Bigg Boss Non stop: గోడవలతో ముమైత్ ఖాన్ రివెంజ్.. ఆమె అలాంటిదే అంటూ పాత గుట్టు విప్పిన నగ్నం బ్యూటీ
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ టీవీలో ప్రసారం అయినప్పుడు అంతగా బూతు కంటెంట్ ఉండేది కాదు. కానీ సెన్సార్ తో ఇబ్బంది లేని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ఉండడంతో షో నిర్వాహకులు సరికొత్తగా ఓటీటీలో స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు షో స్టార్టింగ్ లో కొంత నీరసంగా అనిపించినప్పటికి రెండు రోజుల అనంతరం అసలైన ఆట మొదలైంది. ఒకరినొకరు టార్గెట్ చేస్తూ పాత విషయాలని బయట గోడవలను కూడా బయటకు తీస్తున్నారు. ఇక రీసెంట్ గా నగ్నం హీరోయిన్ శ్రీరాపక కూడా ముమైత్ తో జరిగిన పాత గొడవల గురించి కూడా చాలా ఓపెన్ గా లైవ్ షోలో చెప్పేసింది. ముమైత్ ప్రస్తుతం కొందరికి స్పెషల్ టార్గెట్ గా నిలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆడియెన్స్ అప్సెట్..
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మొదలైనప్పుడు కాస్త డల్ గానే అనిలించింది. ముఖ్యంగా కంటెస్టెంట్స్ గా వచ్చిన సెలబ్రెటీల విషయంలో కొందరు అప్సెట్ అయినట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ ను బట్టి అర్థమైంది. ముఖ్యంగా గతంలో బిగ్ బాస్ లో పాల్గొన్న వారిని కూడా రొటీన్ గా రప్పించడంపై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ అంటే వర్కౌట్ అవుతుందా అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

ఛాలెంజర్ల దూకుడు
ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ మెల్లగా జనాలకు కనెక్ట్ అవుతోంది. రెండవ రోజు నుంచి టాస్క్ లు స్టార్ట్ అవ్వడంతో గొడవలు కూడా పెరిగాయి. ఇక బిగ్ బాస్ ఒకవైపు స్నేహాన్ని పెంచుతూనే మరోవైపు ఆవేశంతో రగిలిపోయేలా చిచ్చులు కూడా పెడుతున్నాడు. సీనియర్లు వారియర్స్ గా కొత్తగా వచ్చిన వారిని ఛాలెంజెర్స్ గా విభజించిన బిగ్ బాస్ ఎప్పటికప్పుడు టాస్క్ లో డోస్ పెంచుకతున్నాడు. ఇక డేర్ ఛాలెంజెస్ లో ఛాలెంజర్లు పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు.

అర్థం లేని గొడవలు
ఇటీవల మూడవ డేర్ లో ఆర్జే చైతు సంచాలకుడిగా ఉన్న తీరు కొందరికి చిరాకు తెప్పించింది. కొబ్బరి కాయల పీచు తీసే టాస్క్ లో వారియర్స్ టీమ్ లోని వారు పిలక లేకుండా తీసేశారని పిలక ఉండవలసిందే అని కామెంట్ చేశాడు. ఇక ఆ గొడవతో వారియర్స్ ఛాలెంజర్ల మధ్యలో మాటలా తూటాలు పేలాయి. నటరాజ్ మాస్టర్ తీవ్ర స్థాయిలో అసహనం కూడా వ్యక్తం చేశాడు.

ముమైత్ vs శ్రీరాపాక
ఇక ముమైత్ ఖాన్ అయితే తన మీద పాత రివెంజ్ ను మనసులో పెట్టుకొని ఇప్పుడు షోలో నెగిటివ్ గా ప్రవర్తిస్తుంది అని శ్రీరాపాక కామెంట్ చేసింది. నెగెటివ్, పాజిటివ్ వైబ్స్ ఛాలెంజ్ లో ఎక్కువగా థమ్స్ డౌన్ అంటూ శ్రీ రాపాకకు పెట్టేశారు. ఇక అందరూ కావాలని తనను టార్గెట్ చేస్తున్నారని వాబోయిన శ్రీరాపాక తన జీవితంలో నెగిటివ్ అనే పదాలకు చాలా దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది.
Recommended Video

రియాలిటీ షో గొడవ
ఇక అఖిల్ లాయర్ అని అనడం బాధగా అనిపించింది అని ముమైత్ ఖాన్ అయితే ఏకంగా పాత గోడవలను మనసులో పెట్టుకొని తనను టార్గెట్ చేస్తోందని చెప్పింది. ఒక రియాలిటీ షోలో జరిగిన గోడవకు రివెంజ్ గానే ముమైత్ ఇక్కడ టార్గెట్ చేసిందని ఇది కరెక్ట్ గేమ్ కాదని శ్రీరాపాక వివరణ ఇచ్చింది. ఇక ఆమె అలా చెప్పడంతో ముమైత్ కూడా హార్ట్ అయ్యింది. మరి రానున్న రోజుల్లో వీరి మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











