Bigg Boss Non Stop: కెప్టెన్ టాస్క్ లో బొక్కబోర్లా పడిన యాంకర్ శివ.. మళ్ళీ గెలికేసిన నటరాజ్ మాస్టర్!

బిగ్ బాస్ నాన్ స్టాప్ గా మళ్ళీ ట్రాక్ లోకి లో వస్తున్నట్లు కనిపిస్తోంది. మొదట్లో కాస్త నీరసంగా కొనసాగినప్పటికీ ఇప్పుడు బిగ్ బాస్ మాత్రం టాస్క్ ల విషయంలో డోస్ పెంచడంతో ప్రేక్షకుల ఆదరణ కూడా గట్టిగానే పెరుగుతోంది గతంలో కంటే ఇప్పుడు కంటెస్టెంట్స్ కూడా చాలా కొత్తగా ఆలోచిస్తూ వారి గేమ్ ప్లాన్ ను ఆచరణలో పెడుతున్నారు. ఇక రెండవ సారి జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో అయితే కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా పోటాపోటీగా ఫైట్ చేశారు.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu

ఇక ఈ క్రమంలో మరొకసారి యాంకర్ శివ బొక్కబోర్లా పడక తప్పలేదు. ఇక చివరి క్షణంలో మాస్టర్ కూడా తట్టుకోలేకపోయాడు. ఇక జరిగిన పరిణామాలలో ఎవరెవరు ఎలా ప్రవర్తించారో అనే వివరాల్లోకి వెళితే...

చిరాకు తెప్పిస్తున్నారు

చిరాకు తెప్పిస్తున్నారు

బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో ఈసారి సీనియర్లు జూనియర్లు పాల్గొనడం చాలా కొత్తగా ఉంది అనే చెప్పాలి. గతంలో బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ వారియర్స్ గా.. అలాగే కొత్తగా వచ్చిన వారిని చాలెంజర్స్ గా విభజించిన బిగ్ బాస్ ఇద్దరి మధ్యలో పవర్ఫుల్ టాస్క్ లు పెడుతూ ఆటను మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. ఇక ఈ క్రమంలో గ్రూపులలో కూడా కొంత మందికి అసలు పడడం లేదు. ముఖ్యంగా ఛాలెంజర్స్ అయితే కొన్నిసార్లు రూల్స్ బ్రేక్ చేస్తూ మరి చిరాకు తెప్పిస్తున్నాడు అనే చెప్పాలి.

తగ్గేదే లే టాస్క్ లో..

తగ్గేదే లే టాస్క్ లో..

బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో ఈ సారి రెండవ కెప్టెన్ గా ఎవరు సెలెక్ట్ అవుతారు అనేది అందరిలో ఎంతో ఆసక్తిని కలిగించింది. ఇక బిగ్ బాస్ ఇచ్చిన తగ్గేదేలే టాస్క్ లో భాగంగా వారియర్స్ , ఛాలెంజర్లు స్మగ్లర్లు, పోలీసులుగా బాగానే పోటి పడ్డారు. కానీ స్మగ్లింగ్ చేయడంలో ఛాలెంజర్లు పట్టు సాధించారు. దీంతో వారి గ్రూప్ నుంచి నలుగురుని కెప్టెన్సి పోటీ దారులుగా ప్రకటించాల్సి వచ్చింది.

ఆ నలుగురు

ఆ నలుగురు

ఇక చాలెంజర్స్ టీమ్ అందరూ కూడా నలుగురిని ఫిక్స్ చేసే క్రమంలో చాలా తర్జనభర్జనలు పడాల్సి వచ్చింది. ఇక మిత్రశర్మను అయితే పక్కన పెట్టడంతో ఆమె ఎమోషనల్ అయిపోతూ కంటతడి పెట్టేసుకుంది. ఎవరూ పట్టించుకోవడం లేదని సరయుతో చెప్పుకుంది. ఇక మిగతా వారు ఎలిమినేషన్లో ఉన్నారు కాబట్టి అజయ్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఫైనల్ గా యాంకర్ శివ, చైతు అనిల్, శ్రీ రాపాక ఆ నలుగురు కూడా కెప్టెన్ అయ్యేందుకే పోటీ పడాల్సి వచ్చింది.

వెంటవెంటనే ట్విస్టులు

వెంటవెంటనే ట్విస్టులు

అయితే చివరి క్షణంలో బిగ్ బాస్ వెంటవెంటనే ట్విస్టులు ఇవ్వడం కంటెస్టెంట్స్ ను కాస్త కన్ఫ్యూజన్ కు గురిచేసింది. వారియర్స్ టీమ్ నుంచి కూడా మరో ఇద్దరిని కెప్టెన్సీ పోటిదారులుగా సెలెక్ట్ చేసుకోవాలి అని వారి టీం సభ్యులకు చెప్పారు. ఇక అందరూ చర్చలు జరుపుతుండగా నటరాజ్ మాస్టర్ ను పక్కన పెట్టేశారు. కానీ ఆయన మాత్రం ఈసారి తప్పకుండా కెప్టెన్ అవుతాను అని మొండిగా వాదించారు.

మరోసారి మోసం అంటూ

మరోసారి మోసం అంటూ

కానీ టీం సభ్యులు మాత్రం ఆయనను అసలు లెక్కచేయలేదు. చివరికి హామీదాను ఏకాభిప్రాయంతో నిర్ణయించడంతో మాస్టర్ తనకు గౌరవం దక్కడం లేదని అసంతృప్తి చెందారు. అందరూ న్యాయం మాట్లాడుతారు అంటారు కానీ చివరికి పొడిచేస్తారు అని మళ్లీ గ్రూపులో గెలికేసే విధంగా మాట్లాడాడు. అందరూ కలిసి మరోసారి తన మోసం చేశాడు అని కూడా నట్రాజ్ మాస్టర్ ఆవేదన చెందాడు.

చివరలో ట్విస్ట్ అనిల్ కెప్టెన్

చివరలో ట్విస్ట్ అనిల్ కెప్టెన్

ఇక ఫైనల్ గా వారియర్స్ టీమ్ నుంచి అరియానాని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక వీరందరూ టాస్క్ లో పోటీ పడగా చివరికి ఛాలెంజర్స్ టీమ్ నుంచి అనిల్, యాంకర్ శివ మాత్రమే మిగిలారు. ల్యాండ్ ఈజ్ లావా అనే ఫైనల్ టాస్క్ లో ఇటు వైపు రంగునీళ్లు.. అటు వైపు ఖాళీ కంటైనర్ పెట్టగా. ఎవరైతే కూడా కాలు కింద పెడతారో వారు ఒడినట్లు లెక్క.

ముందుగా ఏర్పర్చిన టేబుల్, మార్బల్స్ ద్వారా జంపింగ్ తో వెళ్లి ఆ రంగు నీళ్లను నింపాల్సి ఉంటుంది. ఇక చివరకు అనిల్ రాథోడ్ కాలు కింద పెట్టగా అందరూ యాంకర్ శివ మిగిలి ఉండడంతో అతనే కెప్టెన్ అనుకున్నారు. కానీ ముందుగానే అనిల్ ఎక్కువగా నీళ్ళు నింపాడు కాబట్టి అతనే కెప్టెన్ అని తేల్చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X