Bigg Boss Non Stop: ఈ వారం నామినేషన్ లో షాకింగ్ ట్విస్ట్.. ఏకంగా కత్తితో.. డేంజర్ జోన్ లో 11 మంది!
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటివారం కొన్ని ఊహించని పరిణామాలతో ఆశ్చర్యపరిచింది. ఇక రెండో వారం కూడా అలాంటి ఆరంభమే ఇచ్చింది. ఈ వారం నామినేషన్స్ లో బిగ్ బాస్ నెవ్వర్ బిఫోర్ అనేలా కొత్త ట్విస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మొన్నటివరకు కొనసాగిన ఆట ఒక లెక్క ఇప్పటి నుంచి జరగబోయే గేమ్ మరొక లెక్క అనే విధంగా బిగ్ బాస్ ల్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక ఈ వారం ఏకంగా 11 మంది నామినేషన్స్ లో నిలిచారు. ఇక ఎవరెవరు ఎలాంటి కారణాలతో నామినేట్ అయ్యారు అనే వివరాల్లోకి వెళితే..

ట్రాక్ లోకి వచ్చినట్లే..
బిగ్ బాస్ టెలివిజన్ షోకు ఓటీటీ షోకు చాలా డిఫరెంట్ ఉంటుందని ముందుగానే చెప్పారు. ఇక ఎంటర్టైన్మెంట్ విషయంలో నాన్ స్టాప్ గా ఆకట్టుకుంటామని చెప్పారు. అనుకున్నట్లే ఇప్పిడిపుడే షో కాస్త ట్రాక్ లోకి వస్తోంది అనే చెప్పాలి. కంటెస్టెంట్స్ లలో కొందరు వారి స్ట్రాటజీని కూడా స్టార్ట్ చేశారు. కొందరు మాత్రం సేఫ్ గేమ్ అడుతున్నట్లు చాలా క్లారిటీగా అర్ధమయ్యింది.

బిగ్ బాస్ కండిషన్
ఇక రెండోవారం నామినేషన్స్ విషయానికి వస్తే.. సాధారణంగా ప్రతీ వారం ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేస్తూ వచ్చారు. అయితే ఈ వారం మాత్రం వారియర్స్ గ్రూప్ నుంచి ఒక్కొక్కరు ఒక్కరినీ మాత్రమే నామినేట్ చేయాలని బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు. నామినేట్ చేయాలని అనుకునే వారి ఫొటో పై కొత్తతో గుచ్చాలని బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు.

డబుల్ మీనింగ్ డైలాగ్స్
మొదట సరయి డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో చిరాకు తెప్పిస్తున్నాడు అంటూ శివను నామినేట్ చేసింది. ఇక అషు రెడ్డి ఎవరు ఊహించని విధంగా మిత్రాశర్మను నామినేట్ చేస్తూ ఆమె గేమ్ మీద అసలు ఫోకస్ పెట్టడం లేదని మొదటి రోజు నుంచి కూడా హౌస్ లో నుంచి వెళ్లిపోతా అని అంటోందని వివరణ ఇచ్చింది.

యాంకర్ శివ vs మోనాల్
ఇక అఖిల్ అయితే యాంకర్ శివకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మోనాల్ వల్లే బిగ్ బాస్ టైటిల్ గెలవలేదు అనే ప్రశ్నలను గుర్తు చేస్తూ ఆ విషయం తనను బాగా డిస్టర్బ్ చేసిందని తనకు అది పెద్ద విషయం కాదని అలాగే తనవల్లే రన్నరప్ వరకు వచ్చానని చెప్పడం నాకు నచ్చలేదు అంటూ స్టైల్ గా శివ ఫొటోపై కత్తితో పొడిచాడు.

ఆమెను టార్గెట్ చేసి..
అనంతరం తేజస్వి అనిల్ ను నామినేట్ చేయగా.. మహేష్ విట్టా అనిల్ ను నామినేట్ చేశాడు. ఇక నటరాజ్ మాస్టర్ శివను నామినేట్ చేయడం జరిగింది. హామీదా అనుకున్నట్లే మిత్రశర్మని టార్గెట్ చేసి నామినేట్ చేసింది. వీరి నామినేషన్స్ అయితే పెద్దగా హడావుడి లేకుండా ముగిశాయి.

తేజస్వికి షాక్..
ఇక వారియర్స్ టీమ్ నుంచి ఒక్కొక్కరు ఇద్దరిద్దర్నీ నామినేట్ చేయాలి అని.. ఛాలెంజర్లు మాత్రం అవతలి టీమ్ లో ఒక్కొక్కరిని నామినేట్ చేయాలని అన్నారు. అందులో కెప్టెన్ తేజస్వి మాత్రం నామినేట్ చేయడానికి వీల్లేదని అన్నారు. వీరి నామినేషన్స్ లో అయితే పాత గొడవలు తీసి మరి గొడవ పడ్డారు.

రెండో వారంలో 11 మంది
ఇక మొత్తంగా ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసే సరికి.. రెండోవారంలో సరయు, అఖిల్, హమీదా, అనీల్, మిత్రా, అరియానా, శివ, నటరాజ్, అషురెడ్డి, శ్రీరాపాక, మహేష్ విట్టా.. ఇలా మొత్తం 11 మంది నామినేట్ అయ్యారు. ఇక వీరిలో ఎవరు వెళ్లిపోతారు అనేది హాట్ టాపిక్ గా మారింది. రెండోవారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడానికి కూడా ఒక కంటెస్టెంట్ సిద్ధంగా ఉన్నట్లు టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











