Bigg Boss Non Stop: వాళ్ళు లుంగీలో ఏదో చేసుకుంటున్నారని చూసా.. అరియానా, చైతు పరువు తీసేసిన తేజస్వి..

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయో చెప్పడం కష్టం గానే ఉంటుంది. మొదట స్నేహితులుగా ఉన్న వారు కూడా ఆ తర్వాత ఒక్కసారిగా శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఇక నామినేషన్ ప్రక్రియ మొదలైంది అంటే చాలు హౌస్ లో సడన్ గా వాతావరణం మారిపోతూ ఉంటుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. కొందరు కంటెస్టెంట్స్ అయితే మాటలతోనే ప్రత్యర్థులకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ఇక రీసెంట్ గా ఆర్జె చైతు, అరియానా ఫ్రెండ్షిప్ పై కూడా తేజస్వి మదివాడ ఎవరూ ఊహించని విధంగా కామెంట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

చైతు, అరియానా.. ఫోకస్ పడింది

చైతు, అరియానా.. ఫోకస్ పడింది

బిగ్ బాస్ లో పాల్గొన్న కొంతమంది కంటెస్టెంట్స్ బయట కూడా మంచి స్నేహితులుగా కొనసాగిన వారే.. కొంతమంది బయట మాట్లాడుకుని లోపల ఆటను చేశారనే ఆరోపణలు కూడా చాలానే వచ్చాయి. ఇక మరికొందరు కావాలని కొంతమందిని టార్గెట్ చేస్తున్నారు అని కూడా అప్పుడప్పుడు ఆరోపిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం అందరికీ ఫోకస్ అయితే చైతు అరియానా పై పడింది వీళ్ళిద్దరూ కూడా కలిసి గేమ్ ఆడుతున్నారు అని ఆరోపిస్తున్నారు.

ఇక్కడ కూడా స్నేహితులుగానే..

ఇక్కడ కూడా స్నేహితులుగానే..

ఇక మూడవ వారం నామినేషన్ ప్రక్రియ లో అయితే తేజస్వి మదివాడ అనుకున్నట్లే చైతు అరియానా స్నేహం పై కామెంట్ చేసింది. వీరిద్దరిని నామినేట్ చేసే క్రమంలో ఆమె పాత గొడవలను కూడా బయటకు లాగింది. ఇద్దరూ కలిసి కట్టుగా గేమ్ ఆడుతున్నారు అని బయట స్నేహాన్ని కూడా ఇక్కడ అదే పనిగా కొనసాగిస్తున్నారు అని కూడా తేజస్వి నామినేషన్ చేసేటప్పుడు గుర్తు చేసుకుంది.

పక్కనే ఉంటూ గోతులు తవ్వే రకం

పక్కనే ఉంటూ గోతులు తవ్వే రకం

స్మగ్లర్స్ vs పోలీసుల టాస్క్ లో జరిగిన ఒక గొడవను గుర్తు చేసుకున్నా తేజస్వి మదివాడ అప్పుడు తనపై అనవసరంగా నిందలు వేసేందుకు ప్రయత్నం చేశారు అని అరియానా అయితే పక్కనే ఉంటూ గోతులు తవ్వే రకం అని కూడా తేజస్వి ఆమె పరువు తీసేసింది. ఇక అదే తరహాలో ఆర్జె చైతు కూడా కావాలని తనను టార్గెట్ చేసి బ్యాడ్ చేయాలని చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

 లుంగీలో ఏదో చేస్తూ..

లుంగీలో ఏదో చేస్తూ..

చైతు ను సెకండ్ గా నామినేట్ చేస్తూ తేజస్వి ఈ విధంగా వివరణ ఇచ్చింది. స్మగ్లింగ్ టాస్క్ లో చెక్ పోస్ట్ దగ్గట వాళ్లు ముందుగానే అక్కడ చేర్స్ ని అడ్డుగా పెట్టుకుని లుంగీ లో ఏదో చేస్తూ ఉండటం నేను గమనించాను. ఆటలో భాగంగానే వాళ్ళు ఏం చేస్తున్నారా అని అని అనుమానం వచ్చి కుర్చీలను తన్ని చూడాలని అనుకున్నాను కానీ ఆ విషయాన్ని అనవసరంగా బ్యాడ్ చేసే ప్రయత్నం చేశారు. ప్రాపర్టీ డామేజ్ అయింది అని అదే పనిగట్టుకుని తనను బ్యాడ్ చేయాలని చైతు చూశాడని తేజస్వి తెలియజేసింది.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
సోలో గేమ్ అడడం లేదు

సోలో గేమ్ అడడం లేదు

ఇక తేజస్వి అరియానా చైతు ఇద్దరు కూడా బయట మంచి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా వారి స్నేహాన్ని అలాగే కొనసాగిస్తున్నారు అని వాళ్ళు సోలో గేమ్ అడడం లేదని అది ఏ మాత్రం కరెక్ట్ కాదనేది తన ఫీలింగ్ అని తెలియజేసింది. ఇక ఆమె అలా చెప్పగానే చైతూ నువ్వు చేయిర్ అలా తన్నగానే నేను ఆ బిహేవియర్ ఏమిటని అడిగాను అంటూ మీ టీమ్ మెంబర్ అరియానా కూడా దూరం నుంచి అలానే చెప్పిందని వాదన మొదలు పెట్టాడు. ఇక ఫైనల్ గా నా సెకండ్ నామినేషన్ చైతు అంటూ తేజస్వి మ్యాటర్ క్లోజ్ చేసేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X