Bigg Boss Non Stop: అఖిల్‌కు చుక్కలు చూపించిన బిందు మాధవి.. బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి ఇలా..
రెండు వారాలపాటు ఎంతో ఆసక్తికరంగా కొనసాగిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మూడవ వారం నామినేషన్ ప్రక్రియలో మరో కీలక మలుపు తిరగబోతోంది నిన్న మొన్నటి వరకు చాలా సరదాగా కనిపించిన వారు కూడా ఇప్పుడు శత్రువులుగా మారిపోతున్నారు. కంటెస్టెంట్స్ అసలైన ఆయుధం నామినేషన్ ప్రక్రియను వాడుతూ గేమ్ చేంజ్ చేశారు. ఇక మరొకసారి అయితే బిందుమాధవి తన ఆలోచనా విధానంతో మాటలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా అఖిల్ కు చుక్కలు చూపించింది అనే చెప్పాలి. బిగ్ బాస్ మొదటిసారి హయ్యెస్ట్ కంటెస్టెంట్స్ ఒకేసారి నామినేషన్స్ లో నిలవడం విశేషం.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా..
మొదటి వారం అంతంతమాత్రంగానే కొనసాగిన బిగ్ బాస్ రెండవ వారం మాత్రం ఆసక్తికరమైన టాస్క్ లతో చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ వైవిధ్యాన్ని ట్విస్ట్ లతో కంటెస్టెంట్స్ అందరికీ కూడా షాక్ ఇస్తున్నాడు అని చెప్పాలి. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా చాలా రసవత్తరంగా కొనసాగింది. ఎవరు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నామినేషన్ ఆయుధాన్ని ఉపయోగించుకున్నారు. నామినేట్ చేయాలని అనుకునేవారు కెనాల్ తో రంగులు కొట్టాలి అని బిగ్ బాస్ సూచించాడు.

అరియానా vs తేజస్వి
బిగ్ బాస్ లో ఈసారి అరియానా, తేజస్వి మదివాడ గొడవ రోజురోజుకీ తీవ్రతరంగా మారుతోంది. తేజస్వి ఆమెను నామినేట్ చేస్తూ.. ఆమె పక్కనే ఉంటూ గోతులు తవ్వుతూ చాలా మోసాలకు పాల్పడుతుంది అని కౌంటర్ ఇచ్చింది. ఇక ఆ తర్వాత అరియానా తేజస్వి వాదనకు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది కానీ ఆమె అనవసరపు వివాదాలను లాగి పరువు పోగొట్టేకుంది.

వెక్కిలి నవ్వులు
ఇక స్రవంతి.. హమీదని నామినేట్ చేస్తూ.. తనతో కనెక్షన్ కుదరడం లేదని అలాగే మిత్ర శర్మని కూడా నామినేట్ చేసింది. ఆర్జే చైతు వెక్కిలి నవ్వులు అంటూ తేజస్విని నామినేట్ చేశాడు. అలాగే మిత్ర శర్మని కూడా నామినేట్ చేశాడు. మహేష్ విట్టా పాత గోడవలతో అజయ్ ని, నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేశాడు.

యాంకర్ శివతో మాస్టర్ గోడవ
అషురెడ్డి.. మహేష్ విట్టాని, మిత్ర శర్మలను నామినేట్ చేసింది. యాంకర్ శివ.. నటరాజ్ మాస్టర్ గొడవ కూడా రోజురోజుకు మరింత ఎక్కువైంది. నటరాజ్ మాస్టర్ అనవసరంగా కొన్నిసార్లు ఫిజికల్ ఎటాక్ లో రెచ్చిపోతున్నాడు అంటూ శివ నామినేట్ చేశాడు. అలాగే అఖిల్ కు నామినేట్ చేశాడు శివ.

అఖిల్ vs బిందు మాధవి
ఇక అందరిదీ ఒక ఎత్తు నామినేషన్స్ అయితే బిందుమాధవి నామినేషన్ మాత్రం మరొక విధంగా జరిగింది. మొదటి తేజస్విని నామినేట్ చేస్తూ టాస్క్ కు మొదలైతే ఈ అమ్మాయి పద్ధతి నాకు ఏమాత్రం నచ్చలేదు అంటూ అసలు తను చెప్పే వాటికి చేసే వాటికి ఏ మాత్రం సంబంధం ఉండదు అని కౌంటర్ ఇచ్చేసింది. ఇక ఆ తర్వాత అఖిల్ విషయంలో కూడా బిందు మాధవి పాత గొడవలు తవ్వి తీస్తూ చుక్కలు చూపించేసింది మ

స్ట్రాంగ్ కౌంటర్స్
తిండి దగ్గర జరిగిన గొడవలను కూడా లాగిన బిందు మాదబి గొడవపడి అనంతరం ఎదురుగా ఉన్న వ్యక్తి నీకు ఫుడ్ పెడితే.. ఇంత గొడవ అనంతరం కూడా మేం పెడితే తింటావరా? అని అంటే.. ముద్ద వెళ్లదు.. అని పాత విషయానికి బిందు గట్టిగా కౌంటర్ ఇచ్చేసింది. ఇక బిందు మాధవి మాటకు సరిగ్గా సమాధానం చెప్పలేకపోయిన అఖిల్.. ఆ విషయాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నావ్ అంటూ మాట మార్చేశాడు.

ఇచ్చి పడేసిన బిందుమాధవి
ఇక అన్నం పెట్టేవాళ్లు బేసిక్ సెన్స్ తెలుసుకోవాలి అంటూ చురకలు అంటించిన బిందు మాధవి ఓడిపోతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని అనవసరంగా నిందలు వేస్తున్నారని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా హౌస్ లో అలగడంలో అతనే ఫస్ట్ అని కూడా కౌంటర్ ఇచ్చేసింది. ఇక బిందు మాటలకు అఖిల్ కు కొన్నిసార్లు ఏం మాట్లాడాలో తెలియలేదు.
Recommended Video


హయ్యెస్ట్ నామినేషన్..
ఫైనల్ గా మూడవ వారం నామినేషన్ ప్రక్రియలో ఏకంగా 12 మంది నామినేట్ అయ్యాడు. 15 మందిలో అనీల్, సరయు, అషు తప్పితే మిగిలిన 12 మంది నామినేట్ అయ్యారు. బిగ్ చరిత్రలోనే ఇదే హయ్యెస్ట్ నామినేషన్.
మిత్ర శర్మ, శివ, చైతూ, తేజస్వి, అజయ్, స్రవంతి, అఖిల్, మహేష్, హమీదా, నటరాజ్, అరియానా, బిందు మాధవిలు నామినేట్ అయ్యారు. ఇక మొదటివారం తప్పించుకున్న మిత్ర శర్మ పై ఈసారి అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











