Bigg Boss Non Stop: ఎలిమినేషన్ పై అనుమానాలు.. అసలైన వాళ్ళనే తీసేస్తే ఎలా? బేరం కుదరలేదా?

బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మొదలైనప్పుడు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగానే ఓ వర్గం అభిమానులు మాత్రం అప్సెట్ అయ్యారు. మళ్ళీ పాతవారినే ఎందుకు తీసుకు వచ్చారు అనే రేంజ్ లో కామెంట్స్ అయితే గట్టిగానే వచ్చాయి. పాత వారిని వారియర్స్ గా కొత్త వారిని ఛాలెంజర్లుగా మార్చేసినా బిగ్ బాస్ రెండు వర్గాల మధ్యలో అయితే టాస్క్ లతో ఎప్పటికప్పుడు డోస్ పెంచుతున్నారు. అయితే ఎలిమినేషన్ పై మాత్రం అనుమానాలు చాలానే వస్తున్నాయి. అసలైన బలమైన కంటెస్టెంట్స్ ను తీసేస్తుండడం జనాలకు పెద్దగా నచ్చడం లేదు. ఇక మూడో వారం కూడా మరో అసలైన మరో కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ విషయంలో కూడా ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ పై వస్తున్న అనుమానాలపై ఒక లుక్కేస్తే..

బిగ్ బాస్ పై అనుమానాలు

బిగ్ బాస్ పై అనుమానాలు

బిగ్ బాస్ ఓటీటీలో నాన్ స్టాప్ షోగా స్టార్ట్ అవుతోంది అనగానే జనాలు ఈసారి ఎంటర్టైన్మెంట్ డోస్ ఎక్కువగానే ఉంటుందని అనుకున్నారు. అయితే కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మాత్రం అంచనాలకు తగ్గట్టుగా రాలేదు అని నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగానే వచ్చాయి. కానీ బిగ్ బాస్ మాత్రం ఎప్పటి తరహాలోనే కంటెస్టెంట్స్ మధ్య పోటీ తీవ్రతను పెంచి మంచి హైప్ అయితే క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో కొందరు బలానికి మంచి గట్టిగానే పోటీపడే ప్రయత్నాన్ని చేస్తున్నారు. అయితే మరికొంతమందిపై మాత్రం షోలో ఎందుకు ఉన్నారు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. నామినేషన్ లో కూడా అనుమానాలు ఉన్నట్లు ఓ వర్గం బిగ్ బాస్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 ముమైత్ ను ఎందుకు తీసేశారు?

ముమైత్ ను ఎందుకు తీసేశారు?

అసలు మొదటి వారంలోనే ముమైత్ ఖాన్ ను తీసేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. బిగ్ బాస్ లో ఆమె ఉండాల్సిన కంటెస్టెంట్. టాస్క్ ల విషయంలో కూడా బలంగానే పోరాడింది అని ఓ వర్గం వారు మద్దతు పలికారు. అయితే ఓట్ల పరంగా చూసుకున్నా కూడా ముమైత్ ఖాన్ అంతగా వెనుకబడింది లేదు. అయినప్పటికీ ఆమెను తీసేయడం వెనుక మరొక కారణం ఉండే ఉంటుంది అని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

 శ్రీరాపాక విషయంలో కూడా?

శ్రీరాపాక విషయంలో కూడా?

ఇక రెండవ వారంలో శ్రీరాపాకను ఎందుకు తీసేసారో కూడా అర్థం కాని పరిస్థితి. ఆమె తీసిపారేసేంత వీక్ అయిన కంటెస్టెంట్ అయితే ఏమీ కాదు. కాకపోతే ఆమెకు సరైన సమయం కూడా ఇవ్వలేదు అనే చెప్పాలి. మెల్లగా పరిస్థితులను అర్థం చేసుకుని అలవాటు పడి ఆటను కొనసాగించాలని అనుకుంది కానీ అప్పటి లోపే బిగ్ బాస్ అమెను బయటకు పంపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

 రొటీన్ కంటెస్టెంట్స్

రొటీన్ కంటెస్టెంట్స్

పోనీ ముమైత్ ఖాన్ శ్రీ రాపాక ఇద్దరు కూడా వీక్ అయిన కంటెస్టెంట్ అనుకుంటే వారి ఇద్దరి కంటే కూడా మిగతా కంటెస్టెంట్స్ లో చాలా మంది ఉపయోగం లేని వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పాలి. స్రవంతి అలాగే హామీదా పెద్దగా హడావుడి చేసింది ఏమీ లేదు. వారి ఆడుతున్న ఆట లో ఒక క్లారిటీ అయితే లేదు. హామీదా అయితే ఎప్పటి తరహాలోనే తన పాత స్ట్రాటజీ తరహాలో రొటీన్ గా అనిపిస్తుంది. ఇక అబ్బాయిలలో అజయ్ అనిల్ కూడా అంతగా కొత్తగా ఏమీ అనిపించడం లేదు.

పెద్ద మిస్టరీ..

పెద్ద మిస్టరీ..

ఇక ఈ సారి ఏకంగా 12 మందిని నామినేషన్ లిస్ట్ లోకి తెచ్చి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన బిగ్ బాస్ ఒక విధంగా ఓట్ల సంఖ్యను పెంచడానికి ఈ విధంగా ప్లాన్ వేశారు అని తెలుస్తోంది. అయితే కంటెస్టెంట్స్ అందరూ కూడా ఓట్లు ఎక్కువగా సంపాదిస్తే సేఫ్ అవుతారు అనుకుంటే అందుకు భిన్నంగా బిగ్ బాస్ ఆలోచిస్తూ ఉండటం విశేషం. మొదటి రెండు వారాల్లో అయితే మిత్రశర్మ వెళ్లిపోవాల్సింది. కానీ ఆమె ఎందుకు సేఫ్ అయ్యింది అనేది పెద్ద మిస్టరీ అనే కామెంట్స్ వస్తున్నాయి.

 ఆర్జే చైతు వెళ్లిపోవడం ఏంటి?

ఆర్జే చైతు వెళ్లిపోవడం ఏంటి?

ఇక ఈ వారం ఆర్జే చైతు ఎలిమినేట్ అయినట్లుగా సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాదాపు అతనే ఫిక్స్ అని కూడా చెబుతున్నారు. అయితే చైతు వెళ్లిపోవడం ఒక రకంగా బిగ్ బాస్ కు పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. అసలు తను ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ కూడా కాదు. కెప్టెన్ అవ్వడంతో సేఫ్ అయినట్లుగా తేల్చేసిన బిగ్ బాస్ మళ్లీ సడన్ గా ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

షోపై అనుమానాలు?

షోపై అనుమానాలు?

ఒక విధంగా ఆర్జే చైతు ప్రతి ఒక టాస్క్ లో కూడా చాలా బలంగా పోరాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ విషయమైనా సరే సూటిగా చెబుతున్నాడు. చాలెంజర్స్ తరపున తన వాదనను వినిపించి సీనియర్స్ కు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాడు. అలాంటిది ఆర్జే చైతును ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఒక విధంగా బిగ్ బాస్ ఎలిమినేషన్ పై కూడా అనుమానాలు కూడా చాలానే వస్తున్నాయి. పేరున్న కంటెస్టెంట్స్ ను ఉంచితే రానురాను రెమ్యునరేషన్స్ భారంగా మారుతాయని అందుకే మిగతా వారితో షోను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు వారిని తప్పిస్తున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X