Bigg Boss Non Stop: ఆరియానాపై నగ్నం హీరోయిన్ కామెంట్స్.. ఆ పనులు చేయకంటూ ముఖం మీదే!
బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ షో సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ భారీ స్థాయిలో ఆదరణను అందుకుంటోంది. అదే సమయంలో దేశంలోనే మరే షోకూ దక్కనంత టీఆర్పీ రేటింగ్‌ను సైతం దక్కించుకుంటోంది. ఫలితంగా నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. దీంతో ఇప్పటికే నిర్వహకులు ఐదు సీజన్లను నిరంతరాయంగా పూర్తి చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్‌ను ప్రారంభించారు. ఇది ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎపిసోడ్‌లో ఆరియానాపై నగ్నం హీరోయిన్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

‘బిగ్ బాస్ నాన్ స్టాప్' వివరాలివే
ఓటీటీ మొదటి సీజన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్'ను ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభించారు. ఆటపాటలతో అంగరంగ వైభవంగా సాగిన ప్రారంభ ఎపిసోడ్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది మొత్తం 84 రోజుల పాటు సాగబోతుంది. ఇందులోకి 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. గత సీజన్లతో పోలిస్తే ఇందులో చాలా ప్రయోగాలు చేయబోతున్నారు నిర్వహకులు.

కంటెస్టెంట్లుగా వచ్చింది ఎవరంటే
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ఎంతో గ్రాండ్‌గా మొదలైంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు.

రెండు గ్రూపులుగా మారిన సభ్యులు
సాధారణ బిగ్ బాస్ షోలా కాకుండా నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి చాలా మంది పాత కంటెస్టెంట్లు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.ఇందులో గత సీజన్లలో పాల్గొన్న వాళ్లను వారియర్స్ అని.. కొత్త వాళ్లను చాలెంజర్స్ అని రెండు గ్రూపులుగా విభజించారు. వీళ్లకు పోటాపోటీగా టాస్కులు ఇస్తున్నారు. దీంతో కంటెస్టెంట్లు అందరూ రెండు జట్లుగా ఏర్పడి తెగ సందడి చేస్తున్నారు.

వారియర్స్‌తో జాబ్‌మేళా నిర్వహణ
తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ రెండు జట్లకు 'జాబ్ మేళా' టాస్కును ఇచ్చాడు. దీని ప్రకారం.. చాలెంజర్స్‌కు పవర్స్ ఇచ్చిన బిగ్ బాస్.. వారియర్స్‌లోని సభ్యులతో ఇంటర్వ్యూలు నిర్వహించి వాళ్లకు తగిన పని కేటాయించాలని చెప్పాడు. అందుకు అనుగుణంగానే సీనియర్స్‌తో కూడిన వారియర్స్ టీమ్ మొత్తం తమదైన శైలిలో పెర్ఫార్మెన్స్ చేసి అలరించారు.

తొమ్మిది మందికి పనులు ఇచ్చారు
ఇంటర్వ్యూలు మొత్తం ముగిసిన తర్వాత చాలెంజర్స్ టీమ్ సభ్యులు.. వారియర్స్ జట్టులోని వాళ్లకు పనులు కేటాయించారు. అందులో ముమైత్ ఖాన్‌కు మేనేజర్ పోస్ట్ కేటాయించారు. అలాగే, నటరాజ్ మాస్టర్, ఆరియానా గ్లోరి, అఖిల్ సార్థక్, తేజస్వీ మదివాడలను చెఫ్‌లుగా మార్చారు. మిగిలిన అషు రెడ్డి, హమీదా ఖతూన్, మహేష్ విట్టా, సరయులను హౌస్ కీపింగ్ టీమ్‌గా చేశారు.

ఆరియానాపై శ్రీ రాపాక కామెంట్స్
ఇక, ఇంటర్వ్యూలు చేస్తోన్న సమయంలో చాలా సంఘటనలు జరిగాయి. మరీ ముఖ్యంగా ఆరియానా గ్లోరి కొంత ఓవర్ యాక్టింగ్ చేసినట్లు అందరికీ అనిపించింది. దీంతో నగ్నం హీరోయిన్ శ్రీ రాపాక 'అమ్మా ఇక్కడ ఇంటర్వ్యూనే ఇవ్వమన్నాము. ఓవర్ యాక్టింగ్ చేయమనలేదు' అంటూ పదే పదే ఆమెపై విమర్శలు చేసింది. దీంతో ఈ టాపిక్ బాగా హైలైట్ అయిపోయింది.

సరదాగానే బదులు ఇచ్చిన భామ
శ్రీ రాపాక తనను ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావని అనడంతో ఆరియానా గ్లోరి వెంటనే స్పందించింది. అప్పుడు కూడా గొడవకు దిగకుండా 'చూడండి మేడం.. నేను పెర్ఫార్మెన్స్ ఇస్తున్నా. ఓవర్ యాక్టింగ్ చేయడం లేదు. మరోసారి అలాంటి స్టేట్‌మెంట్లు పాస్ చేయకండి' అంటూ నవ్వుతున్నట్లుగానే సమాధానం ఇచ్చింది. దీంతో ఈ గొడవ అక్కడితో సర్ధుమణిగిపోయింది.


Click it and Unblock the Notifications











