో భాగంగా ఇచ్చిన స్టిక్కర్ ఎటాక్ టాస్క్ లో ఒకరిపై ఒకరు టచ్ చేసుకునే విధంగా స్టిక్కర్స్ అంటిస్తూ ఉండాలి. ఎవరైతే మరొకరిపై ఎక్కువ స్టిక్కర్స్ అతికిస్తారో వారే షోలో విజేతగా నిలిచినట్లు లెక్క. ఇక ఎవరికి వారు ఈ పోటీలో చాలా గట్టిగా పోరాడారు అనే చెప్పాలి. ఎప్పటిలానే మధ్యమధ్యలో గొడవలు కూడా జరిగాయి.

తప్పుగా తాకే అవకాశం
ఒకవిధంగా స్టిక్కర్స్ అతికించి క్రమంలో అబ్బాయిలు అమ్మాయిలను పొరపాటున తప్పుగా తాకే అవకాశం కూడా ఉంటుంది. ఇక అమ్మాయిలకు మాత్రం చాలా బాధ ఉండదు. అబ్బాయిలకు వీలైనంతవరకు ఫ్రీగా అతికించే అవకాశం ఉంటుంది. ఈ టాస్క్ లో మాత్రం చాలా వరకు అబ్బాయిలు అమ్మాయిల్ని తప్పుగా తాకకుండా స్టిక్కర్లు అతికించి ప్రయత్నం చేశారు.

చాలా అవసరం..
ఈ టాస్క్ లో మిత్రా శర్మ దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. ఇక నటరాజ్ మాస్టర్ ఎప్పటిలానే కాస్త ఓవర్ గా బలాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. కొత్తబ్బాయి అనిల్ మాత్రం కాస్త తెలివిగా నటరాజ్ మాస్టర్ కు స్టిక్కర్స్ అతికించే ప్రయత్నం చేశాడు. నామినేషన్ లో నుంచి బయట పడాలి అంటే ఈ టాస్క్ చాలా ముఖ్యం. కెప్టెన్ అయితే ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయినట్లే. అందుకే పోటీ దారులు గట్టిగా పోరాడుతున్నారు.

కింద పడిపోయిన మిత్రశర్మ
ఇక సంచాలకురాలి మాట వినాలి అంటూ ముమైత్ ఖాన్ ఛాలెంజర్ టీమ్ మెంబర్స్ గొడవ పడ్డారు. షటాప్ అంటూ గట్టిగా అరిచేసింది. ఇక ఇతర టీమ్ సభ్యులు కూడా గొడవలోకి వచ్చారు. బిందు మాధవిపై స్టిక్కర్స్ తో మిగతా టీమ్ మెంబర్స్ గట్టిగానే ఎటాక్ చేశారు. ఈ క్రమంలో మిత్రశర్మ కూడా కింద పడిపోయింది.

బంధు మాధవి vs అఖిల్
అయితే అఖిల్ కూడా నేను ఫిజికల్ గా రెచ్చిపోతే మాములుగా ఉండదని బిందు మాధవికి కౌంటర్ ఇచ్చాడు. ఆమె కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఆమె వేలు చూపడంతో ఎవరికి చూపిస్తున్నావు అంటూ అని కోపాన్ని చూపించిన అఖిల్ కు బిందు మాధవి నీకే చూపిస్తున్నాను అంటూ మరో కౌంటర్ ఇచ్చింది.
Recommended Video
తోలు తీస్తాను..
ఇక అఖిల్ అజయ్ నటరాజ్ మాస్టర్ మధ్యలో కూడా పోటాపోటీగా టాస్క్ కొనసాగింది. అయితే నటరాజ్ మాస్టర్ హడావిడి చేయడంతో ఛాలెంజర్లు కాస్త అప్సెట్ అయ్యారు. ఈ క్రమంలో టాస్క్ లో లేని యాంకర్ శివ జోక్యం చేసుకోగా తోలు తీస్తాను అంటూ నటరాజ్ మాస్టర్ రెచ్చిపోయారు. మరి ఈ గొడవలు ముందుముందు ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











