Bigg Boss Nominations: మరో ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. వాళ్ళు ముగ్గురు తప్ప అందరూ నామినేట్!
బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు షో మొత్తానికి మూడోవారంలో కి ప్రవేశిస్తోంది. గడిచిన రెండు వారాలలో అనేక పరిణామాలతో ఈ ఓటీటీ షో ప్రేక్షకుల సంఖ్యను కూడా పెంచుకుంది అని చెప్పాలి. మొదట కాస్త నెగిటివ్ టాక్ ఎక్కువగానే వచ్చినప్పటికీ ఆ తరువాత వెంటనే నిర్వాహకులు మంచి ప్లానింగ్ తో అద్భుతమైన టాస్క్ లతో ఏదో ఒక విధంగా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేశారు. ఈ వారం ఎవరెవరు నామినేట్ అవుతారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రస్తుతం లీక్ అయిన సమాచారం ప్రకారం మొత్తం షోలో ఈ వారం 12 మంది నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది. కేవలం ముగ్గురు కంటెస్టెంట్స్ ను తప్పితే మిగతా అందరిని డేంజర్ జోన్ లో పడేసినట్లు సమాచారం. ఇక ఆ లిస్ట్ లోకి వెళితే..

టాస్క్ లతో మళ్లీ ట్రాక్ లోకి..
బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రోజురోజుకు వీక్షకుల సంఖ్యను అమితంగా పెంచుకుంటుంది. మొదట్లో ఈ షోను చూడడం కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ ఆ తర్వాత రెండు మూడు రోజులకే అసలైన టాస్క్ లతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసింది. అంతేకాకుండా వీకెండ్స్ లో నాగార్జున కూడా తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ మరింత బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇద్దరు ఎలిమినేట్
ఇక మొత్తానికి మొదటి వారంలో ముమైత్ ఖాన్ రెండవ వారంలో శ్రీరాపాక ఇద్దరూ కూడా ఎలిమినేట్ అయ్యారు. ఫైర్ బ్రాండ్ లాంటి అమ్మాయిలు మొదట్లోనే వెళ్లిపోవడంతో ఓ వర్గం ప్రేక్షకులు షాకయ్యారు. నిజానికి వారు ఇంత తొందరగా వెళ్ళి పోతారు అని ఎవరూ ఊహించలేదు. ఇక వాళ్ళిద్దరూ అనుకున్నంతగా షో లో అయితే పెద్దగా హడావిడి చేసింది ఏమీ లేదు అంతేకాకుండా అనవసరంగా వాదనలు, అవసరమైన విషయాల్లో మాట్లాడకపోవడం కూడా పెద్ద మైనస్ అని చెప్పాలి.

12 మంది నామినేట్
ఇక ఈ వారం ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది ఎవరు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. అందుకు సంబంధించిన ఎపిసోడ్ ను ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రసారం చేయబోతున్నారు. అయితే నామినేషన్స్ లో ముగ్గురు తప్ప మొత్తం 12 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ కు కంటెస్టెంట్స్ అందరూ కూడా షాక్ అయినట్లు సమాచారం.

ఈ ముగ్గురు సేఫ్
అషు రెడ్డి, అనిల్ అలాగే సరయు మాత్రమే నామినేషన్స్ నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు ఒక విధంగా గడిచిన రెండు వారాలలో చాలా తెలివిగా అడుగులు వేస్తూ ముందుకు వచ్చారు. ముఖ్యంగా అషు రెడ్డి అయితే ఒక వైపు గొడవలు పడుతున్నప్పటికీ కూడా ఆ తరువాత మరి కొంతమందిని తనవైపుకు తిప్పుకునే విధంగా మాటలతో మాయ చేస్తోంది.
Recommended Video


12 మందిలో.. వెళ్లిపోయేది ఎవరు?
ఇక మిగతా కంటెస్టెంట్స్ మహేష్ విట్టా, అఖిల్, తేజస్వి, అరియానా గ్లోరీ, అజయ్, నటరాజ్ మాస్టర్, బిందు మాధవి, మిత్రశర్మ, యాంకర్ శివ, ఆర్జే చైతు, హామీదా, శ్రవంతి.. ఇలా మిగిలిన 12మంది కంటెస్టెంట్స్ అందరూ కూడా నామినేషన్స్ లో ఉన్నట్లు బిగ్ బాస్ సరికొత్త ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వీరిలో ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్ళి పోతారు అనేది ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











