twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Non Stop: బిందు మాధవిని దెబ్బ కొట్టేందుకు ప్లాన్.. హౌస్ లో మరో ప్రమాదం

    |

    బిగ్ బాస్ నాన్ స్టాప్ రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఇక కంటెస్టెంట్స్ వారి సర్వ శక్తులను బయటకు తీసే పరిస్థితులు కూడా దగ్గర పడుతున్నాయి. బిగ్ బాస్ లో ఎవరైనా ఒక కంటెస్టెంట్ బలంగా ఉంటే అతనిని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం సర్వసాధారణం. ఇక ఈసారి ఎవరిని టార్గెట్ చేస్తారు అనే విషయంలోకి వెళితే.. బిందు మాధవిని కొందరు పనిగట్టుకొని టార్గెట్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇక వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనే విషయంలో కూడా కంటెస్టెంట్స్ కు మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఇక నేడు జరగబోయే పరిణామాల వివరాల్లోకి వెళితే..

    బిందుమాధవిపై ఫోకస్

    బిందుమాధవిపై ఫోకస్

    ఇక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రం చాలా నిలకడగా ఆడుతున్నారు అనే చెప్పాలి. అవసరమైనప్పుడు వారి వాయిస్ ను గట్టిగానే వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరు బలంగా మారుతున్నప్పుడు మిగతా కంటెస్టెంట్ వారిని బలహీన పరిచే విధంగా ఆలోచిస్తారు అని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈసారి బిందుమాధవి పై అందరి ఫోకస్ పడింది.

    వరస్ట్ ఇంటి సభ్యుడు

    వరస్ట్ ఇంటి సభ్యుడు

    అయితే ఇంటి సభ్యులు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఒక వరస్ట్ ఇంటి సబ్యున్ని ఎంచుకొని బిగ్ బాస్ కు తెలపాలని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఈ క్రమంలో త ఆ టీమ్ సభ్యుల్లో ఒకడైన అజయ్ ఆమెను వరస్ట్ అని చెప్పడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక మరోవైపు అఖిల్ మరోసారి ఆమెను టార్గెట్ చేస్తూ ఆమె ఓటమిని తీసుకోలేదు అని చెప్పుకొచ్చాడు.

    పాత గొడవలు దృష్టిలో పెట్టుకొని

    పాత గొడవలు దృష్టిలో పెట్టుకొని

    ఇక నటరాజ్ మాస్టర్ పాత గొడవలు దృష్టిలో పెట్టుకొని నా వైపు వేలు చూపించి మాట్లాడింది అన్నాడు. ఇక తేజస్వి మాధివాడ కూడా ఆమెతో మాట్లాడాలని అనుకుంటే మత్కడాలని లేదని వాదిస్తోంది అని ఆమెనే వరస్ట్ ఇంటి సభ్యురాలు అని వివరణ ఇచ్చారు. ఇక వారు అలా చెబుతుంటే బిందు మాధవి అలానే సైలెంట్ గా ఉండిపోతోంది.

    లిమిట్ దాటి ఒక మాట అన్నాడు

    ఇక యాంకర్ శివ అరియానా వరస్ట్ అని చెబుతూ ఉండగా ఆమె ఎప్పటిలానే వాదించేందుకు ప్రయత్నం చేసింది. ఇక మహేష్ విషయంలో అషు రెడ్డి అప్సెట్ అయ్యింది. అతను లిమిట్ దాటి ఒక మాట అన్నాడు అన్నట్లుగా ఆమె వాదించింది. అనంతరం అరియానా కూడా మహేష్ విషయంలో తప్పే జరిగిందని చెప్పింది. ఇక మహేష్ కూడా తన వాదనను వినిపించే ప్రయత్నంలో అసహనానికి గురయ్యాడు.

    మగడివైతే ఒక్కడివే రారా

    మగడివైతే ఒక్కడివే రారా

    మగడివైతే ఒక్కడివే రారా అని గతంలో చేసిన కామెంట్ గురించి కూడా కూడా మహేష్ , అరియానా మధ్యలో వాదనలు కొనసాగాయి. అయితే ఫైనల్ గా చిరకుతో నువ్వు నేను చెప్పింది తీసుకోక పోతే ఏమి చేయలేను అంటూ అరియానా వెనుకడుగు వేసింది.

    అఖిల్ కు ప్రమాదం?

    అఖిల్ కు ప్రమాదం?

    ఇక మరోవైపు బిగ్ బాస్ తోపుడు బండిని అటువైపు ఛాలెంజర్లు ఇటువైపు వారియర్స్ తోసే విధంగా టాస్క్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ టాస్క్ లో అఖిల్ కింద పడిపోయినట్లు తెలుస్తోంది. ఇక వెంటనే పరిస్థితులు మారినట్లు అనిపిస్తోంది. టాస్క్ ఆపేసిన కంటెస్టెంట్స్ అఖిల్ ను లేపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ పరిణామాలు ఎలాంటి మలుపులను క్రియేట్ చేస్తాయో చూడాలి.

    English summary
    Bigg boss non stop telugu promo contestants targets on bindhu madhavi..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X